Thursday, November 26, 2026
29.2 C
Hyderabad

భవిష్యత్తు దార్శనికం మన రాజ్యాంగం|NARENDRA MODI|CONSTITIUTION

(నేడు భారత రాజ్యాంగ దినోత్సవం)

రాజ్యాంగ పరిషత్తు 1949 నవంబరు 26న మన రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఈ నేపథ్యంలో మనమిప్పుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బాబాసాహెబ్ అంబేడ్కర్ సహా రాజ్యాంగ పరిషత్తులోని ప్రతి సభ్యుడినీ స్మరించుకుంటున్నాం. ఒక ఆధునిక రాజ్యాంగ రచనలో సుసంపన్న భారతీయ సంప్రదాయాలు, నాగరిక విజ్ఞానం నుంచి విస్తృత స్ఫూర్తి పొందడంలోనే వారి గొప్పదనం స్పష్టమవుతుంది. అనేక మతాలు, భాషలు, ఆచారాలు, ఆలోచనా ధోరణులుగల భారత్‌ వంటి వైవిధ్యభరిత దేశం కోసం రూపొందిన రాజ్యాంగమంటే– పార్లమెంటు, న్యాయస్థానాల పరిధులకు మించి అది విస్తృత ప్రభావం చూపగలిగినదై ఉండటం చాలా ముఖ్యం. మన ప్రజల… ముఖ్యంగా మన యువతరంలోని సమష్టి చైతన్యంతో దాని అనుబంధం మరింత విస్తృతమయ్యేలా, దేశ ఉజ్వల భవిష్యత్తు దిశగా ఐక్యతా స్ఫూర్తిని బలోపేతం చేయడం కోసం మేం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాం. అందుకే, నవంబరు 26వ తేదీని రాజ్యాంగ దినోత్సవంగా పాటించాలని మా ప్రభుత్వం దశాబ్ద కాలంకన్నా ముందే నిర్ణయించింది.

నాతో సహా కోట్లాది భారతీయులకు ఈ రాజ్యాంగం మనందరి జీవిత ప్రస్థానంలో అవిభాజ్య భాగం. నా బాల్యాన్ని, నేను పెరిగిన నిరాడంబర పరిస్థితులను, దైనందిన జీవన పోరాటాన్ని ఓసారి వెనుదిరిగి చూసుకున్నపుడు– మన రాజ్యాంగంపై నాలో అపార కృతజ్ఞతా భావన పొంగిపొరలుతుంది. ఎలాంటి ప్రత్యేక హక్కులు లేదా పుట్టుకతో వచ్చే ప్రయోజనాలతో నిమిత్తం లేకుండా ఓ సామాన్య కుటుంబంలో పుట్టిన బిడ్డకు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి సేవ చేసే గురుతర బాధ్యత లభించడాన్ని బట్టి మన రాజ్యాంగం ఎంత అసాధారణమైనదో ప్రస్ఫుటమవుతుంది. ఒక వ్యక్తి పుట్టుక, పరిస్థితులు అతని భవిష్యత్తుకు హద్దులు గీయలేవనే వాస్తవం ఈ రాజ్యాంగం వల్లనే తేటతెల్లమవుతోంది. ఈ నేపథ్యంలో మా వంతుగా మన రాజ్యాంగాన్ని బలోపేతం చేయడం ద్వారా ఈ కృతజ్ఞతాపూర్వక రుణం తీర్చుకోవడానికి మేం ప్రయత్నించాం.

ప్రసిద్ధ రాజ్యాంగవేత్త గ్రాన్‌విల్ ఆస్టిన్ మన రాజ్యాంగాన్ని ‘ఇది అన్నింటికన్నా ముందు ఒక సామాజిక పత్రం’ అని అభివర్ణించారు. సామాజిక, ఆర్థిక న్యాయం కోసం అన్వేషణ మన రాజ్యాంగ మూలాల్లోనే నిక్షిప్తమైంది. కాబట్టి, మన రాజ్యాంగ రూపకర్తల ఆశయ సాకారానికి కృషి చేయడాన్ని మించి మనకు సంతృప్తినిచ్చేది ఇంకేముంటుంది? భారత్‌లో దాదాపు 50 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి విముక్తులయ్యారని ప్రపంచ బ్యాంకు ఇటీవల ఒక నివేదికలో వెల్లడించింది. తరతరాలు కొనసాగిన లేమి నుంచి బయటపడిన కోట్లాది తల్లిదండ్రులకు నేడు తమ బిడ్డల మెరుగైన భవిష్యత్తుపై కలలు కనే అవకాశం లభించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఒక కుటుంబానికి పూరింటి నీడ నుంచి పక్కా ఇంటి భద్రత నిచ్చినపుడు పౌరుల ఆత్మగౌరవం అనే రాజ్యాంగ హామీ సార్థకమవుతుంది. డిజిటల్ సాంకేతికతలు, యూపీఐ వంటి వేదికలు అన్ని రకాల విభజన రేఖలను చెరిపివేస్తున్నాయి. తద్వారా ఒకనాడు కొద్దిమంది ఉన్నత వర్గాల వారికి మాత్రమే పరిమితమైన అవకాశాలను ప్రతి పౌరుడికీ అందుబాటులోకి తెచ్చినప్పుడు, సార్వజనీనతపై రాజ్యాంగ ఆదర్శాన్ని మనం సాకారం చేస్తాం.

