Monday, August 10, 2026
27.5 C
Hyderabad

అధికారం రాగానే హామీలు హుష్ కాకీ!?

ప్రజలు ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రకటనలను కాకుండా వాటి పనితీరును కొలుస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కాలపరిమితి నిర్ణయించి, వాటి అమలుపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయడం ప్రజలకు మేలు చేస్తుంది. హామీలను మరచిపోయే రాజకీయ సంస్కృతికి ముగింపు పలికి, బాధ్యతాయుత పాలనకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉన్నది. అధికారంలో ఎవరు ఉన్నా, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే ప్రభుత్వాల అసలైన విజయానికి కొలమానం.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

ఎన్నికల హామీలు కేవలం రాజకీయ ప్రకటనలు ఎంతమాత్రమూ కావు. అవి ప్రజలతో కుదుర్చుకున్న సామాజిక ఒప్పందం. అధికారంలోకి రావడానికి పార్టీలు ఇచ్చిన హామీలను అమలు చేయడమే ప్రభుత్వాల విశ్వసనీయతకు కొలమానం. కానీ, ప్రస్తుత రాజకీయాలను పరిశీలిస్తే, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత మరుగునపడుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వం పనితీరుపై కూడా ఇలాంటి ప్రశ్నలే వినిపిస్తున్నాయి.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు దాటినా, ఎన్నికల ముందు అత్యంత ప్రాధాన్యాలుగా ప్రస్తావించిన ధరణి సమస్య, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, యూత్ డిక్లరేషన్ అమలు వంటి అంశాల్లో ఆశించిన పురోగతి కనిపించడం లేదు. ధరణి పోర్టల్ వల్ల జరిగిన భూ వివాదాలపై సమగ్ర విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటివరకు పూర్తి స్థాయి శ్వేతపత్రాన్ని విడుదల చేయలేదు. దేవాదాయ శాఖకు చెందిన వేల ఎకరాల భూములు అన్యాక్రాంతంలో ఉన్నాయని ఆరోపణలు వస్తున్నా, వాటి రక్షణలో గణనీయమైన ఫలితాలు కనిపించడం లేదు.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో కూడా ప్రభుత్వాలు ఒకే ధోరణిని ప్రదర్శిస్తున్నాయి. అక్రెడిటేషన్ కార్డుల జారీ ఆలస్యం, ఆరోగ్య కార్డులు, ఇంటి స్థలాల పంపిణీ, సంక్షేమ పథకాల అమలులో స్పష్టత లేకపోవడంతో అసంతృప్తి పెరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టుల కోసం కేటాయించిన 70 ఎకరాల భూమిపై కొనసాగుతున్న వివాదాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి.

అయితే ప్రస్తుతం అత్యంత కీలకంగా మారిన అంశం నిరుద్యోగమే. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన యూత్ డిక్లరేషన్లో రెండు లక్షల ఉద్యోగాలు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్, ఉద్యోగం వచ్చేవరకు నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి, మహిళలకు ఎలక్ట్రిక్ స్కూటీలు, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, రూ.10 లక్షల వరకు వడ్డీ లేని విద్యారుణాలు వంటి పలు హామీలు ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత కూడా వీటిలో అధిక భాగం అమలు కానేలేదు.

ప్రభుత్వం ఇటీవల 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని ప్రకటించింది. ఇది స్వాగతించదగిన విషయమే అయినప్పటికీ, ఎన్నికల హామీ ఉద్యోగాలతో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువ. అంతేకాకుండా అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌లో పేర్కొన్న నోటిఫికేషన్లు పూర్తిస్థాయిలో విడుదల కాకపోవడం నిరుద్యోగుల్లో అసంతృప్తిని పెంచుతోంది.

