Friday, July 17, 2026
24.5 C
Hyderabad

అమెరికా ఆటలో బంగ్లా బంతి!|EDITORIAL

బంగ్లాదేశ్‌లో హసీనా ప్రభుత్వాన్ని గద్దె దించడంలో అమెరికా పరోక్ష పాత్ర ఉంది. పాక్‌ను దువ్వుతున్నది. నేపాల్‌లో గొడవలు సృష్టించింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై ఆంక్షలు విధించింది. వీసాలపై కఠిన నిబంధలను పెట్టింది. బంగ్లాదేశ్‌ అంతర్గత అలజడుల వెనక అమెరికా హస్తం ఉందని అంతర్జాతీయ నిపుణులు ఆరోపిస్తున్నారు. ‘ఇతర దేశాల్లో వేలు పెట్టడం వల్ల తాము చాలా నష్టపోయామ’ని అమెరికా ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ తులసీ గబ్బార్‌ ఆ మధ్య అంగీకరించడం, అమెరికా వైఖరిని స్పష్టం చేస్తున్నది.

మార్గం-అడుగు, డా. మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్

దేశాలతో ఆటలాడుకోవడం అమెరికాకు అలవాటుగా మారింది. ఆంక్షలు, సుంకాలు విధించడం, బెదిరించడం పరిపాటిగా మారింది. తాజాగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే, 500 శాతం పన్నులు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు. ప్రపంచ దేశాలన్నీ తన కనుసన్నల్లో ఉండాలన్నది అమెరికా కోరిక. అందుకు అవసరమైన అన్ని కుయుక్తులు పన్నుతోంది. దేశాల అంతర్గత విషయాల్లో వేలుపెడుతూ వాటిని కంట్రోల్‌ చేస్తోంది. ఇజ్రాయిల్‌ను అడ్డం పెట్టుకుని పాలస్తీనాపై దాడికి తెగించింది. ఇరాన్‌, ఖతార్‌లపైనా విరుచుకు పడింది. ఏకంగా రాజకీయంగా దేశాల పాలకులనే మార్చేస్తోంది. ఒక్క భారత్‌లోనే అది సాధ్యం కాలేదు. చైనాలో సాధ్యం కాదు. విభిన్న మతాలు, కులాల సమాహారమైన భారత్, అతి పెద్ద ప్రజాస్వామ్యం కావడంతో ఇక్కడ దాని పప్పులు ఉడకడం లేదు.
బంగ్లాదేశ్‌లో హసీనా ప్రభుత్వాన్ని గద్దె దించడంలో అమెరికా పరోక్ష పాత్ర ఉంది. పాక్‌ను దువ్వుతున్నది. నేపాల్‌లో గొడవలు సృష్టించింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై ఆంక్షలు విధించింది. వీసాలపై కఠిన నిబంధలను పెట్టింది. బంగ్లాదేశ్‌ అంతర్గత అలజడుల వెనక అమెరికా హస్తం ఉందని అంతర్జాతీయ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఇతర దేశాల్లో వేలు పెట్టడం వల్ల తాము చాలా నష్టపోయామని అమెరికా ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ తులసీ గబ్బార్‌ ఆమధ్య అంగీకరించడం, అమెరికా వైఖరిని స్పష్టం చేస్తున్నది.
బంగాదేశ్‌లో హసీనాను గద్దె దించడం, యూనస్‌ను గద్దెనెక్కించడం చకచకా జరిగి పోయాయి. ఇప్పుడు హసీనాకు ఉరిశిక్షను కూడా విధించారు. రెండు దశాబ్దాల క్రితం రసాయన ఆయుధాల పేరుతో ఇరాక్‌పై దాడిచేసి అక్కడ సద్దాం హుస్సేన్‌ ప్రభుత్వాన్ని అమెరికా గద్దె దింపింది. సద్దాంను బంధించి, ఉరితీసే వరకు నిద్రపోలేదు. సరిగ్గా ఇప్పుడు బంగ్లాదేశ్‌లో జరుగుతున్న తీరు కూడా ఇరాక్‌ను పోలివుంది. హసీనా భారత్‌కు అనుకూలంగా ఉండడాన్ని అమెరికా జీర్ణించుకోలేదని అర్థం అవుతోంది. అయితే, పదవీచ్యుతురాలయ్యాక, హసీనా భారత్‌లో ఆశ్రయం పొందారు. ఇప్పుడామె మరణశిక్షకు అర్హురాలని అక్కడి ట్రిబ్యునల్‌ నిర్ణయించింది. ముగ్గురు సభ్యుల ఈ ట్రిబ్యునల్‌ హసీనా ఎన్నో దుర్మార్గాలకు పాల్పడిందని ఏకరువు పెట్టింది. తనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్నవారిని కాల్చిపారేయమని ఆదేశించారని, డ్రోన్లు, హెలికాప్టర్లు ఉపయోగించి మరీ నిరసనకారులపై మారణాయుధాలతో విరుచుకుపడమని భద్రతాబలగాలను ఒత్తిడి చేశారని న్యాయమూర్తులు తేల్చారు. అధికారంలో కొనసాగడానికి అత్యంత అమానుషంగా ప్రవర్తించారంటూ, తీవ్రంగా గాయపడిన నిరసనకారులను సకాలంలో ఆస్పత్రికి తరలించడానికి కూడా భద్రతాదళాలు నిరాకరించాయని న్యాయమూర్తులు ప్రకటించారు. తీర్పు ఇవ్వడంలో జాప్యం జరిగినందుకు క్షమించమని కూడా ఒక న్యాయమూర్తి అన్నారు. తీర్పు వెలువడగానే, యూనిస్‌ ప్రభుత్వం హసీనాను తమకు అప్పగించమని డిమాండ్‌ చేశారు.
సరిగ్గా యాభైయేళ్ళక్రితం జరిగిన సైనిక కుట్రలో తండ్రి, తల్లి, ముగ్గురు సోదరులను కోల్పోయి, ఆరేళ్ళపాటు భారత్‌లో ఇందిర నీడన తలదాచుకొని, తిరిగి స్వదేశంలో కాలూని అధికారాన్ని చేజిక్కించుకున్న హసీనా గతం ఇప్పుడు అందరికీ గుర్తుకువస్తోంది. జియావుర్‌ రహ్మాన్‌ భార్య ఖలీదా జియా మీద అలుపెరగని, సాహసోపేత పోరాటాలు చేశారు. ఆధిపత్య పోరాటంలో ముజబూర్‌ రహ్మాన్‌ కుమార్తె హసీనా పైచేయి సాధించారు. ఖలీదా సహా బీఎన్పీ అధినాయకుల నిర్బంధాలు, ఆ పార్టీకి అండగా ఉన్న జమాతే వంటే ఇస్లామిక్‌ ఛాందసశక్తులను అధికారికంగానూ, అనధికారికగానూ హసీనా చీల్చిచెండాడారు. హసీనా పాలనలో బంగ్లాదేశ్‌ వేగంగా వృద్ధి చెందింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పూర్తయ్యాయి, పేదరిక నిర్మూలనలోనూ మంచిపేరు తెచ్చుకుంది. తనకు వ్యతిరేకంగా సాగిన విద్యార్థి ఉద్యమంపట్ల హసీనా నిర్దయగా వ్యవహరించారన్నదీ వాస్తవమే. ఆ తరువాత ఆమె దిగివచ్చినా, అప్పటికే పరిస్థితి చేజారింది. రిజర్వేషన్‌ వ్యతిరేక ఉద్యమం తన లక్ష్యాన్ని సాధించుకున్న తరువాత నిజానికి చల్లారినా, స్వల్పకాలంలోనే తిరిగి రాజుకోవడం వెనుక జమాత్‌ ఇస్లావిూ, బీఎన్పీ ఉండటంతో ఆమె కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని అంటారు.