ఈ రాజ్యాంగ దృక్పథానికి ఇంకా అనేక రూపాలున్నాయి. ఇందులో మేం తెచ్చిన సవరణల జాబితాను కూడా ఇదే కోణంలో చూడవచ్చు. ఈ మేరకు 101వ సవరణ– ఎంతో కాలం నుంచీ ఎదురుచూస్తున్న ‘వస్తు సేవల పన్ను’ (జీఎస్టీ)ని అమలులోకి తెచ్చింది. ఇక 102వ సవరణతో వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్‌కు రాజ్యాంగ హోదా లభించగా, సమాజంలోని అణగారిన వర్గాల చిరకాల స్వప్నం నెరవేరింది. అలాగే, 103వ సవరణకు విస్తృత సామాజిక ఆమోదం లభించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ ద్వారా ఇది ప్రస్తుత రిజర్వేషన్ వ్యవస్థ పరిధిలో లేని వర్గాలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల దీర్ఘకాలిక విస్మృత ఆకాంక్షలను నెరవేర్చింది. గడచిన దశాబ్దం నుంచీ, మనం కర్తవ్యంపై– అంటే… పౌర విధులపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. మన నాగరికత సదా సమాజంలోని ప్రతి వ్యక్తికీ, ప్రతి వృత్తికీ గల బాధ్యతలను ప్రస్ఫుటం చేస్తుంది. స్వచ్ఛ భారత్ నుంచి జలసంరక్షణ, పర్యావరణ పరిరక్షణ దాకా అనేక ప్రజా ఉద్యమాలలో ఈ కర్తవ్య స్ఫూర్తి ద్యోతకమైంది.

అయితే, ఈ సందర్భంగా నేను ప్రస్తావించక తప్పని వాస్తవం మరొకటుంది. మన చరిత్రలో రాజ్యాంగ పరిరక్షణ బాధ్యతగలవారే దాన్ని బలహీనపరిచిన సందర్భాలున్నాయి. ఇంకా చిత్రమేమిటంటే– దేశాన్ని ఐదు దశాబ్దాల పాటు పాలించినవారు కూడా వీరే. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాని ఓ ప్రభుత్వం, తాత్కాలిక పార్లమెంటులో తన ఆధిక్యాన్ని అడ్డుపెట్టుకుని, పౌరుల ప్రాథమిక స్వేచ్ఛకు పరిమితులు విధించిన 1951 నాటి తొలి రాజ్యాంగ సవరణకు ఈ ఏడాదితో 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. భారత తొలి సార్వత్రక ఎన్నికలకు కేవలం కొన్ని నెలల ముందు చేసిన ఈ పని, ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయడంతో పాటు ప్రజల్లో వ్యతిరేకతను అణచివేసేందుకు ఉద్దేశించినదని రుజువైంది. అత్యవసర పరిస్థితి ఉచ్ఛస్థాయిలో ఉన్నప్పుడు చేసిన 42వ రాజ్యాంగ సవరణకూ 50 ఏళ్లు పూర్తవుతాయి. ఇది న్యాయ సమీక్షను పరిమితం చేసి, సంస్థాగత అధికారాల సమతౌల్యాన్ని ప్రాథమికంగా మార్చివేసింది. అధికార దాహం, రాజ్యాంగ వ్యతిరేక నాయకత్వం ఎంతటి అకృత్యాలకు పాల్పడగలదో యువతరం తెలుసుకోవడం అవశ్యం. ఇందుకోసం 38, 39వ రాజ్యాంగ సవరణలను కూడా అధ్యయనం చేయాలని యువతీయువకులందర్నీ కోరుతున్నాను.

