హెల్మెట్లు పంపిణీ చేయడం అభినందనీయం
మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే యశస్విని
తొర్రూరు పట్టణంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ లో రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ల పంపిణీ కార్యక్రమానికి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ…. స్వయంగా హెల్మెట్ ధరించి, వాహనదారులకు రక్షణా అవసరాన్ని వివరించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించడం ఎంత ముఖ్యమో వివరించారు. ద్విచక్ర వాహనదారుల ప్రమాదాలను తగ్గించడానికి హెల్మెట్ ధరించడం కీలకమని సూచించారు. ప్రజల ప్రాణాలను కాపాడే చర్యల్లో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు అవసరమన్నారు. ఈ కార్యక్రమన్ని ఏర్పాటు చేసిన మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ తీసుకున్న ఈ మంచి ప్రయత్నాన్ని వారు అభినందించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసు అధికారులు, రోడ్డు భద్రతా నిపుణులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

