కుక్క-కోతిలది పుట్టుకతోనే వైరం. వాటి స్వభావికం కూడా. కోతులను తరిమికొట్టడానికి కుక్కలను సాదుతరు. గాడాడ గా కుక్కలు, కోతులు కలిసి మెలిసి కూడా ఉంటయి.

గట్లనే గా ఒడిశా రాష్ట్రం కలహండి జిల్ల కేంద్రం భవానీపట్నల ఓ కుక్క, కోతి పిల్లలు ఏం సక్కగ కలిసే ఉంటానయి. ఘోదాఘట్ సమీపంల ఓ నల్ల కుక్క యీపు మీద కోతిపిల్ల దర్జాగా కూసొని విహరిస్తాంది. కనీ గీ మనుసులే కలిసుంటలేరు? ఏం రోగమొచ్చిందో కనీ, కలిసున్నా ఎడం ఎడంగనే, ఎడమొకం పెడ మొకంగనే ఉంటాండ్రు. గవాటిని సూసైనా నేర్సుకుంటే బాగుండు!

