Thursday, September 17, 2026
27.7 C
Hyderabad

అసెంబ్లీలో నదీజల రాజకీయాలు!|EDITORIAL

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నదీ జలాలు ఎజెండాగా కొనసాగనున్నాయి. కృష్ణా, గోదావరి జలాలపై ఆంధ్రప్రదేశ్ విధి విధానాలు, కేంద్రం వైఖరిపై కంటే, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ ల తీరుతెన్నులపైనే ప్రధానంగా చర్చ జరుగనుంది. ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్నది ప్రతిపక్షం వ్యూహం. గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణకు జరిగిన జల అన్యాయాన్ని ప్రజల ముందు పెట్టాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం తలపోస్తోంది. అసెంబ్లీ వేదికగా మరోసారి ‘నీటి మంటలు’ చెలరేగే పరిస్థితి నెలకొంది.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్ 

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నదీ జలాలు ఎజెండాగా కొనసాగనున్నాయి. కృష్ణా, గోదావరి జలాలపై ఆంధ్రప్రదేశ్ విధి విధానాలు, కేంద్రం వైఖరిపై కంటే, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ ల తీరుతెన్నులపైనే ప్రధానంగా చర్చ జరుగనుంది. ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్నది ప్రతిపక్షం వ్యూహం. గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణకు జరిగిన జల అన్యాయాన్ని ప్రజల ముందు పెట్టాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం తలపోస్తోంది. అసెంబ్లీ వేదికగా మరోసారి ‘నీటి మంటలు’ చెలరేగే పరిస్థితి నెలకొంది.

రాష్ట్ర విభజన అనంతరం ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు పరస్పర సహకారంతో నదీజలాలను సమర్థంగా వినియోగించుకుంటాయన్న ఆశలు నెరవేరలేదు. పైగా జలవివాదాలు మరింత ముదిరాయి. వృథా అవుతున్న నీటిని నిల్వ చేసుకోవడం, సమగ్ర జలవిధానాలు రూపొందించుకోవడం వంటి అంశాలను పాలకులు విస్మరించారు. దూరదృష్టి లేని నిర్ణయాలు, రాజకీయ లాభాలకే పరిమితమైన ప్రాజెక్టులు ఈ సంక్షోభానికి ప్రధాన కారణాలుగా మారాయి.

ఏపీలో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడిన పోలవరం పదేళ్లు గడిచినా పూర్తికాలేదు. జగన్‌ పాలనలో బటన్‌ నొక్కుడు కార్యక్రమాలు, మాఫియాల ఆరోపణలు, రాజధాని గందరగోళం మధ్య పోలవరం వెనుకబడింది. ఇప్పుడు చంద్రబాబు కూడా వైఖరిలోనూ పోలవరం పూర్తి చేయడంపై కంటే బనకచర్ల, ఇతర లింక్‌ ప్రాజెక్టుల పేరుతో ప్రాంతీయ విభేదాలను పెంచే ప్రయత్నాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

తెలంగాణలోనూ దాదాపు ఇదే పరిస్థితి కొనసాగింది. కేసీఆర్‌ హయాంలో కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు తెలంగాణకు వరంగా ప్రచారం జరిగినా, నిర్మాణ లోపాలు, నిర్వహణ వైఫల్యాలు బయటపడ్డాయి. బ్యారేజీల కుంగుబాటు, లక్షల కోట్ల ప్రజా ధనం వృథా అనే విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. ఇతర మధ్యతరహా పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కూడా నిర్లక్ష్యానికి గురైంది. ఫలితంగా జల భద్రత కంటే రాజకీయ ప్రతిష్ఠే ప్రధానంగా మారింది.

ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ ప్రధానంగా లేవనెత్తుతున్న అంశం పోలవరం–నల్లమల (పీఎన్‌ లింక్‌) ప్రాజెక్టు. ఈ లింక్‌ ద్వారా కేవలం గోదావరి మిగులు జలాలే కాకుండా కృష్ణా జలాలను కూడా మళ్లించే ప్రయత్నం జరుగుతోందన్నది బీఆర్‌ఎస్‌ వాదన. ఏపీ ప్రభుత్వం పీఎన్‌ లింక్‌ ద్వారా సుమారు 200 టీఎంసీల నీటిని తరలించాలన్న ప్రతిపాదనలతో డీపీఆర్‌ తయారీకి టెండర్లు పిలవడం అనుమానాలకు తావిస్తోంది.
ఈ లింక్‌లో భాగంగా పోలవరం కుడికాలువ నుంచి ప్రకాశం బరాజ్‌, అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్‌కు నీటిని తరలించే ప్రణాళిక ఉంది. ఈ మార్గంలో నాగార్జునసాగర్‌ కుడి కాలువను దాటాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఈ అనుసంధానాలను ఉపయోగించి సాగర్‌ నుంచే కృష్ణా జలాలను బొల్లాపల్లికి మళ్లించే అవకాశముందని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. ప్రస్తుతం 173 టీఎంసీల సామర్థ్యంతో చేపడుతున్న బొల్లాపల్లి రిజర్వాయర్‌ను భవిష్యత్తులో 400 టీఎంసీల వరకు విస్తరించవచ్చన్న వాదన ఈ భయాలను మరింత పెంచుతోంది.

ఇప్పటికే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా ఏపీ కేటాయింపులకు మించి కృష్ణా జలాలను వినియోగిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. శ్రీశైలం నుంచే జలదోపిడీ జరుగుతుండగా, సాగర్‌ నుంచీ అదే ప్రక్రియ మొదలైతే తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. చెన్నై తాగునీటి కోసం కృష్ణా బేసిన్‌ రాష్ట్రాలు 15 టీఎంసీలు ఇవ్వాలన్న ఒప్పందం కూడా కాలక్రమేణా జలదోపిడీకి మారిందన్న విమర్శలు ఉన్నాయి.

ఈ మొత్తం పరిణామాల్లో అత్యంత ఆందోళన కలిగించే అంశం, ప్రభుత్వాలకు నీటి వనరుల నిర్వహణపై సమగ్ర దృక్పథం లేకపోవడం. వృథా, మిగులు జలాలను నిల్వ చేసుకునే ప్రాజెక్టులు, రాష్ట్రాల మధ్య విశ్వాసంతో కూడిన ఒప్పందాలు, పారదర్శక సంఖ్యా వివరాలు, పంపకం వంటివేవీ రాజకీయ ప్రాధాన్యత పొందడం లేదు. ఫలితంగా, నీరు అత్యంత ఆవశ్యమైన వనరుగా కాకుండా, ఒక రాజకీయ ఆయుధంగా మారింది.

అసెంబ్లీలో ఈ అంశాలపై తీవ్ర వాగ్వాదం అనివార్యంగా మారింది. అయితే ఈ చర్చలు రాజకీయ ఆరోపణలకే పరిమితం కాకుండా, శాస్త్రీయంగా, సాంకేతిక సంఖ్యల ఆధారంగా, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే దిశగా సాగితేనే ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. లేదంటే, గతంలాగే నదీజలాలు రాజకీయ మంటల్లో కాలిపోతూనే ఉంటాయి.

Latest News

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News