పాక్ ఒత్తిడి కారణంగా అమెరికా, దాని మిత్రదేశాలు కొన్ని ఆమెకు పూర్తి వ్యతిరేకంగా వ్యహరించాయి. ఆమె పారిపోయి భారత్ కు వచ్చిన తరువాత, బంగ్లాదేశ్‌లో సాగిన పరిణామాలన్నీ ఆమె పట్ల ఏయే శక్తులు ఏ లక్ష్యాల కోసం కత్తికట్టాయో తేటతెల్లం చేస్తున్నాయి. గృహనిర్బంధంలో ఉన్న ఖలీదా విదేశీ చికిత్సతో ఎన్నికలకు సిద్ధపడటం, వేలాదిమంది జమాత్‌ యోధులు జైళ్ళ నుంచి బయటకు రావడం, ముజబూర్‌ రహ్మాన్‌ విగ్రహాలను మాత్రమే కాదు, ఆయన ఆధ్వర్యంలో సాగిన విముక్తి పోరాటాన్ని సైతం చరిత్ర నుంచి చెరిపేయడం, అప్పట్లో ఊచకోత కోసిన పాకిస్తాన్‌ను ఘనంగా కీర్తిస్తూ. ఊరేగించడం చూస్తూనే ఉన్నాం.
పాక్ ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించింది. భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌ను, బంగ్లాదేశ్‌ను ఎగదోయడం వెనక అమెరికానే ఉన్నదన్నది సుస్పష్టం. ఇప్పటికే హసీనాను అప్పగించాలని యూనిస్‌ ప్రభుత్వం పలు మార్లు కోరుతూ వచ్చింది. ఇప్పుడు ఉరిశిక్ష విధించారు. కనుక భారత్‌ మీద ఒత్తిడి పెంచేందుకు మరో ఆయుధం అందివచ్చింది. ఇదంతా అమెరికా ఆడిస్తున్న నాటకమని తెలుసుకోవడానికి పెద్దగా తెలివి తేటలు అక్కర్లేదు.

