Thursday, September 17, 2026
25.5 C
Hyderabad

అక్కా! ఇదేం తిక్క?|SENSATIONAL|KONDA SUREKHA|

అక్క.. ఒక్కసారి కమిట్ అయితే…
సు‘రేఖ’ మారేనా!?
ఇట్లయితే కష్టమే అక్కా!
లౌక్యం లేకపోతే లోకంతో ఏగేదెట్లా?
ఒక వివాదంలోంచి… మరో వివాదంలోకి
అందరితోనూ వివాదాలే!
సొంత పార్టీ వాళ్ళతోనూ విభేదాలే!
‘ట్రబుల్ క్రియేటర్’ అయితే ఎట్లా?
చెప్పేవి నీతులు..మాట్లాడేది బూతులా?
అడుసు తొక్కనేల? కాలు కడుగనేల?
నోరు మంచిదైతే.. ఊరంతా మంచిదే!
‘తూర్పు’లోనూ ‘మార్పు’ లేదాయె?
రాజకీయ జీవితమంతా రాజీలేని పోరాటమైపాయె!

తెలంగాణ రాజకీయాల్లో ఆమె ఓ ఫైర్ బ్రాండ్! మైండ్ సెట్ అయితే చాలు బ్లైండ్ గా వెళ్ళిపోవడమే. కమిట్ మెంట్ కు ఆమె మారు పేరు. ఒక్కసారి కమిటైతే తన మాటే తానే వినదు. ఆమె మాటలు లోడెడ్ గన్ లోంచి పేలే తూటాల్లా ఉంటాయి. మాటలే నిప్పులు కక్కుతాయి. మంటలు రేపుతాయి. ఆమె మాటే శాసనం. కానీ ఇప్పుడు ఆమె మాటే వినాశనానికి దగ్గరగా తీసుకెళుతోంది. తూటాల్లా పేలి, మంటలు రేపే ఆమె మాటలే ఇప్పుడు, ఆమెనే దహించివేసేలా ఉన్నాయి. ‘ఫైర్ బ్రాండ్’ ‘ఫెయిల్ బ్రాండ్’ అయ్యే ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఈ మధ్య వరసగా ఆమె వ్యాఖ్యానాలు పాపం! ఆమె మంచి వ్యక్తిత్వానికి మాయని మచ్చలా మారుతున్నాయి. ఆమె ఎవరో కాదు రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖల మంత్రి కొండా సురేఖ. అయితే ఇది సగటు తెలంగాణ బిడ్డ ఆవేదన.

|SENSATIONAL|KONDA SUREKHA|CONGRESS|MINISTER|TELANGANA|SHOCKING|FIRE BRAND|

అక్కా! ఈసారి ఏ ముహూర్తంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారో కానీ,ఏది మాట్లాడినా వివాదమే అవుతోంది. తెలిసి మాట్లాడుతారో, తెలియక మాట్లాడుతారో లేక భోళాతనమో, లౌక్యం లేకపోవడమో, తొందరపాటో, పొరపాటో, గ్రహపాటో, దూకుడో, దుందుడుకో, గుండె ధైర్యమో, మొండి దౌర్జన్యమో కానీ, మీ మాటలు నిజంగానే మంటలు రేపుతున్నాయి. అక్కా! ఈ తిక్క మాటలే మంత్రిని చేసిన సీఎం రేవంత్ అన్నకు, పార్టీకి, ప్రభుత్వానికి, మంత్రులకి ఇరకాటం కలిగిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు లంచాలు తీసుకుంటున్నారని, మీరు మాత్రం లంచం తీసుకోనని ఒక ప్రభుత్వ పాఠశాల ఓపెన్ మీటింగులో చెప్పడం ఇప్పుడు వివాదమైంది. దాన్ని కప్పిపుచ్చుకుంటూ, గత టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన గురించి మాట్లాడానన్నారు. అక్కా మీరు టీఆర్ఎస్ పాలనలో ఎన్నడూ మంత్రిగా లేరు. అంటే మీరు చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి మంత్రివర్గం గురించే అని తేటతెల్లమైంది. మీరు ఈ లాజిక్కుని ఎలా మిస్సయ్యారక్కా? |SENSATIONAL|KONDA SUREKHA|CONGRESS|MINISTER|TELANGANA|SHOCKING|FIRE BRAND|

