రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ షాకోట్ వద్ద ఓ బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఘటన అనంతరం బాలికను నిందితులు ఎవరికైనా చెప్పితే ప్రాణహాని కలుగుతుందని బెదిరించారు. దీంతో భయంతో ఆమె ఎవరికీ చెప్పకుండా మౌనం పాటించింది. అయితే, కొన్నాళ్లుగా ఆమె ముబావంగా ఉండటాన్ని గమనించిన కుటుంబసభ్యులు ప్రశ్నించగా, అసలు విషయం వెల్లడైంది.
దీంతో బాలిక తల్లిదండ్రులు నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలిక వయస్సు 18 ఏళ్లలోపు కావడంతో నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్నట్లు, మరింత సమాచారం త్వరలో వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.