గణాంకాలు కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి. రాష్ట్రంలోని పాఠశాల విద్యాశాఖలో 14 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులు, విశ్వవిద్యాలయాల్లో 2 వేలకుపైగా బోధన పోస్టులు, 2,800కు పైగా బోధనేతర పోస్టులు, గురుకులాల్లో 6 వేల పోస్టులు, ఆర్టీసీలో 3 వేలకుపైగా ఖాళీలు, పోలీసు శాఖలో 17 వేలకుపైగా పోస్టులు, అంగన్‌వాడీల్లో 15 వేలకుపైగా ఖాళీలు, మైనారిటీ సంక్షేమ శాఖలో 3 వేలకుపైగా పోస్టులు, ఎక్సైజ్ శాఖలో వెయ్యి పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వివిధ ప్రభుత్వ, ఉద్యోగ సంఘాల అంచనాలు చెబుతున్నాయి. మరోవైపు ప్రతి ఏడాది 9 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ పొందుతున్నారు. అయినప్పటికీ ఖాళీల భర్తీ ప్రక్రియ వేగవంతం కాకపోవడం నిరుద్యోగ యువతలో నిరాశకు కారణమవుతోంది.

మరో ఆందోళనకర అంశం కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ వ్యవస్థ విస్తరణ. రాష్ట్రంలో మూడు లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులుండగా, ఈ సంఖ్యకు సమానంగా దాదాపు అంతమంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు వివిధ శాఖల్లో పనిచేస్తున్నట్లు అంచనాలు ఉన్నాయి. దీర్ఘకాలికంగా ఇది పరిపాలనా సామర్థ్యాన్ని ప్రభావితం చేయడంతో పాటు ఉద్యోగ భద్రతను కూడా ప్రశ్నార్థకంగా మారుస్తోంది. ఈ పరిస్థితికి గత ప్రభుత్వాల విధానాలే ప్రధాన కారణమన్న విమర్శలు ఉన్నాయి.

ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ కనిపించడం లేదు. దేవాదాయ భూముల పరిరక్షణ, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, సంక్షేమ హామీల అమలు వంటి అంశాల్లో ప్రభుత్వంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారాలు మారుతున్నా, ప్రజా సమస్యల పరిష్కారంలో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదనే అభిప్రాయం బలపడుతోంది.

వాస్తవానికి ఈ విమర్శలు ఒక్క ప్రభుత్వానికే పరిమితం కావు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు “ఇంటికో ఉద్యోగం” వంటి హామీలు వివాదాస్పదమయ్యాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తన హామీల అమలుపై విమర్శలు ఎదుర్కొంటోంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ గత వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా ఎన్నికల హామీల అమలుపై ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రజలు ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రకటనలను కాకుండా వాటి పనితీరును కొలుస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కాలపరిమితి నిర్ణయించి, వాటి అమలుపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయడం ప్రజలకు మేలు చేస్తుంది. హామీలను మరచిపోయే రాజకీయ సంస్కృతికి ముగింపు పలికి, బాధ్యతాయుత పాలనకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉన్నది. అధికారంలో ఎవరు ఉన్నా, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే ప్రభుత్వాల అసలైన విజయానికి కొలమానం.

Latest News

ఆగస్టు 10, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి ఉదయం 06.13 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం ఆరుద్ర ఉదయం 11.53 వరకు ఉపరి పునర్వసు యోగం వజ్ర రాత్రి 11.10 వరకు ఉపరి సిద్ది కరణం తైతుల ఉదయం 06.13 వరకు ఉపరి...

బోనాలు – చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం|BONALU|HISTORY|CULTURE

చారిత్రక, పురావస్తు, శాసన, సాహిత్య ఆధారాల విశ్లేషణ ప్రకారం బోనం సమర్పించే ఆచారం ఆషాఢ మాసంలో తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలోని అనేక గ్రామాల్లో గ్రామదేవతారాధనలో అంతర్భాగంగా కొనసాగుతోంది. వర్షాకాలం ప్రారంభ దశలో...

కల్లుకు శిల్లు.. సీసీ కెమెరా!?|ADUGU TRENDS

యెన్కటికి దొంగకు శెప్పే లాభమన్నరు. దోసుకుంటోనికి శెప్పైనా, తప్పైనా ఒకటే. పడదలే సూసుకుంటడు. గట్లనే గీ మద్దెల దొంగలు తమ రూటు మార్సుకున్నరు. కంటికి కనుకు లేకుండా ఇంటికి కన్నాలేసుడు అసొంటివి మానేసిండ్రు....

