Tuesday, September 15, 2026
22.8 C
Hyderabad

Gaddar|గద్దర్ Awards|అవార్డులు – 2024 అవార్డుల ప్రకటన|Release

Tollywood|తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రోత్సాహమే గద్దర్ అవార్డులు

TELANGANA|తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో సినీ రంగాన్ని ప్రోత్సహించేందుకు, ప్రతిభావంతులను గౌరవించేందుకు తొలిసారి ఈ అవార్డులు ప్రకటించగా, సినిమా అభిమానుల్లో అద్భుతమైన స్పందన వ్యక్తమైందని అవార్డుల జ్యూరీ కమిటీ చైర్మన్‌ ప్రముఖ నటి జయసుధ, ఎఫ్ఎసీ చైర్మన్‌ నిర్మాత దిల్ రాజు అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో వారు 2014 నుంచి 2023 వరకు ఒక్కో ఏడాది ఉత్తమ చిత్రాలను గుర్తించి అవార్డులు ప్రకటించినట్లు వెల్లడించారు. 14 ఏళ్ల విరామం తర్వాత ప్రభుత్వ చలనచిత్ర పురస్కారాలను మళ్లీ ప్రారంభించినట్టు దిల్ రాజు తెలిపారు.

ఈ గద్దర్ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు వచ్చాయి. వీటిలో వ్యక్తిగత విభాగాల్లో 1172 దరఖాస్తులు కాగా, ఫీచర్ ఫిల్మ్, డాక్యుమెంటరీ, ఫిల్మ్ క్రిటిక్స్‌ వంటి విభాగాల్లో 76 దరఖాస్తులు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. నాటి ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో ఈ అవార్డులను పేరుపెట్టి, తెలంగాణ సాంస్కృతిక జీవన శైలికి అనుగుణంగా ప్రకటించిన విధానం ప్రశంసనీయమైందన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.

2024 గద్దర్ అవార్డుల విజేతల వివరాల్లోకి వెళితే, ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డుగా కల్కి 2898 AD సినిమాను ఎంపిక చేశారు. రెండవ ఉత్తమ చిత్రంగా పొట్టేల్, మూడవ ఉత్తమ చిత్రంగా లక్కీ భాస్కర్ ఎంపికయ్యాయి. ఉత్తమ బాలల చిత్రంగా 35 – చిన్న కథ కాదు గుర్తింపు పొందింది. దర్శకునిగా తన తొలి చిత్రంతో ఆకట్టుకున్న యదు వంశీకి (కమిటీ కుర్రోళ్లు) ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ అవార్డు లభించింది.

నటన విభాగంలో, ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (పుష్ప 2), ఉత్తమ నటిగా నివేదా థామస్ (35 ఇది చిన్న కాదు) గెలుపొందారు. దర్శక విభాగంలో నాగ్ అశ్విన్ (కల్కి 2898 AD) ఉత్తమ దర్శకునిగా ఎంపికయ్యారు. సహాయ నటన విభాగంలో ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం), శరణ్యా ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్) ఉత్తమ సహాయ నటుడు, నటిగా నిలిచారు. సంగీత విభాగంలో భీమ్స్ సిసిరోలియో (రజాకార్), నేపథ్య గాయకుడిగా సిద్ శ్రీరామ్ (ఊరి పేరు భైరవకోన), గాయని శ్రేయా ఘోషల్ (పుష్ప 2 – చూసేకి..) అవార్డులు అందుకున్నారు.

హాస్యనటులుగా సత్య, వెన్నెల కిశోర్ (మత్తువదలరా 2), బాలనటులుగా మాస్టర్ అరుణ్ దేవ్, బేబీ హారిక గుర్తింపు పొందారు. ఉత్తమ కథారచయితగా శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి), ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్), ఉత్తమ గేయరచయితగా చంద్రబోస్ (రాజు యాదవ్), ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా విశ్వనాథ్ రెడ్డి (గామి) అవార్డులు అందుకున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఈ గద్దర్ అవార్డులు రాష్ట్రంలో సినీ రంగానికి మరింత ప్రోత్సాహం కలిగిస్తుందని సినీ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Latest News

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

సెప్టెంబర్ 12, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.35 వరకు ఉపరి విదియ నక్షత్రం ఉత్తర పగలు 01.54 వరకు ఉపరి హస్త యోగం శుభ సాయంత్రం 05.12 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 07.35...

కోవా యినాయకుడు! లడ్డూ మండపం!?|ADUGU TRENDS

ఇగ యినాయక చవితి రానే వచ్చే! ఇగిప్పుడు యినాయకుల సీజన్ ఒచ్చింది. రకరకాల ఆకారాలల్ల యిగ్రహాలను తయారు శేసుడు. గవాటిని ఈధుల్ల పెట్టుడు. నవరాత్రులు పూజలు శేసుడు మామూలేనాయె. అయితే, గా యినాయకులను...

భారత అంతరిక్ష ఇరుసు ఇస్రో ప్రైవేటుపరమేనా!?|EDITORIAL

ఇస్రోను “ప్రైవేటు కంపెనీలతో పోటీ పడే సంస్థ”గా కాకుండా, దేశ అంతరిక్ష వ్యవస్థకు మూల స్తంభంగా చూడాలి. పరిశోధన, వ్యూహాత్మక మిషన్లు, కీలక సాంకేతికతలు, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన కార్యకలాపాలు ఇస్రో ఆధ్వర్యంలోనే...

సెప్టెంబర్ 11,శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి అమావాస్య ఉదయం 08.35 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం పుబ్బ పగలు 02.08 వరకు ఉపరి ఉత్తర యోగం సాధ్య రాత్రి 06.54 వరకు ఉపరి శుభ కరణం నాగవ ఉదయం 08.35 వరకు ఉపరి కింస్తుంఘ్న రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News