Tuesday, September 15, 2026
32.2 C
Hyderabad

ఐక్యత కోసమే నా ప్రయత్నం|Raja Singh

కిషన్ రెడ్డి |kishan Reddy వ్యాఖ్యలపై రాజాసింగ్ |Raja Singh

Goshamahal| గోషామహల్ MLA| ఎమ్మెల్యే రాజాసింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రెస్ నోట్ విడుదల చేశారు. “రాజాసింగ్ సీనియర్ నాయకుడు, నేను కేవలం సామాన్య కార్యకర్త” అని కిషన్ రెడ్డి అన్న వ్యాఖ్యలతో పాటు, “రాజాసింగ్ చెప్పినదాన్ని మేము పాటిస్తాము” అనే వ్యాఖ్యల నేపథ్యంలో రాజాసింగ్ పార్టీలో తన స్థానమేమిటో స్పష్టంగా వివరించారు. పార్టీ పట్ల తనకు ఉన్న ప్రేమను, అనుభవాలను వివరించడంతో పాటు, ప్రస్తుత పరిణామాలు పార్టీ ఐక్యతకు హానికరం అవుతాయని హెచ్చరించారు.

రాజాసింగ్ తన ప్రకటనలో, తన ఉద్దేశం ఎప్పుడూ పార్టీ బలోపేతమేనని, వ్యక్తిగత పదవులు, తన లబ్ది కోసమేమీ కృషి చేయలేదని చెప్పారు. పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నదే తన ధ్యేయమని, పార్టీ సేవ చేయడమే తన ధ్యేయంగా ఉందన్నారు. కానీ, తెలంగాణలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో పార్టీ విజయం సాధించాలన్న లక్ష్యాన్ని మరిచి, ఒక్కరినే లక్ష్యంగా చేసుకుని అడ్డంకులు సృష్టించడం తీవ్ర అసంతృప్తికి కారణమవుతోందన్నారు. అయినప్పటికీ, తాను ఎప్పటికీ పార్టీకి అంకితంగా పని చేస్తూనే ఉన్నానని స్పష్టం చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఒక ముఖ్యమైన ప్రశ్నను రాజాసింగ్ అడుగుతూ, “ఇది పార్టీకి ఏమైనా ఉపయోగపడుతుందా?” పార్టీ కార్యకర్తను ఇబ్బంది పెట్టడం ద్వారా ఏమాత్రం లాభం లేదని, ఇది పార్టీ పటిమకు హాని కలిగించే అంశమని అన్నారు. తన వ్యక్తిగత గౌరవం కన్నా, పార్టీ ఐక్యతను కాపాడడమే తన మొదటి ప్రాధాన్యతగా పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డిని ఉద్దేశించి రాజాసింగ్ ఓ విన్నపం చేశారు. “మాకు కొంత సమయం కేటాయించండి. నేను, ఇతర కార్యకర్తలు వ్యక్తిగతంగా మీకు కలుసుకుని సమస్యలు వివరించదలిచాము. ఇది విభేదాల కోసం కాదు, ఐక్యత కోసం” అని రాజాసింగ్ స్పష్టం చేశారు. ఎక్కడైనా, ఎప్పుడైనా మీ నిర్ణయం మేరకు మేము కలుసుకోడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.

తమ లక్ష్యం తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమేనని, ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారని, అందుకే వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.తమ ప్రయాణం పైన పార్టీ నాయకత్వం పునరాలోచించాలని సూచించిన రాజాసింగ్, చివరగా “జై హింద్, జై బీజేపీ” అంటూ తన ప్రకటనను ముగించారు.

Latest News

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

సెప్టెంబర్ 12, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.35 వరకు ఉపరి విదియ నక్షత్రం ఉత్తర పగలు 01.54 వరకు ఉపరి హస్త యోగం శుభ సాయంత్రం 05.12 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 07.35...

కోవా యినాయకుడు! లడ్డూ మండపం!?|ADUGU TRENDS

ఇగ యినాయక చవితి రానే వచ్చే! ఇగిప్పుడు యినాయకుల సీజన్ ఒచ్చింది. రకరకాల ఆకారాలల్ల యిగ్రహాలను తయారు శేసుడు. గవాటిని ఈధుల్ల పెట్టుడు. నవరాత్రులు పూజలు శేసుడు మామూలేనాయె. అయితే, గా యినాయకులను...

భారత అంతరిక్ష ఇరుసు ఇస్రో ప్రైవేటుపరమేనా!?|EDITORIAL

ఇస్రోను “ప్రైవేటు కంపెనీలతో పోటీ పడే సంస్థ”గా కాకుండా, దేశ అంతరిక్ష వ్యవస్థకు మూల స్తంభంగా చూడాలి. పరిశోధన, వ్యూహాత్మక మిషన్లు, కీలక సాంకేతికతలు, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన కార్యకలాపాలు ఇస్రో ఆధ్వర్యంలోనే...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News