Monday, August 3, 2026
31.5 C
Hyderabad

నేపాల్ లో ఏం జరుగుతోంది?!|EDITORIAL

నేపాల్ లో అంతర్గత సంక్షోభం ఎందుకు వచ్చింది? సోషల్ మీడీయా, మెస్సేజింగ్ యాప్స్ నిషేధం వల్లేనా? మరి నేపాల్ లో పెచ్చరిల్లిన వర్ణ, వర్గ వివక్ష, సామాజిక, ఆర్థిక అసమానతలు, అవినీతి, బంధుప్రీతి, నిరుద్యోగిత, అధికారస్వామ్యం, అనేక ఉద్యమాలు, రాచరికాన్ని పున:ప్రతిష్టించే చర్యలు, నిరసనలు, మావోల ఉద్యమాలు, ప్రభావాలు ఎందుకున్నట్లు? పౌరులు, ప్రత్యేకించి యువత ఎందుకు ప్రభుత్వాన్నే కూల్చేందుకు తమ ప్రాణాలకు తెగిస్తున్నది?

నేపాల్ ప్రస్తుత అంతర్గత సంక్షోభం కేవలం సోషల్ మీడియాపై నిషేధం వల్లే ఏర్పడిందన్న తప్పుడు భావనలు ప్రపంచానికి చేరడం అంత మంచిది కాదు. సోషల్ మీడియా ప్రభావాన్ని కాదనలేం. ప్రజలు దానికి బానిసలవడం కూడా నిజమే. అందులోనూ అవాంఛిత అంశాలనేకం విశృంఖలంగా పరివ్యాప్తం అవుతున్నాయి. ఇవ్వాళ సోషల్ మీడియాను అదుపుచేసే స్థితిలో ప్రభుత్వాలు లేవు. కనీస నియంత్రణ కూడా వాటికి లేదు. అవి పెచ్చరిల్లినప్పుడు వచ్చే ఉపద్రవాలకు కళ్ళ ముందే కనిపిస్తున్న వాస్తవం నేపాలే.

నేపాల్ ప్రస్తుత సంక్షోభంపై సవివరణలతో సహేతుకంగా ‘అడుగు’ చీఫ్ ఎడిటర్ డాక్టర్ మార్గం లక్ష్మీనారాయణ తేల్చి చెప్పిన నేపాల్ సంక్షోభం-కారణాలు-పరిష్కారాలు

నేపాల్ సంక్షోభం-కారణాలు-పరిష్కారాలు

‘ఇక్కడ భూకంపాలు రావాల్సిన పనిలేదు. అంతకుమించి, నేపాల్ నిత్యం అవినీతితో వణికిపోతోంది’ ఇది నేపాల్ తాజా ఉద్యమంలో పాల్గొన్న ఓ విద్యార్థి పట్టుకున్న ప్ల కార్డుపై రాసి ఉన్న వాక్యాలు. ప్రస్తుతం ఆ దేశ అంతర్గత సంక్షోభానికి అద్దం పడుతున్నది. ఆందోళన చేస్తున్న యువత అవినీతికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. నేపాల్‌లో రాచరికాన్ని పునరుద్ధరించాలన్న కొన్ని నెలల కిందటి ఒక ఉద్యమం జరిగింది. ఆ సమయంలో కూడా నిరసనకారులు వ్యవస్థలో ప్రబలంగా అవినీతి పేరుకపోయిందన్న ఆరోపణలు చేశారు. మరి సోషల్ మీడియాని నిషేధించిన కారణంగానే నేపాల్ సంక్షోభం తలెత్తిందా? అంటే అది ఒక సాకు మాత్రమే. ఆ కారణాన్ని బేస్ గా చేసుకుని అల్లరి చెలరేగింది. అది దావానలంలా వ్యాపించింది. సైన్యానికి సైతం లొంగని రీతిలో విజృంభిస్తోంది.