రాజ్యాంగంలోని ప్రతి అక్షరం దేశమంతటా స్ఫూర్తిదాయకంగా అమలు కావాలన్నది మన రాజ్యాంగ రూపకర్తల ఆకాంక్ష. అయితే, 70 ఏళ్లకు పైగా కాలం 370, 35ఎ అధికరణాల అమలు వల్ల జమ్మూకశ్మీర్‌లో వారి ఆశయం నెరవేరలేదు. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల ప్రజలు సహా మహిళా హక్కులకు భంగం కలిగింది. చివరకు 2019లో ఈ చారిత్రక తప్పిదాన్ని మేం సరిదిద్దాం. దేశంలో అనేకచోట్ల… ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో దశాబ్దాలుగా నక్సలైట్లు తుపాకీలు ఎక్కుపెట్టి, నిరుపేదలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా కాలరాచారు. అయితే, ఈ ఏడాదిలోనే నక్సలిజాన్ని రూపుమాపడం ఎంతో ఆనందించాల్సిన విషయం. తద్వారా నిరుపేదలు కూడా ఎలాంటి భయాందోళనలు లేకుండా రాజ్యాంగబద్ధ హక్కులను స్వేచ్ఛగా వినియోగించుకోగల అవకాశం లభించింది. ప్రస్తుతం ఇక మిగిలింది ‘మేధావి నక్సలైట్లు’ (దిమాగీ నక్సల్స్‌) మాత్రమే.

చివరగా, మన రాజ్యాంగ రూపకల్పనలో మహిళల విశేష కృషిని విస్మరించలేం. వారి ప్రమేయం లేనిదే రాజ్యాంగ ప్రస్థానం పరిపూర్ణం కాజాలదు. అయితే, ఈ ఏడాది మొదట్లో మనందరికీ సిగ్గుచేటుగా అనిపించే ఒక సంఘటన చోటుచేసుకుంది. చట్టసభల్లో మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించే లక్ష్యంతో తెచ్చిన చట్టాన్ని ఓ ప్రతిపక్షం అడ్డుకుంది. రాజ్యాంగ విలువలపై వారి నిర్లక్ష్యాన్నినికి ఇది మరో తార్కాణం. కానీ, వారికి న్యాయం లభించకుండా ఏ శక్తీ అడ్డుకోలేదు… దేశంలోని ‘నారీశక్తి’కి ఇదే నా హామీ. భారత్‌ ఇవాళ ఓ కీలక మలుపులో ఉంది… దేశాన్ని 2047 కల్లా ‘వికసిత భారత్‌’గా రూపొందించేందుకు మనం చేస్తున్న సమష్టి కృషికి రెండు సరళ, శక్తియుత సూత్రాలు మార్గనిర్దేశం చేయగలవు. వాటిలో ఒకటైన– ‘దేశమే ప్రధానం’ అన్నది మన తారకమంత్రంగా ఉండాలి; రెండోది– ‘కర్తవ్య నిర్వహణ’ మన కార్యాచరణ కావాలి. ఆ విధంగా చేయగలిగినప్పుడే మన భావి తరాలకు ఉజ్వల భవిష్యత్తును వారసత్వంగా అందించగలం.


నరేంద్ర మోదీ
భారత ప్రధానమంత్రి

Latest News

నోరు జారె.. ! ఎనక్కి తీసుకునె!!|ADUGU BULLET

కవితకు ఎయిడ్స్ రోగమని.. మంత్రి సీతక్క నోరు జారె! సోషల్ మీడియాలో రచ్చ రచ్చతో పాపం..! పెద్దక్క మాట మార్చె! కవితక్కకు సారీ చెప్పి.. విమర్శలకు ముగింపు పలికె! అన్న కేటీఆర్ ను తిట్టబోయి.. చెల్లి కవితకు...

అమ్మ పేమా? తల్లి పగా!?|ADUGU TRENDS

పేమకు సాటి లేదు. పగకు పాటి లేదు. ఒక కుక్కపల్లి, చిరుత పులిల గీ ముచ్చట గిదీన్నే రుజువు శేసింది. పిల్లికి చెలగాటం, ఎలుకకు పాణ సంకటం అన్నట్లు... పులికి చెలగాటం.. కుక్కకు...

హసీనాకు శిక్షా? రక్షా!?|EDITORIAL

హసీనా స్వదేశానికి తిరిగి వెళ్ళడం భారత్‌-బంగ్లాదేశ్ దౌత్య సంబంధాలు, న్యాయవ్యవస్థ విశ్వసనీయత, ప్రజాస్వామ్య భవిష్యత్తుకు సంబంధించిన కీలక పరిణామం. ఆమెకు ఉరిశిక్ష తప్పుతుందా? లేక న్యాయపరమైన మరో పోరాటానికి తెరలేస్తుందా? అన్నది భారత్...

