BC Reservations|బీసీ రిజర్వేషన్లపై Supreme Court|సుప్రీంకోర్టులో Case|కేసు కొట్టివేత
బీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద ఊరట లభించింది. బీసీ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ Vanga Gopal Reddy|వంగ గోపాల్‌రెడ్డి దాఖలు చేసిన Pitition|పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టులో ఇప్పటికే ఈ అంశంపై పిటిషన్లు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో, సుప్రీంకోర్టు ఈ కేసును విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేసింది. జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని ధర్మాసనం, హైకోర్టులో విచారణ కొనసాగుతున్నప్పుడు సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారు? అంటూ పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది.
రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు సిద్దార్థ దవే, అభిషేక్ సింఘ్వీ, ఎడీఎన్ రావు హాజరై వాదనలు వినిపించారు. వారు హైకోర్టులో ఇప్పటికే రెండు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిపై విచారణ కొనసాగుతుందని తెలిపారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు, ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్‌ను ఎందుకు దాఖలు చేశారని పిటిషనర్ న్యాయవాదిని ప్రశ్నించింది. హైకోర్టు స్టే ఇవ్వలేదని అందుకే సుప్రీంకోర్టుకు వచ్చామని పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పగా, ధర్మాసనం స్టే ఇవ్వకపోతే సుప్రీంకోర్టుకు వచ్చేస్తారా? అంటూ ప్రశ్నించింది. ఆపై పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ, విచారణ ముగిసిందని ప్రకటించింది.
ఈ తీర్పుతో తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద ఉపశమనం లభించింది. బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి రాష్ట్రం జారీ చేసిన జీవో నెంబర్ 9పై సుప్రీంకోర్టు ఎటువంటి జోక్యం చేసుకోకపోవడంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు రాష్ట్రం చేపట్టగా, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొందరు పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, హైకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉండగా సుప్రీంకోర్టుకు రావడం సముచితం కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఈ విచారణకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి స్వయంగా హాజరయ్యారు. బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వ వాదనలను గట్టిగా లాయర్లు వినిపించారు. ఈ తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వానికి చట్టపరమైన స్థిరత్వం లభించిందని న్యాయ వర్గాలు పేర్కొన్నాయి. హైకోర్టు విచారణ కొనసాగుతుండగా, సుప్రీంకోర్టు జోక్యం అవసరం లేదని స్పష్టం చేయడం బీసీ రిజర్వేషన్ల అమలుకు సానుకూల సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు.
సుప్రీంకోర్టు తీర్పుతో బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం బలపడింది. ఈ కేసు ముగిసిన వెంటనే తెలంగాణ రాజకీయ వర్గాల్లో హర్షం వ్యక్తమైంది. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను చట్టబద్ధంగా అమలు చేస్తున్నదనే నమ్మకానికి ఈ తీర్పు బలం చేకూర్చిందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.