Latest News

కరువు కోరలు!|Fangs of drought

ఇప్పటికి 33శాతమే వర్షం నమోదు!! రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రం అడుగంటుతున్న జలాశయాలు జీవ నదుల్లోనూ జల జీవమే లేదు రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి సాగుకు తొందరొద్దంటున్న నిపుణులు ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ 20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలేయొద్దు బోరుబావుల కింద వరి...

మొక్క నాటుండ్రి.. డిస్కౌంట్లు పొందుండ్రి!?|ADUGU TRENDS

పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ...

‘ఢీ’లిమిటేషన్ రాజకీయాలు!?|EDITORIAL

డీలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ సంస్కరణలలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య మార్చే ప్రక్రియ కాదు, భవిష్యత్ రాజకీయ ప్రాబల్య సమీకరణాలను నిర్ణయించే కీలక ఘట్టం....

జూలై 17, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం దక్షిణాయణం ప్రారంభం తిధి తదియ ఉదయం 09.54 వరకు ఉపరి చవితి నక్షత్రం మఖ రాత్రి 10.51 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది ఉదయం 05.00 వరకు ఉపరి వ్యతీపాత కరణం గరజి ఉదయం 09.54...

సింధు నాగరికత|ADUGU|SPECIAL|COMPITITIVE|EXAMS

నాగరికత మరియు సంస్కృతికి తేడా నాగరికత పూర్తిగా అభివృద్ధి చెందిన మరియు ఉన్నతమైన జీవనాన్ని గడిపినట్లయితే మరియు ప్రజలు పట్టణ, శాస్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ఉంటే దానిని నాగరికత అంటారు. సంస్కృతి సంస్కృతి అనేది ప్రతీ ఒక్కరికీ...

‘ప్రభంజన’ పథం ప్రజ్వరిల్లాలి|ESSAY|SPECIAL

జూలై 16, 2025. సరిగ్గా ఏడాది క్రితం జర్నలిస్టు, వక్త, కవి, రచయిత, మేధావి, అభ్యుదయవాది, వివేకశీలి, చైతన్యవంతుడు, నిరంతర పోరాట శీలి అయిన ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ పరమపదించారు....

రోడ్లకు కూడా ఆపరేషన్లు!?|ADUGU TRENDS

గిప్పటి దాకా మనం మనుసులకు, జంతువులకు ఆపరేషన్లు సేసుడే సూసినం. కనీ, గీ యింతను ఎక్కడా సూడలే.! గా బిహార్ రాస్ట్రంల కొత్తగ, ఎక్కడా లేని లెక్కల, రోడ్లకు కూడా ఆపరేషన్లు సేత్తాండ్రు....

నదుల అనుసంధానమే జల భద్రతకు శాశ్వత మార్గం!|EDITORIAL

ఎల్‌నినో ప్రభావాన్ని ఆపడం మన చేతుల్లో లేదు. కానీ, దాని వల్ల కలిగే నష్టాన్ని శాస్త్రీయ ప్రణాళికలు, సమర్థమైన జల నిర్వహణ, నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయం ద్వారా...

జూలై 16, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం పూరి జగన్నాధ రధోత్సవం తిధి శు విదియ ఉదయం 11.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.40 వరకు ఉపరి మఖ యోగం వజ్ర ఉదయం 08.20 వరకు ఉపరి సిద్ది కరణం కౌలవ...

ఆషాఢమాసం రహస్యాలు|ASHADAM|SECRETS

ఆచారాలు, శాస్త్రం, సంప్రదాయాల వెనుక నిజాలు ఆషాఢమాసం విశేషాలు – ఆధ్యాత్మికత, ప్రకృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాల వెనుక అసలు కథ ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం... ప్రతి సంప్రదాయం వెనుక ఒక జీవన...

ఉడుతా మిడతా!?|ADUGU TRENDS

మనం మన సుట్టుముట్టు ఉడుతల్ని సూత్తనే ఉంటం. పొలాలల్ల, రోడ్ల మీద అటిటుపోతనే ఉంటయి. సిడెం సేపట్లనే కనబడ్తయి, ఆడ్తయి. ఉరుకుతయి. ఎన్కట గా రాముడికి వారధి కట్టుట్ల గీ ఉడుత సాయం...

ఓటర్ల సవరణకు శాశ్వత పరిష్కారం లేదా!?|EDITORIAL

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, పట్టణాల్లో వార్డు కార్యాలయాలు, మీ సేవ వంటి పౌర సేవా కేంద్రాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తే ప్రజలకు సౌలభ్యం పెరుగుతుంది. బీఎల్‌వోలపై పూర్తిగా ఆధారపడకుండా బహుళస్థాయి ధ్రువీకరణ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News