Wednesday, September 23, 2026
22.5 C
Hyderabad

జీఎస్టీకి సహేతుక పద్ధతి కావాలి!|EDITORIAL

ఒకే దేశం, ఒకే పన్ను పేరుతో ఇంతకాలంగా జరిగిన జీఎస్టీ దోపిడీ కట్టడి అయినట్లేనా? పన్ను విధించిన ప్రభుత్వమే పదేళ్ళ తర్వాత ఆ పన్నును సవరించడం సంతోషించాల్సిందే. కానీ, ఇప్పటిదాకా ప్రజల ముక్కు పిండి వసూలు చేసిన పన్నులకు ఎవరు సమాధానం చెబుతారు? ప్రజలను పీల్చి పిప్పి చేసి, లబోదిబో మంటున్నా వినకుండా గత దశాబ్ద కాలంలో లక్షల కోట్లు గుంజుకున్నారు. ఇప్పుడు జీఎస్టీ హేతుబద్దీకరించి, కొంతమేర తగ్గించి జబ్బలు చరుచుకుంటున్నారు. జీఎస్టీ ప్రవేశ పెట్టినప్పుడే హేతుబద్దత గురించి అన్ని వర్గాల ప్రజలు నాయకులు అనేక వినతులు చేసినా పెడచెవిన పెట్టారు. అధికారం ఉంది కదాని ఇష్టానుసారం పన్నులు పెంచారు. ముక్కుపిండి వసూలు చేశారు. ఆర్థికవృద్ధి మందగించడం, గృహ రుణాలు పేరుకుపోవడం, పొదుపు క్షీణించడం, బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు, ట్రంప్‌ టారిఫ్‌లే జీఎస్టీ రేట్ల మార్పునకు కారణంగా కనిపిస్తున్నది. దేశం ఆర్థిక శక్తిగా ఎదగడానికి పన్నుల విధానం తోడ్పడాలే కానీ, గుదిబండ కాకూడదు.
నిజానికి పన్నులు హేతుబద్దంగా ఉండాలి. భారతదేశం లో పేద మధ్య తరగతి ప్రజలే ఎక్కువ. వారి జీవితాలు, జీత భత్యాలు అంతంత మాత్రమే. వీటిని గుర్తించకుండా 18శాతం, 28శాతం వరకు జీఎస్టీ పేరుతో వసూళ్లు చేశారు. ఇప్పుడేమో సంస్కరణలు ఇప్పుడే గుర్తుకు వచ్చినట్లు ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. ‘మా ప్రతిపాదనలకు జీఎస్టీ కౌన్సిల్‌ అంగీకారం తెలిపింది. ఈ విషయం ప్రజలతో పంచుకోవడం సంతోషంగా ఉంది. జీఎస్టీ సంస్కరణలు పౌరుల జీవితాలను మెరుగుపరుస్తాయని అనడం నయ వంచనే. కరోనా సమయంలో ప్రజలు హాహాకారాలు చేసినా జీఎస్టీ తగ్గించాలని గుర్తుకు రాలేదు. ఓట్ల కోసం పథకాలు ప్రకటించడం, వాటి అమలు కోసం పన్నులు వసూలుచేసి పందేరం చేయడమేనా పాలన అంటే. ప్రజలు స్వేచ్ఛగా స్వచ్ఛందంగా కట్టగలిగేలా పన్నుల విధానం ఉండాలి. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ సహా, నల్లడబ్బు రూపంలో తరలకుండా సరళీకృత పన్ను విధానాలు ఉండాలి.
సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరచడం, ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, జీఎస్టీ మండలి ఆమోదించింది. చిరు వ్యాపారులు, రైతులు, మధ్యతరగతి, మహిళలు, యువతకు మేలు కలుగుతుందని ప్రభుత్వం చెబుతోంది.
దేశంలో ప్రతిసారి దసరా, దీపావళికి ముందే పండుగ వస్తోంది. పండుగ సరుకులన్నీ అగ్గువకే అంది వస్తాయని అంటున్నారు. మనదేశంలో 5శాతం గరిష్ట పన్నుల విధానం సరిపోతుంది. ప్రతి ఒక్కరూ పన్నులు కట్టేలాగా, అవి దేశ అభివృద్దికి వినియోగించేలా ఉండాలి. ప్రస్తుత సరళీకరణతో పాలు, పనీర్‌, బిస్కెట్లు, సబ్బులు, షాంపూల నుంచి ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, చిన్న కార్లు, బైకుల దాకా ధరలు దిగొస్తాయని అంటున్నారు. దసరా నవరాత్రులు ప్రారంభమయ్యే ఈ నెల 22వ తేదీ నుంచి జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్‌ బుధవారం పచ్చజెండా ఊపింది. ప్రస్తుతమున్న నాలుగు శ్లాబులు ఇకపై 5శాతం, 18శాతం పన్నురేట్లకే పరిమితం కానున్నాయి. ఆరోగ్య, జీవిత బీమాపై జీఎస్టీ రద్దుతోపాటు 33 రకాల అత్యవసర మందులపై ప్రస్తుతమున్న 12శాతం పన్నును పూర్తిగా తొలగించారు.
కరోనా తరవాత ఔషధాల ధరలు అనూహ్యంగా పెరిగాయి. వ్యవసాయం, వైద్య రంగానికి ఊరట కలిగించే నిర్ణయాలకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. జీఎస్టీ ఫైలింగ్‌ను కూడా సరళతరం చేస్తున్నామన్నారు. కొత్త స్లాబ్‌లతో పేదలు, మధ్య తరగతి ప్రజలకు ఊరట కలుగుతుందన్న నిర్మలా సీతారామన్‌ చాలా ఆహార పదార్థాలపై సున్నా శాతం జీఎస్టీ ఉంటుందన్నారు. పేదలు, సామాన్యులు అధికంగా వాడే వస్తువులపై 5శాతం జీఎస్టీ ఉంటుందన్నారు. ప్రాణాధార ఔషధాలపై ఎటువంటి పన్ను లేదు.
అమెరికా సుంకాల భారం నుంచి కొంత ఉపశమనం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశీయ వాణిజ్యాన్ని పరుగు పెట్టించేందుకు, వినియోగాన్ని గణనీయంగా ప్రోత్సహించే దిశగా నిర్ణయాలు తీసుకున్న జీఎస్టీ మండలి, పండగ సీజన్‌ను మరింత ఉత్సాహభరితంగా మార్చింది. వ్యక్తిగత బీమా పథకాలపై జీఎస్టీ రద్దు చేయడం.. కోట్ల మందికి బీమాను చేరువ చేసేందుకు ఉపయోగపడనుంది.
ఔషధరంగాన్ని కట్టడి చేయాలి. ధరలను పెంచుతున్న ఫార్మా కంపెనీలకు ముకుతాడు వేయాలి. నిర్మాణ రంగాలకు ప్రోత్సాహం ఇవ్వాలి. అమెరికాను సుంకాలపై తిడుతూ మనమే మన ప్రజలపై అత్యధిక సుంకాలను విధించుకోవడం సరికాదు. విమానయాన రంగం ప్రజలకు మరింత చేరువ కావాలి. ప్రస్తుత విమాన టిక్కెట్‌ ధరలను సమీక్షించాలి. ఇందుకు ముందుగా రాజకీయంగా ఖర్చులు తగ్గించు కోవాలి. జీత భత్యాలను తగ్గించాలి. రాజకీయ నాయకుల పెన్షన్లు ఎత్తేయాలి. రాజకీయ ఖర్చులు, అవినీతి కారణంగా దేశం భ్రష్టుపడుతున్న వేళ సంస్కరణలు ఈ దిశగా సాగాలి. రాష్ట్రాల్లో ఇష్టారీతిన ఉచిత పథకాలు ప్రకటించడం, జీఎస్టీ డబ్బుల కోసం కేంద్రం వద్ద యాచించడం రాష్ట్రాలు మానుకోవాలి. ప్రజలను పీడించి పన్నులు వేయడం సరి కాదని గుర్తించాలి.

