Tuesday, September 15, 2026
22.8 C
Hyderabad

నిరుద్యోగ Freshers|ఫ్రెషర్లకు Good News|శుభవార్త:

ఈ one year|ఏడాది 20 వేల Jobs|ఉద్యోగాలు ఇవ్వనున్న ఇన్ఫోసిస్|Infosys

India|భారతీయ It|ఐటీ రంగంలో ఉద్యోగాల భద్రత, వేతన పెంపుదలపై అనేక అనుమానాలు ఉన్న ఈ తరుణంలో దేశంలోని రెండవ అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ఓ శుభవార్తను ప్రకటించింది. తాజా త్రైమాసిక ఫలితాల సందర్భంగా సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జయేష్ సంఘరాజ్‌కా చేసిన వ్యాఖ్యలు నిరుద్యోగులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఆయన ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరం పూర్తి అయ్యేలోగా 20,000 మంది Freshers|ఫ్రెషర్లను నియమించేందుకు ఇన్ఫోసిస్ సిద్ధమవుతోంది. ఇది ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారికి గొప్ప అవకాశంగా మారనుంది.

ఇన్ఫోసిస్ ఇప్పటికే ఈ త్రైమాసికంలో తమ ఉద్యోగులకు అధిక వేరియబుల్ పే చెల్లించినట్లు ప్రకటించింది. అంతేకాక, 2025 జనవరిలో మొదటి విడత వేతన పెంపు అమలులోకి వచ్చిందని, రెండో విడత పెంపు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలైనట్లు కంపెనీ వెల్లడించింది. తదుపరి వేతనాల పెంపుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని జయేష్ సంఘరాజ్‌కా తెలిపారు. అయితే కంపెనీ ఉద్యోగులను ప్రోత్సహించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టమైంది.

ఇక కంపెనీ ఉద్యోగుల సంఖ్య విషయానికి వస్తే, 2025 జూన్ 30 నాటికి 3,23,788 మంది ఉద్యోగులు ఉన్నారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 8 వేల మంది మేరకు పెరిగింది. ఇది కంపెనీ సానుకూల వృద్ధిని సూచిస్తోంది. అదే సమయంలో జూన్ 2025 నాటికి అట్రిషన్ రేటు (ఉద్యోగం వదిలిన వారి శాతం) 14.4 శాతానికి పెరిగింది. ఇది కొంత ఆందోళన కలిగించే అంశం అయినప్పటికీ, కంపెనీ నియామకాలను కొనసాగించడమన్నది పాజిటివ్ దిశగా భావించవచ్చు.

ఇన్ఫోసిస్ వెల్లడించిన ప్రకారం, సంస్థ ప్రస్తుతం 85 శాతం వినియోగం స్థాయిని చేరుకుంది. అంటే పనిచేస్తున్న వనరుల వినియోగం గరిష్ట స్థాయిలో ఉంది. దీంతో కొత్త ఉద్యోగులను తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని కంపెనీ భావిస్తోంది. మా నియామకాల సంఖ్యలను పరిశీలిస్తే, మా మొత్తం ఉద్యోగుల సంఖ్య స్థిరంగా ఉంది. వినియోగం గరిష్ట స్థాయిలో ఉంది కనుక మేము నియామకాలు కొనసాగిస్తాం. సంవత్సరం ప్రారంభంలో ఇచ్చిన హామీ ప్రకారం మేము ముందుకు సాగుతాం అని సంఘరాజ్‌కా స్పష్టం చేశారు.

ఇటీవల TCS|టీసీఎస్ 70 శాతం జూనియర్ ఉద్యోగులకు 100 శాతం వేరియబుల్ పే చెల్లించినట్లు తెలిపిన సంగతి తెలిసిందే. అదే బాటలో ఇన్ఫోసిస్ కూడా తన ఉద్యోగులకు ఎక్కువ వేరియబుల్ పే చెల్లించి ప్రోత్సహిస్తోంది. ఈ పరిణామాలు చూస్తే, భారతీయ ఐటీ రంగంలో కొంత స్థిరత్వం తిరిగి వస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. తాజా ప్రకటనతో ఫ్రెషర్లకు మంచి అవకాశాలు లభించనున్నాయి.

Latest News

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

సెప్టెంబర్ 12, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.35 వరకు ఉపరి విదియ నక్షత్రం ఉత్తర పగలు 01.54 వరకు ఉపరి హస్త యోగం శుభ సాయంత్రం 05.12 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 07.35...

కోవా యినాయకుడు! లడ్డూ మండపం!?|ADUGU TRENDS

ఇగ యినాయక చవితి రానే వచ్చే! ఇగిప్పుడు యినాయకుల సీజన్ ఒచ్చింది. రకరకాల ఆకారాలల్ల యిగ్రహాలను తయారు శేసుడు. గవాటిని ఈధుల్ల పెట్టుడు. నవరాత్రులు పూజలు శేసుడు మామూలేనాయె. అయితే, గా యినాయకులను...

భారత అంతరిక్ష ఇరుసు ఇస్రో ప్రైవేటుపరమేనా!?|EDITORIAL

ఇస్రోను “ప్రైవేటు కంపెనీలతో పోటీ పడే సంస్థ”గా కాకుండా, దేశ అంతరిక్ష వ్యవస్థకు మూల స్తంభంగా చూడాలి. పరిశోధన, వ్యూహాత్మక మిషన్లు, కీలక సాంకేతికతలు, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన కార్యకలాపాలు ఇస్రో ఆధ్వర్యంలోనే...

సెప్టెంబర్ 11,శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి అమావాస్య ఉదయం 08.35 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం పుబ్బ పగలు 02.08 వరకు ఉపరి ఉత్తర యోగం సాధ్య రాత్రి 06.54 వరకు ఉపరి శుభ కరణం నాగవ ఉదయం 08.35 వరకు ఉపరి కింస్తుంఘ్న రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News