అమెరికల కొలువొత్తే ఏం శేత్తం? ఎగిరి గంతేత్తం. గది కూడా ఏడాదికి మూడు కోట్ల జీతమంటే! వీసాను కూడా గా కంపెనోల్లే ఇప్పిత్తమంటే? ఇంకేమన్నా ఉందా? తంతె పరుపుల పడ్డట్లు. ఇగ ఊకుంటాం? ఒక్క గంతుల్నే గాడ పడ్తం. కనీ గీయినె మాత్రం ఎగిరి పల్లే!, ఎగిరెగిరి పోలే!! గంతేయలే? యేడున్నడో గాడనే ఉన్నడు. కోట్లు గుమ్మరిస్తే యేంది? యే గా కొలువే వద్దు పో? అన్నడు. కన్న తల్లి దండ్రుల కోసం కోట్లను కాలదన్నిండు.

గీ వివేక్ శర్మది ఉత్తర ప్రదేశ్ ల కాన్పూర్. తండ్రికి రైల్వే కొలువు. అమ్మ కాన్గిర్ బడి శెప్పే పంతులమ్మ. ముంబై ఐఐటీల బీ టెక్ సదువుతాంటే, గీయిన తెలివిని శూసి, అమెరికల శాన్ ఫ్రాన్సిస్కోల ఉండే ఓ కంపెనీ ఏడాదికి అచ్చరాల 2 కోట్ల 90 లచ్చల రూపాల జీతంతోటి, ఆడికి తీస్కపోయి, అన్ని సదుపాయాలు కల్పిత్తనంది. గింతల్నే తండ్రికి గుండెపోటొచ్చి, సావు తప్పి బత్కి పోయిండు. ఇగ గా అమ్మకు క్యాన్సర్ వచ్చిందన్నరు. గిప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అవ్వయ్యలకు తోడుంటం? గట్లనే గవాల్లను ఒదిలి పోతే ఎట్ల? అనుకున్నడు. గా కోట్లను కాల దన్నిండు. కొలువును వద్దు పో అన్నడు. ఉన్న ఊల్లెనే ఓ కిరాణం దుకాణం పెట్టిండు. అయ్యవ్వలకు సేవలు శుకుంట గీడనే ఉన్నడు. ఇగ సదువుకున్న యిద్దెను తెలిసినోల్లకు శెప్తాండు. గీ ముచ్చటను లెఫ్టినెంట్ జనరల్ డీపీ పాండె ఎక్స్ ల పెట్టిండు. ఇగ గిది నెట్టింట్ల తెగ వైరలైతాంది. గా వివేక్ ను అందరూ అభినందిత్తాండ్రు. మనం గూడ అభినందిద్దామా?

