Saturday, October 10, 2026
25.5 C
Hyderabad

గుప్తానంతర యుగం (క్రీ.శ.550-750)|HISTORY|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL

క్రీ.శ. ఆరవ శతాబ్దం మధ్యభాగంలో గుప్త సామ్రాజ్యం అంతమై మరోసారి భారత చరిత్రలో రాజకీయ అనైక్యత చోటుచేసుకుంది. దీనిని ఆసరాగా చేసుకొని కొన్ని స్వతంత్ర రాజ్యాలు భారతదేశంలో వెలిశాయి. అవి పుష్యభూతి రాజ్యం, కామరూప రాజ్యం, గౌడ రాజ్యం, పల్లవరాజ్యం, బాదామి చాళుక్యులు.
ఇందులో మనం ముఖ్యంగా పుష్యభూతి రాజ్యం, బాదామి చాళుక్యులు మరియు పల్లవా రాజ్యం గురించి చర్చిస్తాము.

పుష్యభూతి రాజ్యం

వీరు స్థానేశ్వర్ (ప్రస్తుత హర్యానా ప్రాంతం) రాజధానిగా ఉత్తర భారతదేశాన్ని పరిపాలించారు. మహారాజ పుష్యభూతిని ఈ వంశ స్థాపకుడిగా చెప్పవచ్చు. ఇతను గుప్తులకు సామంతుడిగా ఉండి గుప్త సామ్రాజ్యం విచ్చినమైన వెంటనే స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. ఇతని తర్వాత ప్రభాకరవర్ధనుడు రాజ్యానికి వచ్చాడు. ఇతను మహారాజాధిరాజ అనే బిరుదును తీసుకున్నాడు. ప్రభాకరవర్ధనుడు మరణించిన తర్వాత అతని మొదటి కుమారుడైన రాజ్యవర్ధనుడు రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు. ఇతడు గౌడ రాజ్యం (ప్రస్తుత బెంగాల్ ప్రాంతం) మరియు బీహార్ ప్రాంతంపై దండెత్తి మౌఖరి రాజ్యాన్ని పాలిస్తున్న గృహవర్మను చంపి కనోజ్ (ప్రస్తుత ఉత్తరపదేశ్) ను ఆక్రమించుకున్నాడు. ఇతని తర్వాత పుష్యభూతి రాజ్యంలో అత్యంత గొప్పవాడు మరియు సుప్రసిద్ధుడు హర్షవర్ధనుడు రాజ్యానికి వచ్చాడు.

హర్షవర్ధనుడు (క్రీ.శ.605-647)

