ఫేక్ బ్యాంక్ కాల్స్ కారణంగా మోసపోయే వారి రక్షణకు భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్ మరియు ఆర్థిక సంస్థలు తమ కస్టమర్లకు లావాదేవీలు లేదా మార్కెటింగ్ కాల్స్ చేయడానికి రెండు ప్రత్యేక ఫోన్ నంబర్ సిరీస్‌లను ప్రవేశపెట్టాయి.
‘1600’ సిరీస్: ఈ సిరీస్‌లో ప్రారంభమయ్యే నంబర్ ద్వారా కాల్ వస్తే అది బ్యాంక్ లావాదేవీలకు సంబంధించినదని భావించాలి.
140’ సిరీస్: ఈ సిరీస్‌లోనిది అయితే అది మార్కెటింగ్ కాల్ అని అర్థం.
ఈ నంబర్ల నుంచి కాల్స్ లేదా మెసేజ్‌లు వస్తే, అవి బ్యాంకు నుంచి వచ్చినవేనని ధృవీకరించవచ్చు.
ఫేక్ బ్యాంక్ కాల్స్ నివారణకు RBI కీలక నిర్ణయం