నవంబర్ 26, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం కృష్ణపక్షం తిధి విదియ సాయంత్రం 04.39 వరకు ఉపరి తదియ నక్షత్రం మృగశిర రాత్రి 09.57 వరకు ఉపరి ఆరుద్ర యోగం సిద్ద ఉదయం 11.49 వరకు ఉపరి సాధ్య కరణం గరజి సాయంత్రం 04.39 వరకు ఉపరి...

మనుసుల కంటే గా రోబేలో ఎక్కువా!?|ADUGU TRENDS

యెనకటికి మనుసులు యెన్నో శక్తియుక్తులు పదర్శించేటోల్లు. స్రుస్టికి పతి స్రుస్టి శేసేటోల్లు. మట్టి బొమ్మలకు, రాయి రప్పలకు పానం పోసేటోల్లు. గట్ల ఒచ్చినయే గీ రోబోలు. యినుప ముక్కలను మనిసి లెక్క ఒక్కటి...

శక్తివంతమైన భారత్-ఆసియాలో అగ్రగామి!|EDITORIAL

ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న భారత్, నేడు ప్రపంచ దేశాలతో పోటీపడుతూ కీలక శక్తిగా ఎదుగుతోంది. అభివృద్ధితో పాటు సమానత్వం, ప్రజాసంక్షేమం, సామాజిక న్యాయం, అంతర్జాతీయ విశ్వసనీయతకు ప్రాధాన్యతనిస్తూ శక్తివంతమైన, సమృద్ధివంతమైన...

నవంబర్ 25, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం కృష్ణపక్షం తిధి పాడ్యమి సాయంత్రం 06.53 వరకు ఉపరి విదియ నక్షత్రం రోహిణి రాత్రి 11.30 వరకు ఉపరి మృగశిర యోగం శివ పగలు 02.56 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 07.53 వరకు ఉపరి...

మన దేశంల మైనపు యిగ్రహాల మ్యూజియం!?|ADUGU TRENDS

పక్రుతి లెక్కనే గీ పపంచం యింతలు, యిశేషాల మయం. రకరకాల యిగ్రహాలను శేసే పద్ధతి ఉన్నట్లే, గా మైనపు బొమ్మలను గదే గా ఓంబత్తి, కొవ్వొత్తితో శేసి, గవాటిని ఓకాడ గదేనుల్లా.. మ్యూజియంల...

దక్షిణ భారతానికే తలమానికం…|PALAKURTHI|AKHANDA JYOTHI|SLNS TEMPLE

పాలకుర్తి క్షీరగిరిపై నేడే అఖండ జ్యోతి తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లాలోని పాలకుర్తి పట్టణం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. శివకేశవులు ఒకే కొండపై పక్కపక్కనే ఉన్న రెండు సహజ సిద్ధమైన గుహల్లో స్వయంభువులుగా కొలువుదీరిన...

సరైన దారులు వెతకాలి!?|EDITORIAL

ధరల పెరుగుదలతో సామాన్యుడి బతుకు భారంగా మారుతోంది. ఆదాయం పెరగకపోయినా ఖర్చులు మాత్రం చుక్కలనంటుతున్నాయి. ద్రవ్యోల్బణ కట్టడికి వడ్డీ రేట్ల పెంపే పరిష్కారం కాదు. ప్రజలకు ఉపశమనం కలిగించే ప్రత్యామ్నాయ మార్గాలను ప్రభుత్వాలు...

నవంబర్ 24, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం శుక్లపక్షం కార్తీక పౌర్ణమి అఖండజ్యోతి ప్రజ్వలన సాయంత్రం 06.00గం లకు తిధి శు పౌర్ణమి రాత్రి 08.57 వరకు నక్షత్రం కృత్తిక రాత్రి 12.57 వరకు ఉపరి రోహిణి యోగం పరిఘ సాయంత్రం 05.47 వరకు ఉపరి...

నవంబర్ 23, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం శుక్లపక్షం తిధి శు చతుర్దశి రాత్రి 10.43 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం భరణి రాత్రి 02.07 వరకు ఉపరి కృత్తిక యోగం వరీయాన్ రాత్రి 08.45 వరకు ఉపరి పరిఘ కరణం తైతుల రాహుకాలం గరజి ఉదయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News