Latest News

గా ఊర్ల పేమ పెండ్లిల్లు నిషేధం!?|ADUGU TRENDS

ఇగీ మద్దెల ఏడ సూసినా, లవ్వు మ్యారేజీలు, లివింగ్ టుగెదర్లేనాయె! గియి ఊర్లు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి దేశాలు, ఖండాంతరాలకు విస్తరించినయి. ఇగ కులం లేదు, మతం లేదు. ఇల0 లేదు....

యూపీ విభజన ప్రతిపాదనా? రాజకీయ వ్యూహమా?|EDITORIAL

దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై చర్చ జరగడం సహజమే. కానీ ఇలాంటి నిర్ణయాలు ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. యూపీ విభజనపై రాజ్‌భర్‌ చేసిన ప్రకటన అధికారిక విధానంగా మారుతుందా?...

సెప్టెంబర్ 23, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 08.43 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శ్రవణ ఉదయం 08.18 వరకు ఉపరి ధనిష్ఠ యోగం సుకర్మ సాయంత్రం 04.50 వరకు ఉపరి ధృతి కరణం బవ ఉదయం 08.03...

పుతిన్ తిరుగులేని నేతేనా!?|EDITORIAL

పుతిన్ రాజకీయ పట్టు బలపడినప్పటికీ, ప్రతిపక్ష స్వేచ్ఛ, ఎన్నికల పారదర్శకత, యుద్ధానికి ముగింపు వంటి అంశాలపై రష్యా ఎదుర్కొంటున్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఆధిపత్యాన్ని కేవలం సీట్ల సంఖ్యతో...

బంగారం కొనే ముందు గీ మూడు సూడాలే!|ADUGU TRENDS

మనం బంగారం, నగలు ఏడ కొంటం? ఔసలోల్ల దగ్గర, బంగారం దుకాణాల్ల కొంటం .పెద్దపెద్ద దుకాణాలకు కూడా పోయేటోల్లు ఉంటరు. కానీ, గీ మూడు ముఖ్యమైన ముచ్చట్లు పట్టించుకోం. కానీ మన సర్కార్...

సెప్టెంబర్ 22, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 07.23 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.14 వరకు ఉపరి శ్రవణ యోగం అతిగండ సాయంత్రం 04.49 వరకు ఉపరి సుకర్మ కరణం వణజి ఉదయం 06.34...

సెప్టెంబర్ 21, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు దశమి సాయంత్రం 05.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది యోగం శోభ సాయంత్రం 04.30 వరకు ఉపరి అతిగండ కరణం గరజి సాయంత్రం 05.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News