పంటలకు పట్టే పురుగులు రైతులకు శాపంగ మారుతానయి. ఇగ గవాటిని సంపడానికి పురుగుల మందులు కొట్టాలె. కర్సు బాగైతది. మల్ల గా మందులతోటి పురుగులు సత్తలేవు. పంటల దిగుబడొత్తలేదు. ఎరువులు, పురుగుల మందులెక్కువై గత్తర గత్తరైతాంది. భూసారం తగ్గి గా నేల గూడ ఆగమాగమైతాంది. మరి గా పురుగుల నివారణకు ఓ శిటికె కటిపెట్టిండో రైతు. గదేందో సూద్దామా?

గింత బెల్లం తీసుకోవాలె. గా బెల్లాన్ని బకెట్ల నీల్లు పోసి, గండ్లనే గా బెల్లాన్నేసి కరిగేదాకా కలపాలె. ఇగ గండ్ల గొనె సంచులను ముక్కలు ముక్కలుగ కోసి, గా బెల్లపు నీల్లల్ల ముంచాలె. గయి బాగా తడిసినంక తీసీ, గా పురుగులు పట్టిన శెలకల్లో పంటల మద్దెల గక్కడొక్కటి గక్కడొక్కటి ఏయాలె. తెల్లారినంక సూత్తే, గా పంటలకు పట్టిన పురుగులు గీ బెల్లం పానకంల ముంచిన గొనె సంచి శింపులకు పడతయి. గవాటని ఏరి పారేయాలె. ఎట్లుంది గీ శిట్క.. గిదీన్ని మన రైతులకు జెర శెప్పుండ్రి.