ఇతను ప్రభాకరవర్ధనుడి రెండవ కుమారుడు. మొదటి కుమారుడైన రాజ్యవర్ధనుడు మరణించిన తర్వాత సింహాసనాన్ని అధిష్టించి సుదీర్ఘ కాలం పరిపాలించాడు. రాజపుత్ర, శీలాధిత్య అనే బిరుదులను పొందాడు. హర్షవర్ధనుడు ప్రజాసంక్షేమం కొరకు అనేక కార్యక్రమాలు మరియు పేదలకు వైద్యశాలలు నిర్మించాడు. ప్రతీ 5 సంవత్సరాలకు ఒకసారి దానధర్మ అనే కార్యక్రమాన్ని నిర్వహించి తన సంపదలో కొంత భాగాన్ని పేద ప్రజలకు పంచిపెట్టేవాడు. బెంగాల్, బీహార్, గుజరాత్, అస్సాం, ఒరిస్సా ప్రాంతాలను జయించి ఉత్తర భారతదేశంలోనే అత్యంత బలమైన సామ్రాజ్యాన్ని నిర్మించాడు. హర్షవర్ధనుడు రాజ్యాన్ని విస్తరించే క్రమంలో దక్కన్ ప్రాంతాన్ని పాలిస్తున్న బాదామి చాళుక్యులలో ముఖ్యుడైన పులకేశి-II తో యుద్ధం చేసి ఓడిపోయాడు. రెండవ పులకేశి వేసిన తన ఐహోలు శాసనంలో హర్షవర్ధనుడిని ఓడించానని చెప్పుకున్నాడు. హర్షవర్ధనుడు కవి మరియు సాహిత్యంలో ఆరితేరినవాడు. ఇతను స్వయంగా కవులను కూడా పోషించాడు. హర్షవర్ధనుడు సంస్కృతంలో నాగానందం, రత్నావళి, ప్రియదర్శి అనే నాటకాలు రచించాడు. ఇతని ఆస్థానకవి అయిన భానుడు హర్షచరితను రచించాడు. దీనితోపాటు పార్వతీ పరిణయం మరియు కాదంబరి అనే కావ్యాలుకూడ రచించాడు. హర్షవర్ధనుడు మొదట్లో శైవమతాన్ని ఆచరించాడు. కానీ క్రీ.శ.643వ సంవత్సరంలో కనోజ్ లో జరిగిన సర్వమత సమ్మేళన సభకి అధ్యక్షత వహించిన చైనా నుంచి వచ్చిన బౌద్ధ యాత్రికుడు హుయాన్ త్సాంగ్ యొక్క ప్రభావంతో శైవ మతాన్ని వీధి మహాయాన బౌద్ధమతాన్ని స్వీకరించాడు.
ఇతని తర్వాత పుష్యభూతి రాజ్యం గురించి సమాచారం లేదు.

బాదామి చాళుక్యులు (క్రీ.శ.540-750)

ప్రస్తుత కర్ణాటకలోని బాదామీ రాజధానిగా సుమారు 210 సంవత్సరాలు దక్కన్ ప్రాంతాన్ని పరిపాలించారు. వీరికి మరొక పేరు వాతాపి చాళుక్యులు. ఈ వంశస్థాపకుడిని పులికేశి – I చెప్పవచ్చు. ఇతను అశ్వమేధ యాగాన్ని నిర్వహించాడు. ఇతని తర్వాత రెండవ పులకేశి రాజ్యానికి వచ్చాడు.

పులకేశి – II (క్రీ.శ.610-645)
ఇతను బాదామి చాళుక్య వంశంలో అత్యంత గొప్పవాడు మరియు సుప్రసిద్ధుడు. తన తండ్రి పులకేశి మరణించే సమయంలో ఇతను మైనర్ కావడంతో రెండవ పులకేశి యొక్క చిన్నాన్న మంగళేశుడు సంరక్షకుడిగా పరిపాలన నిర్వహించాడు. రెండవ పులకేశి యుక్త వయసులో వచ్చిన తర్వాత కూడా మంగళేశుడు పరిపాలన అధికారాలను ఇవ్వకపోవడంతో అంతర్యుద్ధం కొనసాగింది. ఆ యుద్ధంలో రెండవ పులకేశి తన చిన్నాన్న మంగళేశుడిని ఓడించి అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడని ఐహోలు శాసనంలో క్లుప్తంగా వివరించబడింది. రెండవ పులకేశి మైసూర్ను పాలిస్తున్న పశ్చిమ గాంగులను ఓడించాడు. కొంకన్ ప్రాంతాన్ని పాలిస్తున్న మౌర్యులను ఓడించి ఎలిఫెంటా గుహలను ఆక్రమించుకున్నాడు. ఇది ప్రస్తుతం మహారాష్ట్రలో ఉంది. ఇందులోని అత్యంత సుప్రసిద్ధమైన త్రిమూర్తి గుహాలయమును యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది. ఇతను ఉత్తర భారతదేశాన్ని పాలిస్తున్న హర్షవర్ధనుడిని ఓడించి తన రాజ్యాన్ని ఉత్తరాన నర్మదా నది వరకు విస్తరింపజేశాడు. ఇతను కంచి రాజధానిగా పాలిస్తున్న పల్లవులపై రెండుసార్లు దండెత్తాడు.