నేపాల్ లో సెప్టెంబర్ 4న ఫేస్‌బుక్, ఇన్‌స్టా, వాట్సాప్ వంటి 26 ప్రముఖ సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లను ప్రభుత్వం నిషేధించింది. నిషేధిక ఆజ్ఞలను పాటించడానికి వారం సమయమిచ్చింది. చైనా సోషల్ మీడియా టిక్‌టాక్ ఈ షరతులను సకాలంలో పాటించడం వల్ల నిషేధించలేదని లేదు. అయితే, నేపాల్‌ ప్రజలు, ప్రత్యేకించి యువత పెద్ద సంఖ్యలో విదేశాల్లో నివసిస్తున్నారు. మెసేజింగ్ యాప్‌లు, సోషల్ మీడియాపై నిషేధం వల్ల తమ కుటుంబాలను కాంటాక్ట్ అవ్వడానికి ఇబ్బందులు పడుతున్నారు. దీంతో యువత నిరసనలకు పిలుపునిచ్చారు. టిక్‌టాక్ ప్రస్తుతం నేపాల్‌లో ట్రెండింగ్‌లో ఉంది. పైగా నిషేధిత జాబితాలో ఎలాగూ లేదు. టిక్‌టాక్‌లో అనేక వీడియోలను షేర్ చేసి, నిరసనలో చేరాలని యువతకు విజ్ఞప్తి చేశారు. ఉద్యమాన్ని ఉధృతం చేశారు. టిక్‌టాక్‌లో ‘నెపో బేబీ’ ట్రెండ్ కూడా ప్రారంభమైంది. ఇందులో రాజకీయ నాయకుల పిల్లల విలాసవంతమైన జీవితానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేశారు. వీటితో నేపాల్‌లోని మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజల కష్టతరమైన జీవితాలను పోలుస్తూ కూడా అనేక వీడియోలు కనిపిస్తున్నాయి.

కాగా, సోమవారం ఉదయం కఠ్మాండూలోని సింహ్ దర్బార్ దగ్గరకు వేలాది మంది నిరసనకారులు చేరుకున్నారు. అక్కడి నుంచి న్యూ బనేశ్వర్‌లోని పార్లమెంట్ భవనం వైపు ప్రదర్శనగా వెళ్లారు. రాష్ట్రపతి భవన్, శీతల్ నివాస్, నారాయణ్ దర్బార్ మ్యూజియం, ప్రధాన మంత్రి నివాసం పార్లమెంట్ హౌస్ చుట్టూ ఉండే కర్ఫ్యూని, నిషేధాజ్ఞలను లెక్క చేయకుండా, నిరసనకారులు, దూసుకుపోయారు. సైన్యాన్ని వీధుల్లో మోహరించినా పట్టించుకోలేదు. ఘర్షణలు జరిగాయి. మంటలు చెలరేగాయి. సజీవ దహనాలు జరిగాయి. తీవ్ర హింసాత్మకంగా మారింది. నిరసన కారులు పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 19 మంది మరణించారు. కనీసం 150 మంది గాయపడ్డారు. ఈ సంఖ్య ఇంకా ఎక్కువ కూడా ఉండవచ్చు. అయినప్పటికీ, నిరసనకారులు వెనక్కి తగ్గలేదు. కొంతమంది ప్రాణాలు కోల్పోయారని తెలిసిన తర్వాత కూడా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.

‘జెన్ జీ’గా పిలుచుకుంటున్న నిరసనకారులు నేపాల్ పాలనా వ్యవస్థ అవినీతిమయమైందని ఆరోపిస్తున్నారు. జెన్ జీ అంటే, నేపాల్ లో 1990 నుంచి 2010 మధ్య పుట్టిన వారిని ఇంగ్లిష్‌లో జనరేషన్ జెడ్ గా పరిగణిస్తున్నారు. వీరినే జెన్ జీగా పిలుస్తున్నారు.

