Wednesday, July 29, 2026
23.5 C
Hyderabad

జనవరి 1 నుంచే భూభారతి?

ఇక వందల, వేల ఎకరాలు కొల్లగొట్టిన కబ్జాకోరుల భరతం పట్టనున్న ప్రభుత్వం

డిసెంబర్ 31తో ముగియనున్న టెర్రాసిస్ గడువు

ఎన్ ఐ సి ద్వారా నిర్వహణ

ధరణిపై ఫోరెన్సిక్ ఆడిటింగ్‌‌కు సర్కార్ నిర్ణయం

దీంతో రెవెన్యూ అధికారుల గుండెల్లో గుబులు

అర్థరాత్రి వేళ ఎవరు లాగిన్ అయ్యారు?

ఏ సర్వర్ నుండి ఏ ఐపీ అడ్రస్ ద్వారా లావాదేవీలు చేసేవారు?

ఏ సర్వే నెంబర్ నిషేధిత జాబితా నుండి తొలగించారు?

ఫోరెన్సిక్ ఆడిట్‌లో ధరణి లావాదేవీల హిస్టరీ

రూ.2 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల పరం అయ్యినట్టు ప్రభుత్వ లెక్కలు

గత కొన్నేళ్లుగా చెలామణి లో ఉన్న ధరణి పోర్టల్‌కు కాలం చెల్లింది. జనవరి 1వ తేదీ నుంచి ధరణి స్థానంలో భూ భారతి సేవలు అందు బాటులోకి రానున్నాయి. డిసెంబర్ 31తో టెర్రాసిస్ గడువు ముగియనుంది. దీంతో జనవరి ఒకటి నుంచి నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్-NIC- ద్వారా భూ భారతి పోర్టల్ పూర్తి స్థాయిలో వినియోగంలోకి రానుంది. ఇదే సమయంలో సర్కార్ ధరణిపై ఫోరెన్సిక్ ఆడిటింగ్‌‌కు నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో రెవెన్యూ అధికారుల గుండెల్లో గుబులు ప్రారంభమైంది. రాత్రికి రాత్రే వందల ఎకరాలు కొల్లగొట్టిన వాళ్ల పై కేసులు నమోదు కానున్నాయి. అర్థరాత్రి వేళలో కూడా ఎవరు లాగిన్ అయ్యారు? ఏ సర్వర్ నుండి ఏ ఐపీ అడ్రస్ ద్వారా లావాదేవీలు చేశారు? ఏ సర్వే నెంబర్లను నిషేధిత జాబితా నుండి తొలగించారు? వంటి వివరాలను, ఫోరెన్సిక్ ఆడిట్‌లో మొత్తం ధరణి లావాదేవీల హిస్టరీని వెలికితీసేందుకు ప్రభుత్వం సిద్ధం అయింది. ధరణి ద్వారా రూ.2 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల పరం అయ్యినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.

ఇప్పటివరకు ధరణి వివరాలు టెర్రాసిస్ ఏజెన్సీ నిర్వహించేది. ఆ సమాచారాన్ని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్‌కు ట్రాన్సిట్ చేయ నుంది, టెర్రాసిస్ ఏజెన్సీ. దీంతో ధరణి మాటున భూముల కొల్లగొట్టినవారిని వెలికి తీసే పనిలో నిమగ్నం కానుంది ప్రభుత్వం.

ధరణి మాటున వేలాది ఎకరాల భూములను కొల్లగొట్టిన పెద్దల భరతం పట్టనుంది రేవంత్ సర్కార్. పోర్టల్ నిర్వహణ మారడంతో ధరణిపై ఫోరెన్సిక్ ఆడిటింగ్‌‌కు సర్కార్ రెడీ అయ్యింది. దీంతో రెవెన్యూ శాఖ అధికారుల్లో గుబులు మొదలైంది. రాత్రికి రాత్రే వందల ఎకరాలు కొల్లగొట్టిన కబ్జా కోరుల పని పట్టనుంది ప్రభుత్వం.