1. క్రీ.శ.630లో జరిగిన పుల్లలూరు యుద్ధంలో పల్లవరాజైన మహేంద్ర వర్మ – I ను చంపి అనేక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాడు.
2. క్రీ.శ.642లో జరిగిన మణిమంగళ యుద్ధంలో పల్లవరాజైన నరసింహవర్మ -I చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. పులకేశిని చంపి నరసింహవర్మ -I వాతాపికొండ అనే బిరుదును తీసుకున్నాడు. ఈ సమయంలో బాదామి చాళుక్యులు తమ రాజ్యాన్ని కోల్పోయి పల్లవులకి సామంతులుగా కొనసాగారు.
ఇతని తర్వాత రెండవ పులకేశి కుమారుడైన విక్రమాదిత్య-I పల్లవులతో నిరంతరంగా 12 సంవత్సరాలు పోరాడి రాజ్యాన్ని తిరిగి సాధించుకున్నాడు. ఇతను కంచిపై దండెత్తి మహేంద్రవర్మను చంపి కంచి రాజ్యాన్ని ధ్వంసం చేశాడు. ఇతని తరువాత రెండవ విక్రమాదిత్యుడు రాజ్యానికి వచ్చాడు. బాదామి చాళుక్యులలో ఇతను చివరివాడు మరియు ప్రముఖుడు. మూడుసార్లు పల్లవరాజ్యంపై దండెత్తి కంచి ప్రాంతాన్ని ధ్వంసం చేశాడు. పల్లవులు మరియు బాదామి చాళుక్యుల నిరంతర యుద్ధాలతో బాదామి చాళుక్యరాజ్యం మరియు పల్లవరాజ్యం చాలా బలహీనపడ్డాయి. దీనిని ఆసరాగా చేసుకుని బాదామి చాళుక్యుల దగ్గర గవర్నర్గా పనిచేస్తున్న దంతి దుర్గుడు బాదామి రాజైన కీర్తివర్మ – II ను అంతం చేసి రాష్ట్రకూట రాజ్యాన్ని స్థాపించాడు.

పల్లవ రాజ్యం (క్రీ.శ.6-9వ శతాబ్దం)

కంచి రాజధానిగా (ప్రస్తుత తమిళనాడు) దక్షిణ భారతదేశాన్ని మూడు శతాబ్దాల పాటు ఏక చక్రాధిపత్యంగా పాలించిన ఘనత కేవలం పల్లవులకు మాత్రమే దక్కుతుంది. సింహవిష్ణును ఈ వంశస్థాపకుడిగా చెప్పవచ్చు. ఇతను వైష్ణవ మతాన్ని ఆచరించాడు. ఇతని తరువాత మహేంద్రవర్మ-I రాజ్యానికి వచ్చాడు. ఇతను మొదట్లో జైన మతాన్ని ఆచరించి తరువాత తిరునవక్కరసు ప్రభావంతో శైవ మతానికి మారాడు. తను సంస్కృతంలో మత్తవిలాసప్రహసనము అనే హాస్య నాటికను రచించాడు. మత్తవిలాసప్రహసనము అనగా మద్యం తాగి హాస్యం చేయడం. ఇతను పుల్లలూరు యుద్ధంలో రెండవ పులకేశి చేతిలో 630వ సంవత్సరములో మరణించాడు. ఇతని మరణం తరువాత మొదటి నరసింహవర్మ పల్లవ రాజ్యానికి రాజు అయ్యాడు.