అక్కా… నిజానికి మీది మంచి వ్యక్తిత్వం. సాయం చేయాలనే మనస్తత్వం. మొండి గుండె ధైర్యం. మీ మాటలన్నీ వాస్తవాలే కావచ్చు. ప్రభుత్వంలో ఉండి, అలా మాట్లాడ కూడదని మీకు తెలియదా? అసలు ఈ కాలంలో నిస్వార్ధంగా ప్రజా సేవ చేసే నేతలు ఎక్కడున్నారు? అందుకే మిమ్మల్ని నేతలెవ్వరూ ఖండిచడానికి సాహసించలేదు. ప్రజలు డబ్బులు తీసుకుని ఓట్లేస్తున్నారు. ఆ డబ్బులు సంపాదించే పనిలో నేతలున్నారు. ఎవరు ఎవరిని తప్పు పట్టాలి? |SENSATIONAL|KONDA SUREKHA|CONGRESS|MINISTER|TELANGANA|SHOCKING|FIRE BRAND|

అక్కా…మీరు ఒక వివాదం నుంచి తప్పించుకోవడానికి మరో వివాదంలోకి కూరుకుపోతున్నారు. వాదవివాదాలకు తావిస్తున్నారు. శత్రువులతో సరే, సొంతపార్టీ నేతలతోనూ వింత పోకడలే అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అక్కా మీకు అనుకూలంగా ఉన్నప్పుడు పొగిడి… అననుకూలంగా ఉన్నప్పుడు తెగడటం మీకు అలవాటైపోయింది. |SENSATIONAL|KONDA SUREKHA|CONGRESS|MINISTER|TELANGANA|SHOCKING|FIRE BRAND|

కొండా సురేఖ తాజా వివాదాస్పద వ్యాఖ్యలు

‘మరి నేను అటవీశాఖ మంత్రిగా ఉన్నాను. కాబట్టి నా దగ్గరకు కొన్ని కంపెనీల ఫైళ్ళు క్లియరెన్స్ కోసం వస్తాయి. మమూలుగా అలాంటి ఫైళ్ళు వచ్చినప్పుడు మంత్రులు డబ్బులు తీసుకుని క్లియర్ చేస్తారు. అప్పుడు వాళ్ళతో నేను అన్నా… మాకు ఒక్క నయాపైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు సమాజ సేవ చేయండి. మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి. మీ పేరు గుర్తుండి పోతుందని చెప్పా. అప్పుడు మా చేతుల్లో లేదు. పై వాళ్ళతో మాట్లాడతామని అరబిందో ఫార్మాకుచెందిన సదానందరెడ్డి చెప్పారు. చివరకు సిఎస్ఆర్ నిధులు రూ.4.5 కోట్లతో కాలేజీ భవనం కడతామని చెప్పినప్పుడు నాకు సంతోషం కలిగింది.’ |SENSATIONAL|KONDA SUREKHA|CONGRESS|MINISTER|TELANGANA|SHOCKING|FIRE BRAND|

