Thursday, July 30, 2026
23.7 C
Hyderabad

పాక్ పై భారత్‌ ప్రతి దాడులు?

ఆపరేషన్’పై ‘అడుగు’ అప్ డేట్
పాక్ ప్రయోగించిన 26 డ్రోన్ల నిర్వీర్యం!
అమృత్‌సర్‌లో గాయపడిన ఓ కుటుంబం
ఆరు నగరాల్లో క్షిపణుల ప్రయోగం!
రావల్పిండి సమీపంలో భారీ పేలుళ్లు!
ఇస్లామాబాద్‌ లోనూ వరుస దాడులు!
ఈ తెల్లవారుజామున ముష్కరులపై ముప్పేట దాడి
తాజా దాడులపై పాక్‌ ఆర్మీ ప్రకటన

మరోవైపు పాక్‌ సైనిక స్థావరాలపై బీఎల్‌ఏ దాడులు
సిబ్బిలోని మిలటరీ క్యాంపుపై గ్రనేడ్లతో దాడి
బలూచిస్తాన్‌ తిరుగుబాటుదారుల వశం
క్వెట్టా సహా అనేక ప్రాంతాల స్వాధీనం

ఇంకోవైపు టీటీపీ దాడులు
20 మంది పాక్ సైనికుల హతం

పాక్ తోకాడించడం మానలేదు. ఇంకా భారత్ బార్డర్ ప్రజలే లక్ష్యంగా దాడులకు తెగబడుతూనే ఉంది. 9వ తేదీ అర్థరాత్రి అనేక డ్రోన్లను భారత్ పై పాక్ ప్రయోగించింది. నియంత్రణ రేఖ వెంబడి 26 ప్రదేశాలలో డ్రోన్లు కనిపించాయి. వీటిలో అనుమానిత సాయుధ డ్రోన్లు ఉన్నాయి. బారాముల్లా, శ్రీనగర్, అవంతిపోరా, నగ్రోటా, జమ్మూ, ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, ఫాజిల్కా, లాల్‌గఢ్ జట్టా, జైసల్మేర్, బార్మెర్, భుజ్, కుర్బెట్ మరియు లఖి నాలా వంటి ప్రదేశాలు ఉన్నాయి.

విచారకరంగా, ఫిరోజ్‌పూర్‌లోని ఒక పౌర ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్న సాయుధ డ్రోన్ వల్ల స్థానిక కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. వారికి వైద్య సహాయం అందించారు. అలాగే ఈ రోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో అమృత్‌సర్‌లోని ఖాసా కాంట్ మీదుగా ఎగురుతున్న బహుళ శత్రు సాయుధ డ్రోన్‌లను గుర్తించారు. శత్రు డ్రోన్‌లను మన వైమానిక రక్షణ విభాగాలు తక్షణమే నియోగించి నాశనం చేశాయి. ప్రతిగా భారత్ ఆ డ్రోన్లను నిర్వీర్యం చేసింది. ఎంతకూ పాక్ పన్నాగాలు ఆగకపోవడంతో తెల్లవారు జాము నుంచి భారత్ పాక్ పై ప్రతిదాడులు చేస్తోంది. అయితే ఈ దాడులను పాక్ ఆర్మీ ధృవీకరించింది.