నరసింహవర్మ-I

ఇతని కాలంలోనే చైనా బౌద్ధయాత్రికుడైన హుయాన్ త్సాంగ్ కంచి ప్రాంతాన్ని సందర్శించాడు. క్రీ.శ.642లో మణిమంగళ యుద్ధంలో రెండవ పులకేశిని అంతం చేసి వాతాపికొండ మరియు మహామల్ల అనే బిరుదులను పొందాడు. మహాబలిపురం అనే కొత్త రాజధానిని తమిళనాడులో నిర్మించి మహాబలి అనే బిరుదును సొంతం చేసుకున్నాడు. ఇతని తరువాత ఇతని కుమారుడైన మహేంద్రవర్మ-II రాజ్యానికి వచ్చి కేవలం రెండేళ్లు మాత్రమే పాలించాడు. బాదామి చాళుక్య రాజైన విక్రమాదిత్య చేతిలో మరణించాడు. ఇతని తరువాత రెండవ నరసింహవర్మ పల్లవ రాజ్యానికి రాజు అయ్యాడు.

నరసింహవర్మ-II

ఇతని కాలంలో కంచి రాజ్యం పాలన విషయంలో మంచి అభివృద్ధిని సాధించింది. ఇతను వ్యాపార అభివృద్ధి కొరకు మరియు ద్వైపాక్షిక చర్చలకు చైనాకు బృందాన్ని పంపాడు. ద్రవిడ శైలిలో అనేక ఆలయాలను నిర్మించాడు. ఇతను నిర్మించిన ఆలయాల్లో తీర దేవాలయం మరియు కైలాసనథ ఆలయం ముఖ్యమైనవి. ఇతను హిందూ మతానికి సంబంధించిన ఘటికలను నిర్మించాడు. దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయాలకు అనుబంధంగా పనిచేసే వేద పాఠశాలలను ఘటికలు అంటారు. (ఇస్లాం మతానికి సంబంధించిన పాఠశాలలను మదరసాలు అంటారు.) రెండవ నరసింహవర్మ తరువాత రెండవ నందివర్మ రాజ్యానికి వచ్చాడు. ఇతను వైష్ణవ మతాన్ని ఆచరించాడు. (పల్లవ వంశంలో పల్లవ రాజ్య స్థాపకుడైన సింహవిష్ణు మరియు రెండవ నందివర్మ మాత్రమే వైష్ణవ మతాన్ని ఆచరించారు. మిగిలిన వారందరూ శైవ మతాన్ని ఆచరించారు.) రెండవ నందివర్మ అశ్వమేధ యాగమును చేశాడు. ఇతని తరువాత పల్లవులలో చివరివాడైన అపరాజితవర్మ రాజ్యానికి వచ్చాడు. కంచికి పక్కనే ఉన్న తంజావూరును పాలిస్తున్న ఆదిత్య చోళుడు అంతం చేసి చూడ సామ్రాజ్యాన్ని స్థాపించాడు.

-బానోత్ కళ్యాణ్

Latest News

బతుకమ్మ పాట విడుదల|BATHUKAMMA|SONG|KALVAKUNTLA KAVITHA

హైదరాబాద్, నందీనగర్‌లో తెలంగాణ రక్షణ సమితి పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ‘సిరిసిరి మువ్వల సిరుల బతుకమ్మ’ పాట సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు...

సిల్లరతోనే స్కూటర్ కొన్నడు!?|ADUGU TRENDS

సిల్లరని సిల్లరగా సూత్తం. ‘సిల్లరగా!’ అని సిల్లరగ తిడ్తం. గా సిల్లరనే సిల్లరగ సూసే రోజులు పోయినయి. గా సిల్లరే పదులు, ఎయ్యిలు, లచ్చలు, కోట్లు అయితయి. గందుకే ఒక్కొక్కటి నూటొక్కటి అయితయి...

ప్రజా తీర్పు పాలనలో ప్రతిబింబించాలి!|EDITORIAL

బెంగాల్‌లో బీజేపీ విజయాలు, తమిళనాడులో విజయ్ పార్టీ పురోగతి, పుదుచ్చేరిలో అధికార కూటమి గెలుపు ఆయా పార్టీలకు రాజకీయ ఊపునిచ్చాయి. కానీ ప్రజాభిమానాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోవాలంటే గెలుపు గర్వాన్ని కాకుండా బాధ్యతను పెంచాలి....