అర్థరాత్రి వేళ ఎవరు లాగిన్ అయ్యారు? ఏ సర్వర్ నుండి ఏ ఐపీ అడ్రస్ లావాదేవీలు చేసేవారు? ఏ సర్వే నెంబర్ నిషేధిత జాబితా నుండి తొలగిం చారు? అనే అంశాలపై ఫోకస్ చేయనుంది. ఫోరెన్సిక్ ఆడిట్‌లో ధరణి లావాదేవీలు ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా కీలక విషయాలు వెల్లడి కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

ఇప్పటికే సుమారు 2 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల పరం అయ్యినట్టు ఇటీవల డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. నిషేధిత జాబితా భూములు రాత్రికి రాత్రే ఓ పెద్ద మనిషి సమక్షంలో డీల్ జరిగిందంటూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.

ఒక్క హైదరాబాద్ పరిధిలో సుమారు 15వేల ఎకరాలు హాం ఫట్ అయినట్టు ప్రభుత్వ వర్గాల ప్రాథమిక అంచనా. ప్రభుత్వం 2014 నుండి రికార్డులు పరిశీలించి, ధరణి పోర్టల్ లావాదేవీల‌పై ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయిస్తోంది. ఫోరెన్సిక్ ఆడిట్ తర్వాత విచారణకు కమిటీ వేసి దోషులను తేల్చే ప్రక్రియను వేగవంతం చేయనుంది. దీంతో అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్రతో పాటు రెవెన్యూ కీలక అధికారుల గుట్టు రట్టు కానుంది.

Latest News

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

ప్రకృతి వింత: నడిచే అడవి రహస్యం తెలుసా?|NATURE|FOREST

ప్రకృతి సృష్టించే వింతలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అడవి అనగానే ఒకే చోట స్థిరంగా ఉండే వృక్షాలు గుర్తుకొస్తాయి. కానీ, చెట్లు ఒక చోటు నుండి మరొక చోటుకి నెమ్మదిగా నడుస్తూ కదులుతాయనే...

జూలై 27, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి త్రయోదశి మధ్యాహ్నం 03.35 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం మూల ఉదయం 11.00 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం వైధృతి రాత్రి 12.18 వరకు ఉపరి విస్కమ్బ కరణం తైతుల మధ్యాహ్నం 03.35 వరకు ఉపరి...

భరించేదే భార్య పో!?|ADUGU TRENDS

‘భరించేటోడే భర్త అన్నరు!’. ‘నిజానికి భరించేదే భార్య!!’ అనే గా సామెతకు గీమె సరిగ్గా సరిపోతది. పెనిమిటిని 180 కిలోమీటర్లు భుజానేసుకుని నడిశిన పెండ్లాన్ని మనమెక్కడైనా సూసినమా? కావాల్నంటే మీరే సూడుండ్రి. గీమె పేరు...

‘బొద్దింక’లు హిట్టా? ఫట్టా!?|EDITORIAL

విద్యార్థుల చదువు, పరీక్షలు, భవిష్యత్తుతో కూడిన అంశాలపై విశేష మద్దతు లభించడం సహజం. ఏ రాజకీయ పార్టీ అయినా ఉద్యమానికి మద్దతు పలకడం వేరు, ఆ ఉద్యమాన్నే హైజాక్ చేయడం వేరు. అలాగే...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 26 నుండి ఆగష్టు 01 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం చేపట్టిన పనులు క్రమంగా విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం...

ఒక్క ఏసీ మిషినీ, రొండు అర్రలకు సల్లదనం!?|ADUGU TRENDS

‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!’. ‘ఒకే కాన్పుల ఇద్దరు పిల్లలు!! లెక్కనే’ గీ ‘ఒక్క ఏసీతో రెండు గదుల్ల సల్లదనమన్నట్లు!?’ అరె గదెట్ల? అనుకుంటాండ్రా? కావాల్నంటే ఇగో సూడుండ్రి. ఇగో గీ ఉపాయం ఏడ...

‘బొద్దింకే’ కదాని నిర్లక్ష్యం చేస్తే..!?|EDITORIAL

‘బొద్దింక’లే కదాని చులకనగా చూడొద్దు. వాటిని చంపినా మళ్ళీ అవి పుట్టుకు వస్తూనే ఉంటాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉద్యమాలను అణచివేయవచ్చు. కానీ, సమస్యలను పరిష్కరించకపోతే కొత్త రూపాల్లో అసంతృప్తి మళ్లీ...

జూలై 25, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తొలి ఏకాదశి తిధి ఏకాదశి ఉదయం 11.38 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అనురాధ ఉదయం 05.49 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం బ్రహ్మ రాత్రి 11.00 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర ఉదయం 11.38...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News