Thursday, July 30, 2026
23 C
Hyderabad

TELUGU|తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది

ఘనంగా ఆటా అంతర్జాతీయ సాహిత్య సదస్సు

ఉత్సాహంగా పాల్గొన్న సాహితీవేత్తలు, కవులు, కళాకారులు, సాహిత్య అభిమానులు

జయహో తెలుగు సాహిత్యం అంటూ కొనియాడిన ఆటా ప్రతినిధులు

ఆటా అంతర్జాతీయ సదస్సులో పలువురు వక్తలు

తెలుగు భాషను, సంస్కృతిని కాపాడుకొని జాతి గొప్పతనాన్ని నిలుపుకోవాలని ఆటా అంతర్జాతీయ సాహిత్య సదస్సులో పలువురు వక్తలు పిలుపునిచ్చారు. అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా) వేడుకల్లో భాగంగా సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సాహిత్య సదస్సు – 2025, జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీత శ్రీ వినోద్ కుమార్ శుక్ల సాహిత్య సమాలోచన పేరుతో నిర్వహించిన సదస్సును తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మెన్ నందిని సిధారెడ్డి, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు, ప్రముఖ కవి యాకూబ్ ప్రారంభించగా, ఆటా సాహిత్య వేదిక చైర్ వేణు నక్షత్రం సభ అధ్యక్షత వహించగా ఆటా అధ్యక్షులు జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామసహాయం రెడ్డి, ఇతర ఆటా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మెన్ నందిని సిధారెడ్డి, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు, ప్రముఖ కవి యాకూబ్, ప్రముఖ కవి, రచయిత కొలకలూరి ఇనాక్ లు మాట్లాడుతూ…. తెలుగు భాష, సంస్కృతుల పట్ల ఆటాకు అమితమైన ప్రేమ వుందని ఈ కార్యక్రమం ద్వారా తెలుస్తుందని అన్నారు. అమెరికాలో ఆటా ఆధ్వర్యంలో అమెరికా భారతి పేరుతో మాస పత్రిక ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తూ… తెలుగు పై వారికి వున్న ప్రేమకి నిదర్శనం అని అన్నారు. అలాగే అమెరికాలో తెలుగు చదువుకోవడానికి యువతకు అన్ని విధాల సహకరిస్తున్న ఘనత ఆటా దేనని అన్నారు. అలాగే తెలుగు సాహిత్యంలో కృషి చేసిన వారిని గుర్తించి పురస్కారాలు అందజేసి వెలికితీసే ప్రక్రియను ఆటా చేయడం గొప్పగా ఉన్నదన్నారు.

జ్ఞానపీఠ పురస్కారాలలో మన తెలుగు వెలుగులు అనే అంశంపై ఆచార్య, కళా ప్రపూర్ణ, పద్మశ్రీ డాక్టర్ కొలకలూరి ఇనాక్, మధ్యతరగతి జీవన విధానానికి ప్రతీకలు వినోద్ కుమార్ శుక్లా నవలలు అనే అంశంపై డాక్టర్ పిరిసెట్టి శ్రీనివాసరావు, శుక్ల రచనల్లో ప్రకృతి చిత్రీకరణ అనే అంశంపై డాక్టర్ ఆర్ సుమన్ లత, శుక్ల నవలల్లో జీవన దృష్టి అనే విషయంపై ప్రొఫెసర్ సర్రాజ్, శుక్లా నవలల్లో మధ్య తరగతి జీవితం అనే అంశంపై శ్రీనివాస్ గౌడ్, శుక్ల కవిత్వం వాస్తవికత పై రూప్ కుమార్ డబ్బికార్, శుక్ల సాధారణత లోని కవితాత్మకత పై ఆనంద్ వారాల, శుక్ల సినిమా సాహిత్యం పై రెంటాల జయదేవ్ తదితరులు వారి అభిప్రాయాలను తెలియచేశారు. ఆయా సదస్సులను ప్రసేన్, సంపత్ కుమార్ బెల్లంకొండ అధ్యక్షతన నిర్వహించారు

ముగింపు వేడుకలు

ఆటా అంతర్జాతీయ సాహితీ సదస్సు ముగింపు వేడుకలను రవీందర్ రెడ్డి, జ్యోత్స్న రెడ్డిలు నిర్వహించగా ఆట బోర్డు సభ్యులు ఆట ఇండియా టీం సభ్యులను సత్కరించారు. ఈ సందర్భంగా ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా మాట్లాడుతూ… ఆటాకు సహకరిస్తున్న సాహితీవేత్తలకు ధన్యవాదాలు తెలిపారు. సాహిత్య సదస్సును ఏర్పాటు చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామసహాయం రెడ్డి మాట్లాడుతూ, ఆటా సాహిత్యానికి మంచి ప్రాముఖ్యత కల్పిస్తుందని, అందుకే సాహితీవేత్తలకు ప్రోత్సాహం అందించడానికి ముందుండి ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీలు, కో చైర్ నరసింహ ద్యాసాని, సాయి సూదిని, శ్రీకాంత్ గుడిపాటి, ఆటా కాన్ఫరెన్స్ కన్వీనర్ శ్రీధర్ బాణాల, బోర్డు ఆఫ్ ట్రస్టీ కాశీ కొత్త, రామకృష్ణ అల, శ్రీధర్ తిరిపతి, మాజీ అధ్యక్షులు పరమేష్ భీమ్ రెడ్డి, బిజినెస్ చైర్ హరీష్ బత్తిని, రఘువీర్ మర్రిపెద్ది, వినోద్ కోడూరు, కిషోర్ గూడూరు, నర్సి రెడ్డి, విష్ణు మాధవరం, సుమ ముప్పల, తిరుమల్ రెడ్డి, రాజ్ కరకల, వేణు నక్షత్రం, లక్ష్ చేపూరి, సుమన్ బర్ల, వేణుగోపాల్ సంకినేని, మీడియా సలహాదారు ఈశ్వర్ బండా, ఆటా ఇండియా కో ఆర్డినేటర్ అమృత్ ముళ్ళపూడి, సూర్యచంద్ర రెడ్డి, జ్యోత్స్న రెడ్డి, సాహితీ ప్రియులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Latest News

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

ప్రకృతి వింత: నడిచే అడవి రహస్యం తెలుసా?|NATURE|FOREST

ప్రకృతి సృష్టించే వింతలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అడవి అనగానే ఒకే చోట స్థిరంగా ఉండే వృక్షాలు గుర్తుకొస్తాయి. కానీ, చెట్లు ఒక చోటు నుండి మరొక చోటుకి నెమ్మదిగా నడుస్తూ కదులుతాయనే...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News