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

అక్టోబర్ 11 నుండి అక్టోబర్ 18 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం ఉద్యోగ రంగంలో కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం మంచిది. వ్యాపారంలో కొత్త...

గది ఇల్లా? ఇంగ్లీష్ పుత్తకమా!?|ADUGU TRENDS

యెన్కటికి యిద్దె అంటే గురువు. గురువు శెప్పిందే యిని నేర్సుకునేది. సూపింది సూసి, సేసి తర్పీదు పొందేది. ఇగ తర్వాత్తర్వాత గది పాయే, సారు శెప్పే సదువు కానించి, సారు లేకుండనే సదువుకునే...

ఎల్ నినో.. జల సంరక్షణకు మేల్కొలుపు!?|EDITORIAL

ఎల్‌నినో ప్రభావాన్ని పూర్తిగా నివారించడం మన చేతుల్లో లేకపోయినా, దాని వల్ల కలిగే నష్టాలను తగ్గించుకోవడం మాత్రం సాధ్యమే. వాతావరణ హెచ్చరికలకు అనుగుణంగా వ్యవసాయ ప్రణాళికలు రూపొందించడం, తాగునీటి నిల్వలను పెంచడం, చెరువులు,...

అక్టోబర్ 10, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం మహాలయ అమావాస్య బతుకమ్మ పండుగ తిధి అమావాస్య రాత్రి 08.10 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం హస్త రాత్రి 09.45 వరకు ఉపరి చిత్త యోగం ఐంద్ర రాత్రి 11.06 వరకు ఉపరి వైధృతి కరణం చతుష్పాద ఉదయం...

బాబోయ్…! గిదేం థాలీ!?|ADUGU TRENDS

జివ్వకో రుసి, పుర్రెకో బుద్ధి అన్నరు. నాలుక రకరకాల రుసులను కావాలంటది. బుద్ధి కూడా గట్లనే రకరకాల ఆలోశనలు సేత్తది. గట్ల గా ఆలోశలన నుంచి కొత్త రుసులను అందించే, సరికొత్త ఆలోశనే...

నేడే నోబెల్ ప్రకటన…దక్కేదెవరికో!?|EDITORIAL

ప్రపంచ శాంతికి, అంతర్జాతీయ సహకారానికి, సంఘర్షణల పరిష్కారానికి విశేషంగా దోహదపడిన వ్యక్తి లేదా సంస్థను నోబెల్ గుర్తిస్తుంది. కమిటీ నిర్ణయం కేవలం ఒక వ్యక్తి ప్రచారం, రాజకీయ ప్రభావం లేదా నామినేషన్ల సంఖ్య...

అక్టోబర్ 09, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిధి చతుర్దశి రాత్రి 08.40 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం ఉత్తర రాత్రి 09.35 వరకు ఉపరి హస్త యోగం బ్రహ్మ రాత్రి 12.34 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర ఉదయం 09.12 వరకు ఉపరి...

నానా పటేకర్ ఇక లేరు|NANA PATEKAR|FILM ACTOR

ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు నానా పటేకర్ (75) గురువారం ఉదయం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో అపస్మారక స్థితిలో కనిపించిన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని దవాఖానకి తరలించారు. అయితే...

మూగ జీవాలకో ఫుడ్ కోర్టు!?|ADUGU TRENDS

మూగ జీవాలను మనుసులతో సమానంగ సూత్తం. మంచి మంచి దేవుల్ల పేర్లు పెట్టి పిలుస్తం. గయి మనతో సమానంగ కలిసే జీవిత్తయి. కనీ, గీ మద్దెల గవాటిని పట్టించుకునుడే మానేసినం. గయ్యేమో ఆహారం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News