రాహుల్ ముందున్న మార్గాలివే!?|EDITORIAL

రాహుల్‌ ముందున్నది ‘బొద్దింకలను బుట్టలో వేసుకోవడం’ కాదు. యువత నమ్మకాన్ని సంపాదించడం. ఆ నమ్మకం ఒక్క ఆందోళనతో రాదు. నిరంతర పోరాటం, స్పష్టమైన విధానాలు, ప్రత్యామ్నాయ పాలనా నమూనా, విశ్వసనీయ నాయకత్వం కావాలి....

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 09 నుండి ఆగస్టు 15 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశివారికి అనుకూలమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. మీ పనితీరుకు ఉన్నతాధికారుల...

నవ్వినోల్లే నోర్లెల్లబెట్టిండ్రు!?|ADUGU TRENDS

సంకల్పించాలె కనీ, కాని పని ఉంటదా? ఉండనే ఉండదని నిరూపించిండు గీ పెద్దాయినె. నల్గురు సూసి నవ్వినా, నా పని నేను శేసుక పోతానని, శేసి సూపిండు. గీయినె పేరు హీలియో డా సల్వా....

క్యా బోల్తే… పాలక్!?|EDITORIAL

దేశ భవిష్యత్తు యువతే. ఆ యువత ప్రశ్నిస్తే వినాలి, సూచిస్తే ఆలోచించాలి, సమస్యలు చెబితే పరిష్కరించాలి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే అధికారానికి సమాంతరంగా జవాబుదారీతనాన్ని పెంపొందించే స్వతంత్ర ప్రజా వేదికలు అవసరం. ప్రజల...

ఆగస్టు 08, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి దశమి ఉదయం 11.09 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రోహిణీ మధ్యాహ్నం 03.15 వరకు ఉపరి మృగశిర యోగం ధ్రువ ఉదయం 08.20 వరకు ఉపరి వ్యాఘాత కరణం భద్ర ఉదయం 11.09 వరకు ఉపరి...

ఇగిప్పుడు ‘సావు’కొచ్చింది!?|ADUGU TRENDS

మన ఊర్లల్ల ఎవ్వలన్న కాలం శేసిండ్రంటేనే సూసొత్తం. కనికరం సూపి తలో సెయ్యేత్తం. దిక్కూమొక్కూలేనోల్లతై మనమే తలా ఇంతేసుకుని గాయింత ఇగ గా కట్టెల్లేసొత్తం. కానీ, తలకొరివి పెట్టాల్సిన కన్న బిడ్డలే కడసారి...

శ్రద్ధేది? శుద్ధ దండగ!?|EDITORIAL

2025 వర్షాకాల సమావేశాల్లో నిర్ణయించిన సమయంలో లోక్‌సభ కేవలం 29%, రాజ్యసభ 34% మాత్రమే పనిచేశాయి. ప్రశ్నోత్తరాల సమయంలో లోక్‌సభలో కేవలం 23%, రాజ్యసభలో 6% మాత్రమే పని జరిగింది. అదే సమావేశాల్లో14...

ఆగస్టు 07, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి నవమి మధ్యాహ్నం 01.29 వరకు ఉపరి దశమి నక్షత్రం కృత్తిక సాయంత్రం 04.48 వరకు ఉపరి రోహిణీ యోగం వృద్ధి ఉదయం 11.17 వరకు ఉపరి ధ్రువ కరణం గరజి మధ్యాహ్నం 01.29 వరకు ఉపరి...

మౌర్య పూర్వయుగం|ADUGU SPECIAL|HISTORY|COMPITITIVE EXAMS

క్రీ.పూ.650 నుండి క్రీ.పూ.250 మధ్య ఉన్న కాలాన్ని మౌర్యుల పూర్వయుగం లేదా బుద్ధుని యుగం లేదా షోడశ మహాజనపాదాల యుగం అని అంటారు. ఈ కాలంలో గౌతమ బుద్ధుడు ముఖ్య పురుషుడు కాబట్టి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News