Saturday, September 19, 2026
23.7 C
Hyderabad

చీప్… లిక్కర్ కేసు?!|EDITORIAL

లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రే నెలల తరబడి జైలులో ఉండటం, మాజీ ఉప ముఖ్యమంత్రి రెండేళ్లకు పైగా నిర్బంధంలో ఉండటం, తెలంగాణ సీఎం కూతురు, మాజీ ఎంపీ, ప్రముఖ నాయకురాలు అరెస్టు కావడం వంటివన్నీ ప్రజాభిప్రాయంపై ప్రభావం చూపాయి. అయితే, విచారణ సుదీర్ఘకాలం సాగి, చివరకు అభియోగాలు నిలవకపోతే, ఆ కాలంలో ఆ వ్యక్తుల రాజకీయ, సామాజిక జీవితం, పరువు నష్టం, ఇమేజీ డ్యామేజీ అవడం, ప్రజల్లో, పార్టీపై ప్రభావం వంటి వాటికి బాధ్యులెవరు?

అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే వారిని నిర్దోషులుగా భావించవచ్చా? ఈ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ పై కోర్టుకు, ఆపై కోర్టుకు, ఇంకో పై కోర్టుకు అప్పీలు చేసుకోవచ్చు. ఈ దశలో బలహీనపడిన కేసు, ఉన్నత న్యాయస్థానాల తీర్పులు వేర్వేరు దిశల్లో వెళ్లవచ్చు. చట్ట ప్రక్రియకు గౌరవం ఇవ్వాలి. కోర్టులు తుది నిర్ణయాధికారులు. కాబట్టి రాజకీయ వ్యాఖ్యానాల కంటే, న్యాయపరమైన స్పష్టత ముఖ్యం.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

దేశ రాజకీయాల్లో సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు పరిణామాలు ఇప్పుడు కీలక మలుపు తిరిగాయి. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ, కల్వకుంట్ల కవిత సహా పలువురు నేతలకు భారీ ఊరట లభించింది. తాజాగా విచారణ చేపట్టిన రౌస్ అవెన్యూ కోర్టు నిందితులందరిపై నమోదైన సరైన ఆధారాలు లేకుండానే కేసులు నమోదు చేశారని, నిరూపించలేకపోయారని, ఈ కేసులో సీబీఐ అధికారులపై కేసులు పెట్టాలని కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అభియోగాలు ఎన్నైనా మోపొచ్చు కానీ, వాటిని నిరూపించే సాక్ష్యాధారాలే ముఖ్యం.

కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ దేశంలో అత్యున్నత విచారణ సంస్థలుగా పేరుగాంచాయి. వీటి చర్యలు చట్టబద్ధత, పారదర్శకత, వాస్తవాధారాలపై నిలబడాలి. అయితే ఈ కేసులో కోర్టు అడిగిన ప్రశ్నలకు ఆ రెండు సంస్థలు జవాబివ్వలేకపోయాయి. రాజకీయ కక్షతో పెట్టిన కేసుగా ఇప్పటి దాకా వస్తున్న ఆరోపణలు నిజమనే విధంగానే దర్యాప్తు సంస్థల తీరు ఉంది. వాటిని బలపరుస్తున్నట్లుగానే కోర్టు తీర్పును బట్టి తెలుస్తోంది. దర్యాప్తు సంస్థలు రాజకీయ ప్రభావాలకు అతీతంగా పనిచేయాలన్నది మూల సూత్రం. ప్రతిపక్ష నేతలపై కేసులు నమోదయ్యే ప్రతి సందర్భంలో “రాజకీయ ప్రతీకారం” అన్న ఆరోపణలు వినిపించడం కూడా సాధారణమైంది. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఈ విమర్శలు కొత్తవేమీ కావు.

దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పాగా, ఇతర రాష్ట్రాల్లో విస్తరణకు ప్రయత్నాలు, పంజాబ్ లో సాధించిన విజయం రాజకీయ సమీకరణాలను మార్చాయి. సరిగ్గా ఆ సమయంలోనే లిక్కర్ పాలసీ కేసు వెలుగులోకి రావడం, అరెస్టులు జరగడం అనుమానాలకు తావిచ్చింది. ముఖ్యమంత్రే నెలల తరబడి జైలులో ఉండటం, మాజీ ఉప ముఖ్యమంత్రి రెండేళ్లకు పైగా నిర్బంధంలో ఉండటం, తెలంగాణ సీఎం కూతురు, మాజీ ఎంపీ, ప్రముఖ నాయకురాలు అరెస్టు కావడం వంటివన్నీ ప్రజాభిప్రాయంపై ప్రభావం చూపాయి.
అయితే, న్యాయ ప్రక్రియలో అరెస్టు అనేది శిక్ష కాదు. అది విచారణలో భాగం మాత్రమే! కానీ విచారణ సుదీర్ఘకాలం సాగి, చివరకు అభియోగాలు నిలవకపోతే, ఆ కాలంలో వ్యక్తుల రాజకీయ, సామాజిక జీవితం దెబ్బతినడం సహజం. అనివార్యం. పరువు నష్టం, ఇమేజీ డ్యామేజీ అవడం, ప్రజల్లో, పార్టీపై ప్రభావం తిరిగి పూడ్చుకోవడం కష్టం. ఈ మొత్తానికి బాధ్యులెవరు?

మరోవైపు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే వారిని పూర్తిగా నిర్దోషులుగా భావించవచ్చా? ఈ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ పై కోర్టుకు, ఆపై కోర్టును సవాల్ చేస్తూ ఇంకో పై కోర్టుకు, ఇలా సుప్రీం కోర్టు దాకా అప్పీలు చేసుకోవచ్చు. ఈ దశలో బలహీనపడిన కేసు, ఉన్నత న్యాయస్థానాల తీర్పులు వేర్వేరు దిశల్లో వెళ్లవచ్చు. చట్ట ప్రక్రియకు గౌరవం ఇవ్వాలి. కోర్టులు తుది నిర్ణయాధికారులు. కాబట్టి రాజకీయ వ్యాఖ్యానాల కంటే, న్యాయపరమైన స్పష్టత ముఖ్యం.

అయితే, ఈ కేసు పరిణామాల నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా పని చేస్తున్నాయా? లేదా? లేకపోతే, వాటి స్వతంత్రతను ఎలా కాపాడాలి? నియామక విధానంలో మార్పులు అవసరమా? పార్లమెంటరీ పర్యవేక్షణ బలోపేతం చేయాలా? లేక న్యాయపరమైన పర్యవేక్షణ సరిపోతుందా? ఈ ప్రశ్నలు ఇప్పుడు చర్చించాల్సిన ఆవశ్యకత ఉంది.

అవినీతి, అధికార దుర్వినియోగం కూడా ప్రమాదమే. ఒకదాన్ని అడ్డుకునే పేరుతో మరొకదాన్ని పెంపొందించ కూడదు. చట్టం ముందు అందరూ సమానమనే భావన బలపడాలి. అదే సమయంలో, చట్ట అమలు సంస్థలు కూడా తమ చర్యలకు జవాబుదారీగా ఉండాలి.

ఈ కేసు రాజకీయంగా ఎవరికీ లాభమో, ఎవరికి నష్టమో ఆయా పార్టీలు, నేతలు నిర్ణయించుకోవాలి. కానీ, సాక్ష్యాలు బలంగా ఉంటేనే కేసులు నిలబడతాయి. దోషులకు శిక్షలు పడతాయి. లేకపోతే అనుమానాలు పెరుగుతాయి. ఇలాంటి కేసుల నమోదులో రాజకీయ ప్రభావాలు? కక్షలు, ప్రలోభాలు? లొంగదీసుకోవడాలు వంటివేవున్నా, దర్యాప్తు సంస్థల స్వయం ప్రతిపత్తికి సవాల్ గా నిలుస్తున్నాయి. మన దేశంలో రాజకీయ కేసులు నిలబడవనే నానుడి మారోసారి రుజువైంది.

Latest News

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News