వివాదంలోంచి మరో వివాదంలోకి లాగిన వ్యాఖ్యలు

‘నిన్న వరంగల్‌లో నేను చేసిన వ్యాఖ్యలపై కొంతమంది పనిగట్టుకుని తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారు. నేను గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, అప్పటి మంత్రులు ఏ పని చేయాలన్నా పైసలు తీసుకునేవారని మాత్రమే అన్నాను. ఇది అక్షర సత్యం. నా ఆ వ్యాఖ్యలకు నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను.’ అన్నారు. సరే, మొదటగా మీరన్న మాటలను బట్టి… చూస్తే అక్కా! బీఆరఎస్ సర్కార్ లో మీరెప్పుడైన మంత్రిగా ఉన్నారా? లేనే లేరు. అటువంటప్పుడు ఆ మంత్రివర్గంలో ఉన్న మంత్రుల సంగతి ఇప్పుడు మీకేందుకు? వాళ్ళు మంత్రిగా ఉంటే ఫైళ్ళతోని ఎవరైనా మీదగ్గరకు వచ్చారా? పోనీ, మీరు చెప్పినట్లు.. వాళ్ళ గురించే విమర్శించారని అనుకుందాం. మీరు మాట్లాడిన సమయానికి సందర్భం కుదురుతుందా చెప్పండి. పైగా మీరు ‘నేను అటవీశాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి… అంటూ నా దగ్గరకి కొన్ని ఫైళ్ళు క్లియరెన్స్ కోసం వస్తుంటాయి… అంటూ… కొనసాగించారు. ఇంతకుముందెప్పుడూ మీరు అటవీశాఖ మంత్రిగా లేరుగా అక్కా! మాబోటి జర్నలిస్టుల సంగతి పక్కన పెట్టు అక్కా… ఈ రోజుల్లో మామూలు జనం కూడా బాగా తెలవి మీరిపోయారు. మాకంటే వాళ్ళకే విషయాలు ఎక్కువగా అర్థం అవుతున్నాయి. ఈ మాత్రం మీకు తెలియదని కాదక్కా… గ్రహపాటో, పొరపాటో కానీ, మీరు నోరు జారారు. బుకాయించ చూశారు. ఒక వివాదం నుంచి బయట పడటానికి మరో వివాదంలో చిక్కుకున్నారు. అక్కా… అడుసు తొక్కనేల కాలు కడుగనేల? |SENSATIONAL|KONDA SUREKHA|CONGRESS|MINISTER|TELANGANA|SHOCKING|FIRE BRAND|

అచ్చీరాని ఇంగ్లష్..అగచాట్లు!

నిన్న వరంగల్ లో ప్రపంచ సుందరీమణుల ముందు వచ్చీ రాని ఇంగ్లీష్ లో మాట్లాడి నవ్వుల పాలయ్యారు. ఆ వేదికపై తెలుగులో మాట్లాడి అనువాదకులను పెట్టుకున్నా హుందాగా ఉండేది. మిమ్మల్ని చూసి, ఆ అందెగత్తెలు నవ్వుకున్నారు. మీకేమో కానీ, మాకైతే ఒల్లు మండింది తెలుసా? మీరే పెద్ద ‘లేడీ బాషా!’ భాష రాకపోవడం తప్పు కాదక్కా! సందర్భోచితం చూసుకోవాలిగా… అయినా, మీ కొచ్చిన తెలుగు భాషలో మీకంటే ఎవరు బాగా మాట్లాడగలరు చెప్పండి. తడబాటు తప్పలేదంతే ! |SENSATIONAL|KONDA SUREKHA|CONGRESS|MINISTER|TELANGANA|SHOCKING|FIRE BRAND|

అక్కా.. ! ఇదేం అడుక్కోవడం?

మొన్న ఒక ప్రెస్ మీట్ తర్వాత, అక్కడ మైకులు ఆన్ లో ఉన్నాయని కూడా చూసుకోకుండా మీరు, ‘మా సిస్టర్ కొడుకు బి.టెక్ చదివి వున్నాడు, ఉద్యోగం చూడండి’ అని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబును అడిగి వైరల్ అయ్యారు. సాటి, మీ తోటి మంత్రిని అడుక్కునే తీరు అదా అక్కా? ఆ మాత్రం సమయం మీకు దొరకలేదా? శ్రీధర్ బాబు ఇవ్వలేదా? ఇలాంటి విషయాలు పూర్తిగా ప్రైవేటుగా మాట్లాడాలని మీకు తెలియదా అక్కా? మీ బోళాతనం సల్ల గుండ! అయినా ఆ శాఖ కాకపోవచ్చు కానీ, ఆయనతో సమానంగా మీరే మంత్రి. మీరు చెబితే మాత్రం ఉద్యోగం ఇవ్వరా ఏంటి? |SENSATIONAL|KONDA SUREKHA|CONGRESS|MINISTER|TELANGANA|SHOCKING|FIRE BRAND|

సాటి మహిళపై సూటి మాటలు!

