ఉపాయం లేనోన్ని ఊల్లెనే ఉండనీయొద్దట! గందుకే ఉపాయమున్న గీయినె, ఊల్లు తిరుగుతాండు!! ఊల్లు తిరుగుడంటే, ఊల్లు పట్టుకుని తిరుగుతాండని కాదుల్లా… ఇట్టమైన ఊల్లని ఏ కట్టం లేకుండా తిరుగుతాండు. గదెట్లంటరా? ఇగో మీరే సదువుండ్రి.

గీయినె పేరు రాకీ కటారియా. హరియాణాలోని సోనీపత్ గాయినె ఊరు. ఆయనకో ట్రాక్టరున్నది. గా ట్రాక్టర్ ను ఉపాయంతోటి కదిలే ఇల్లు లెక్క శేసుకుండు. గండ్లనే వండుకోవచ్చుట. గండ్లనే తినొచ్చట. గండ్లనే పండుకోవచ్చట. సింగిల్ బెడ్ రూం ఇల్లన్నట్లు. గదాని మీదనే ఎక్కడికంటే గక్కడికిపోవచ్చట. ఇగ గదాని మీదనే లద్దాఖ్ అసొంటి ఎత్తైన పదేశాలను కూడా సుట్టొచ్చిండిట. ఇగ గాయినె కుటుంబంతోటి నేపాల్ కు పోయి, నాలుగు రోజులుండి రావాల్నని అనుకుంటాండంట. మంచిగుంది కదా? గీ రాకీ కటారియా ముచ్చట!

