అన్ని పనులకు బలం పని శేయది. బుద్ధిబలమే బాగా పని శేత్తది. ఎంతటి కట్టమైన పనినైనా ఉపాయంతోటి ఉట్టిగనే తుపుక్కున ఊసేసినంత అల్కగ శేసేయొచ్చు. గట్లాంటిదే గీ ఉపాయం. బాగా బరువున్న సామాన్లను పైకి కిందికి మోయాల్నంటే శానా కట్టం. గివీటికి ఓ అన్న మంచి ఉపాయం శేసిండు. గదేందో మీరే సూడుండ్రి.

ఎన్కటికి ఇంటి మీద ఇంకో ఇల్లు కడితే మా ఎక్కువ. ఇగిప్పుడైతే అంతస్తులు పెరగబట్టే. గట్లనే మనుసుల మద్దెల అంతరాలు పెరిగిపాయె. ఎవ్వలికి ఎవ్వలు సాయానికి కూడా వత్తలేరు. కూలీ పనులు ఎవ్వలూ సక్కగ శేత్తలేరు. గందుకే సామాన్లను పైకి, కిందికి మోయాడానికి గదేనుల్లా ఎత్తడానికి, దించడానికి గివీటిని కనిపెట్టిండ్లు. గవే లోడ్ కన్వేయర్లు! లిఫ్టుల లెక్క అన్నట్లు? కనీ గియి సామాన్లనే మోత్తయి. మనుసులను కాదు. ఇగ గివీటితోటి బరువైన సామాన్లను ఎత్తి దించే పని అల్కగైంది.