పాకిస్తాన్‌లోని రావల్పిండి సమీపంలో ఒకదాని తర్వాత ఒకటి మూడు పేలుళ్లు సంభవించాయని పాక్‌ ఆర్మీ ప్రకటించింది. రావల్పిండిలోని నూర్‌ ఖాన్‌ ఎయిర్‌బేస్‌ సమీపంలో శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఇస్లామాబాద్‌ నివాసితులు వరుసగా మూడు పేలుళ్ల శబ్దాలు విన్నారని తెలుస్తోంది. భారీగా నష్టం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. మరోవైపు, పోలీసులు, రెస్క్యూ బృందాలను సంఘటనా స్థలానికి పంపించారు. ఇస్లామాబాద్‌, లాహోర్‌, రావల్పిండితో సహా ఆరు ప్రధాన నగరాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు వార్తలు వస్తున్నాయి. షోర్కోట్‌లోని రఫికి ఎయిర్‌బేస్‌ సమీపంలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. రావల్పిండిలోని వైమానిక స్థావరంపై భారత యుద్ధ విమానాలు క్షిపణులను ప్రయోగించాయని పాకిస్తాన్‌ సైనిక ప్రతినిధి ఆరోపించారు. మే 10 ఉదయం 3:15 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు అన్ని విమానాలకు పాకిస్తాన్‌ గగనతలం మూసివేస్తున్నట్లు పాకిస్తాన్‌ విమానాశ్రయాల అథారిటీ ప్రకటించింది. పాకిస్తాన్‌లోని పెషావర్‌లో పెద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. పాకిస్తాన్‌లోని నూర్‌ ఖాన్‌, షోర్‌కోట్‌, మురిద్‌ వైమానిక దళ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు పాకిస్తాన్‌ ఆర్మీ ప్రతినిధి తెలిపారు. అయితే, వైమానిక స్థావరంపై ప్రతీకార చర్యను భారతదేశం ఇంకా ధృవీకరించలేదు.
కొనసాగుతున్న బిఎల్ఎ దాడులు
పాకిస్థాన్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న బలూచిస్థాన్‌ తిరుగుబాటుదారులు ఆ ప్రాంతాన్ని తమ వశం చేసుకున్నారు. ఓవైపు భారత్‌పై డ్రోన్లు, క్షిపణి దాడులకు పాక్‌ తెగబడుతున్న సమయంలో… బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ) సహా మూడు తిరుగుబాటు గ్రూపులు అక్కడి పాక్‌ సైనిక స్థావరాలపై దాడులకు దిగాయి. క్వెట్టాలోని ఫైజాబాద్‌ ప్రాంతంలో పాక్‌ దళాలు, తిరుగుబాటుదారుల మధ్య తీవ్ర స్థాయిలో కాల్పులు జరిగాయి. సిబ్బిలోని మిలటరీ క్యాంపుపై తిరుగుబాటుదారులు గ్రనేడ్లతో దాడికి దిగారు. పాకిస్థాన్‌ ఆర్మీని తరిమికొడుతూ, అక్కడి కీలక నగరం క్వెట్టా సహా అనేక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఆరు ప్రాంతాల్లో పాక్‌ దళాలపై ఐఈడీలు, గ్రనేడ్లు, ఆటోమేటిక్‌ ఆయుధాలతో దాడులు చేశామని బీఎల్‌ఏ అధికార ప్రతినిధి జియాంద్‌ బలూచ్‌ ప్రకటించారు.

ఇదిలావుండగా, క్వెట్టా, ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వ భవనాలు, ఇతర ప్రాంతాల్లో పాకిస్థాన్‌ జెండాలను తొలగించి.. బలూచిస్థాన్‌ జెండాలను ఎగురవేస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

టీటీపీ దాడులు

పాక్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తెహ్రిక్‌ ఈ తాలిబన్‌ పాకిస్తాన్‌(టీటీపీ) తీవ్రవాదులు చేసిన దాడిలో 20 మంది పాక్ సైనికులు హతమయ్యారు. పాకిస్తాన్‌, దక్షిణ వజిరిస్తాన్‌లోని షకాయి సబ్‌ డివిజన్‌లో ఉన్న ఓ మిలటరీ ఔట్‌పోస్టుపై గురువారం అర్ధరాత్రి తర్వాత ఈ దాడి జరిగినట్టు రిపబ్లిక్‌ వరల్డ్‌ సంస్థ ఓ కథనంలో పేర్కొంది. లేజర్‌ రైఫిల్స్‌ ఉపయోగించి టీటీపీ చేసిన తొలి దాడిలో ఆరుగురు పాక్‌ సైనికులు మరణించారు. మిలటరీ ఔట్‌పోస్టు రక్షణకు బయలుదేరిన రెండు సైనిక వాహనాలపైనా టీటీపీ దాడి చేసింది. మొత్తంగా 20 మంది పాక్‌ సైనికులు మరణించారని, ఐదుగురు గాయపడ్డారని టీటీపీ ప్రకటించింది.

Latest News

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News