ఆలుమొగల బంధం అమూల్యం, అపురూపమైంది. గందుకే ఒకర్నొకరు గౌరవించుకోవాలె. గట్లనే ప్రైజులు, సర్ ప్రైజులు ఇచ్చుకోవాలె. శెద్ద సూపాలె. టైమియ్యాలె. అభినందించాలె. ఇగ మొఘల్ రాజు షాజహానైతే భార్య ముంతాజ్ మహల్ మీద పేమ తగ్గక, ఆమె శనిపోయినంక ఏకంగా తాజ్ మహల్ నే కట్టించిండు. గట్లనే భార్య పానం పోయినంక పేమ సావనోల్లు గుళ్ళు, గోపురాలు కూడా కట్టిపిచ్చిండ్రు. కనీ, గీయనె గామె బతికుండంగనే తన పేమ ఎట్ల సాటుకున్నడో సూడుండ్రి.

తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం అత్తలూరు గీ శివారెడ్డిది. సామాన్య రైతు. ఐదో తరగతే సదువుకున్నడు. కనీ, కరెంటు మిషిన్ల పనుల్ల దిట్ట. పాత సామాన్లతోటే, కొత్త కొత్తయి కనిపెట్టుడు అలవాటు. గీ మద్దెల భార్యకు కీళ్ళ వాతమొచ్చింది. మెట్లెక్కలేకపోతాంది. ఇగ గిదంత పని కాదని, గామె కోసం, ఇంట్ల మెట్లకే ఎస్కలేటర్ తయారు శేసిండు. గది గూడ అరవై డెబ్బై యేలల్లనే. ఇగ గదాంతోటి పైకెక్కుతాండ్రు, కిందికి దిగుతాండ్రు. పేముంటే శనిపోయినంక కాదుల్లా.. బతికకున్నప్పుడే గిట్ల సాటుకోవాలె. ఏమంటరు?