గతంలో కూడా హీరోయిన్ సమంత విషయంలో నోరు జారి అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం కేసులో మంత్రి స్థాయిలో కోర్టు మెట్లు ఎక్కారు. ఎంత వివాదం అయిందో… అప్పట్లో సీఎం ఎంత ఇబ్బందీ పడ్డారో మీకు తెలియదా అక్కా? |SENSATIONAL|KONDA SUREKHA|CONGRESS|MINISTER|TELANGANA|SHOCKING|FIRE BRAND|

‘తూర్పు’లోనూ ‘మార్పు’ లేదాయె!

అంతెందుకు? మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గం సంగతే తీసుకుందాం. అజంజాహీ మిల్లు కార్మిక భవన స్థలం వివాదం విషయంలో మీకు అంత పట్టుదల ఎందుకక్కా? అది కార్మిక భవన స్థలమని ప్రపంచానికంతా తెలుసు. మీకూ తెలుసు. ఏదో కక్కుర్తో, కనికరమో కానీ, ఆ స్థలంలో ఓ బడా వ్యాపారి బహుళ అంతస్తుల భవనానికి మాట ఇస్తే ఇచ్చి ఉంటారు. ఆ మాత్రానికే ఓ కొబ్బరికాయ కొట్టి తెగ వివాదాలపాలయ్యారు. జరిగిదేదో జరిగింది. అక్కడ కార్మిక భవనానికి శంకుస్థాపన చేద్దామని మీ భర్త కొండా మురళి అన్న చెప్పినా మీరు వినట్లేదు. నిజమేనా అక్కా? ఇంత తెలిసిన మీరు చరిత్రను ఎలా వక్రీకరించగలరు? ఆనవాళ్ళని ఎలా తుడిచివేయగలరు? ఒక్కసారి ఆలోచించండి అక్కా! మిమ్మల్ని నమ్ముకున్న ఓ రౌడీ షీటర్ ని రాజకీయ నాయకుడిని చేసి, సెటిల్ మెంట్లు చేస్తున్నారన్న అపవాదును మూటగట్టుకున్నారు. మీ విజయానికి కీలకంగా పని చేసిన నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టించి, బొక్కలో వేయించి, తొక్కించి, శత్రువులను చేసుకున్నారు. వాళ్ళంతా మిమ్మల్ని ఓడించే అవకాశం కోసం కాచుకు చూస్తున్నారు. నల్లేరు మీద నడకలా సాగాల్సిన మీ రాజకీయ ప్రస్థానాన్ని నరకం చేసుకుంటున్నది ఎవరక్కా? ఇదంతా మీరెక్కిన చెట్టు కొమ్మను మీరే నరుక్కున్నట్లు కాదా అక్కా! |SENSATIONAL|KONDA SUREKHA|CONGRESS|MINISTER|TELANGANA|SHOCKING|FIRE BRAND|

మీది 30 ఏళ్ళ రాజకీయ ప్రస్థానం

అక్కా… గీసుగొండ ఎంపీపీగా మొదలయ్యారు. రెండుసార్లు శాయంపేట నుంచి, ఒకసారి పరకాల నుంచి, ఇంకో రెండు సార్లు వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. |SENSATIONAL|KONDA SUREKHA|CONGRESS|MINISTER|TELANGANA|SHOCKING|FIRE BRAND|