అసలు హింసకు కారణాలేంటి? ప్రభుత్వంలో పేరుకుపోయిన అవినీతి. అభివృద్ధిలో అసమానతలు. యువతకు ఉపాధి అవకాశాలు లేమి. పాలక, అధికార వర్గాలకు చెందిన పిల్లలు అంటే ‘నిపో కిడ్స్’ అత్యున్నతంగా ఉండటం వల్ల అసంతృప్తి పెరిగింది. అధికారిక ఆధిపత్యం వల్ల పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛపై నియంత్రణ జరిగింది. రాణా ప్రాంతాల మాధేశ్ ఉద్యమాలు, వర్గ, వర్ణ వివక్ష, దళిత హత్య కేసులు వంటి ఘో రమైన సంఘటనలు ప్రజలను పోరాటానికి ప్రేరేపించాయి. 2015లో జరిగిన టికాపూర్ హత్యాకాండ, రుకుం హత్యల కేసులు ఆ ప్రేరేపణలకు ఆజ్యం పోశాయి.

నేపాల్ లో 1996–2006 మధ్య మావోయిస్టు విప్లవం, సామాజిక అన్యాయం, పేదరికం, నిరాశ వంటి అంశాలతో పని చేసింది. ఈ యుద్ధంలో 14వేలకు పైగా మరణించారు. అనేక అత్యాచారాలు జరిగాయి. లక్షల్లో నేపాల్ ని వీడి పోయారు. 2023, 2025లో రాజరికాన్ని తిరిగి తీసుకువచ్చేందుకు జరిగిన నిరసనలు, ఆందోళనలు, ఈ ఉద్యమానికి ఊపునిచ్చాయి. లింగ వివక్ష, మహిళలపై అత్యాచారాలు వంటి సామాజిక అంశాలు కూడా ఈ ఉద్యమంతో ముడిపడి ఉన్నాయి.

మరి పరిష్కార మార్గాలేంటి? పాలనలో అవినీతిని అంతమొందించాలి. అధికారస్వామ్యాన్ని పూర్తిగా తగ్గించి, ప్రజలకు నమ్మకాన్ని కలిగించాలి. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి, సామాజిక అంతరాలను తొలగించే విధానాలను అమలు చేయాలి. ఆందోళనకారుల సమూహాలతో చర్చలు జరిపి తగిన హామీలివ్వాలి. పకడ్బందీగా అమలు చేయాలి. బాధితులకు న్యాయ పరమైన పరిహారాలు అందించాలి. అక్కడ మహిళలపై జరిగిన హింసలకు పరిష్కార మార్గాలు వెతకాలి. హెల్ప్ లైన్లు పెట్టాలి. అన్నింటికంటే ముందు నేపాల్ లో శాంతిని నెలకొల్పాలి. ఇందుకు తక్షణ చర్యలు చేపట్టాలి.
నేపాల్ ప్రస్తుత అంతర్గత సంక్షోభం కేవలం సోషల్ మీడియాపై నిషేధం వల్లే ఏర్పడిందన్న తప్పుడు భావనలు ప్రపంచానికి చేరడం అంత మంచిది కాదు. అది ఒక సాకు మాత్రమే. సోషల్ మీడియా ప్రభావాన్ని కాదనలేం. ప్రజలు దానికి బానిసలవడం కూడా నిజమే. కానీ సోషల్ మీడియాలో వస్తున్నదంతా అంత మంచిదేం కాదు. అందులోనూ అవాంఛిత అంశాలనేకం విశృంఖలంగా పరివ్యాప్తం అవుతున్నాయి. ఇవ్వాళ సోషల్ మీడియాను అదుపుచేసే స్థితిలో ప్రభుత్వాలు లేవు. కనీస నియంత్రణ కూడా వాటికి లేదు. అవి పెచ్చరిల్లినప్పుడు వచ్చే ఉపద్రవాలకు కళ్ళ ముందే కనిపిస్తున్న వాస్తవం నేపాలే.

Latest News

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

ఆగస్టు 01, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 09.20 వరకు ఉపరి చవితి నక్షత్రం శతభిషం రాత్రి 08.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శోభ రాత్రి 11.43 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 09.10...

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమవుతోందా!?|EDITORIAL

ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే, కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు....

జూలై 31, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 09.03 వరకు ఉపరి తదియ నక్షత్రం ధనిష్ఠ రాత్రి 07.09 వరకు ఉపరి శతభిషం యోగం సౌభాగ్య రాత్రి 12.33 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 08.40...

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News