మహబూబ్‌నగర్ పాలిటెక్నిక్ కాలేజీలో బాలికల వాష్‌రూంలో వీడియో రికార్డింగ్ ఘటన కలకలం సృష్టించింది. విద్యార్థినులు అనుమానాస్పదంగా వీడియో రికార్డింగ్ జరుగుతుందిని గుర్తించి, అధికారులకు సమాచారం అందించారు. విచారణలో సిద్ధార్థ్ అనే విద్యార్థి ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. బ్యాక్లాగ్ పరీక్ష రాయడానికి వచ్చిన అతడు, వాష్‌రూంలో మొబైల్ పెట్టి రహస్యంగా వీడియో తీశాడు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తూ కాలేజీ ఎదుట ధర్నా నిర్వహించాయి. బాధ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల జోక్యంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