ఒక్కసారి కమిట్ అయితే…

మీరు… వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు. వై.ఎస్. మరణానంతరం జగన్ ను సీఎం ను చేయలేదన్న కోపంతో ఏకంగా మీ మంత్రి పదవికే రాజీనామా చేశారు. అదీ మీ కమిట్ మెంట్. ఆ తర్వాత తెలంగాణలో అంతగా ప్రాబల్యం లేదని తెలిసీ, వైఎస్అర్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అదే సమయంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతుంటే, మహబూబాబాద్ ఘటనలో ఊరంతా ఒకదారి అయితే, ఉలిపి కట్టెదో దారి అన్నట్లుగా… ఏటికి ఎదురీదే మీ మనస్తత్వానికి నిదర్శనంగా… మహబూబాబాద్ రైల్వే స్టేషన్ ఘటనలో మొత్తం తెలంగాణ ఉద్యమకారులనే ఎదురొడ్డారు. అంతటి తెలంగాణ ఉద్యమాన్నే ఢీ కొట్టారు. ఒకసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటిది మీ వ్యక్తిత్వం. |SENSATIONAL|KONDA SUREKHA|CONGRESS|MINISTER|TELANGANA|SHOCKING|FIRE BRAND|

గు‘లాబీ’ గూటిలో..

తరువాత గులాబీ కండువా కప్పుకుని వరంగల్ తూర్పు నుంచి గెలిచారు. అప్పుడు ‘నాకు రాజకీయ పునరుజ్జీవం కల్పించార’ని అప్పటి సీఎం కేసీఆర్ ను తెగ పొగిడారు. అదే సమయంలో మీ డేరింగ్ డాషింగ్ ను చూసి, ఒక్క మహిళకు కూడా మంత్రి వర్గంలో చోటు లేకుండా పోయిందన్న విమర్శల నుంచి బయట పడటానికి, మీకు మంత్రి పదవిని ఇద్దామని కేసీఆర్ తలపోశారు. కానీ, అప్పుడు మీమ్మల్ని మంత్రిని చేస్తే, మేమంతా మటాష్ అవుతామని చెప్పి, అప్పటికే టీఆర్ఎస్ లో చేరిన మీ మిత్రులు, శత్రువులు అంతా మీకు వ్యతిరేకంగా కలిసిపోయి, మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నది మీకు తెలియంది కాదు. అక్కడా మీకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నది కూడా మీ ఈ వ్యక్తిత్వమే కదా? అక్కా! |SENSATIONAL|KONDA SUREKHA|CONGRESS|MINISTER|TELANGANA|SHOCKING|FIRE BRAND|

ట్రబుల్ క్రియేటర్.. !?

అక్కడ నుంచి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో అనేక మంది రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నప్పటికీ, మీరు మాత్రం ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారు. రేవంత్ ని సీఎంగా చూడాలని బహిరంగంగా ప్రకటించి సంచలనం అయ్యారు. అదే కమిట్ మెంట్ మరోసారి మిమ్నల్ని మంత్రిని చేసింది.
మీ కమిట్ మెంట్ ను చూసి మంత్రిని చేసిన రేవంత్ రెడ్డికి మీరు అండగా ఉండాలి. ఆయన ‘ట్రబుల్స్’ లో ఉంటే ఆ ‘ట్రబుల్ షూటర్’ గా పని చేయాలి. కానీ, మీరు మాత్రం ‘ట్రబుల్ క్రియేటర్’ గా మారారు. మీరే ఆయనకు ట్రబుల్స్ క్రియేట్ చేస్తున్నారు. అన్నం పెట్టినోళ్ళకి సున్నం పెట్టినట్లు అవట్లేదా? ఇదేం పద్ధతి అక్కా? |SENSATIONAL|KONDA SUREKHA|CONGRESS|MINISTER|TELANGANA|SHOCKING|FIRE BRAND|

‘కొండం’త అండ!

అక్కా…! మీకు మీ భర్త కొండా మురళి కొండంత అండ. మీ రాజకీయ జీవితానికి ఆయనే పునాది. ఆయనకు దక్కాల్సిన పదవులన్నింటినీ మీకే అందించారు. ఆయన తన రాజకీయ జీవితాన్ని మీకు త్యాగం చేశారు. ఆయన ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. మరి మీరేం చేస్తున్నారు? ఒక్కసారి ఆలోచించక్కా?|SENSATIONAL|KONDA SUREKHA|CONGRESS|MINISTER|TELANGANA|SHOCKING|FIRE BRAND|

Latest News

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News