పాలకుర్తిలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి నాగవరపు రాజేశ్వర రావు ని, జనగామ జిల్లా ప్రిన్సిపల్ జడ్జి రవీంద్ర శర్మని న్యాయవాదులు మర్యాద పూర్వకంగా కలిశారు. కలిసిన వారిలో పాలకుర్తి మండలం దర్దేపల్లి కి చెందిన హైకోర్టు, ఉమ్మడి జిల్లా కోర్టుల సీనియర్ న్యాయవాది చౌడవరపు లింగమూర్తి, అడుగు డిజిటల్ మీడియా చీఫ్ ఎడిటర్ డాక్టర్ మార్గం లక్ష్మీ నారాయణ, న్యాయవాది మేకల సాంబరాజు తదితరులు వున్నారు.

