Saturday, June 13, 2026
32.8 C
Hyderabad

భారత్–ఈయూ ఒప్పందం-బహుళప్రయోజనాలు!|EDITORIAL

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ విధానాలతో ప్రపంచ వాణిజ్యం గందరగోళంలో పడింది. తక్షణ, దుందుడుకు ఆర్థిక విధానాలు, వీసాల కట్టడులు, వాణిజ్య నియంత్రణలు గ్లోబల్ మార్కెట్లను అనిశ్చితిలోకి నెట్టాయి. ఒకవైపు అమెరికా టారిఫ్‌ల దూకుడు, మరోవైపు చైనా ఆధిపత్య కాంక్షల మధ్య ప్రపంచ దేశాలు కొత్త ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్–యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కీలక మలుపు.

2007లో యూపీఏ హయాంలో మొదలైన భారత్–ఈయూ వాణిజ్య ఒప్పందంపై చర్చలు, వివిధ కారణాలతో నిలిచిపోయాయి. తిరిగి 2022లో చర్చలు పునఃప్రారంభమై, ఇప్పుడు ఫలితానికి చేరాయి. గ్రీన్‌లాండ్ పై ట్రంప్ వ్యవహారశైలి, “అమెరికా లేకుంటే యూరప్‌కు విలువే లేదు” అన్న వ్యాఖ్యలు, టారిఫ్‌లతో బెదిరింపులు యూరోపియన్ యూనియన్‌ను భారత్ వైపు వేగంగా నడిపించాయి. మరోవైపు భారత్ కూడా ఆచితూచి, పరస్పర సహకార విదేశాంగ విధానంతో ప్రపంచ దేశాలతో సయోధ్యకు ప్రయత్నిస్తోంది.

కొన్ని రాజకీయ ఆరోపణలను పక్కనపెడితే, వాస్తవానికి ప్రస్తుత గ్లోబల్ పరిణామాల్లో అమెరికాను ప్రత్యక్షంగా ఎదిరించే పరిస్థితి భారత్‌కు లేదు. వాణిజ్యం, పెట్టుబడులు మాత్రమే కాదు. లక్షలాది భారతీయుల జీవనాధారం అమెరికాతో ముడిపడి ఉంది. అందుకే ప్రత్యామ్నాయ మార్కెట్ల వైపు అడుగులు వేయడం భారతావనికి తప్పనిసరి. ఆ దిశలో ఈయూ ఒప్పందం ఎడారిలో ఒయాసిస్‌లాంటిదని చెప్పాలి.

ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో యూరప్ దేశాలకు భారత్ ఎగుమతి చేసే అనేక ఉత్పత్తులపై సుంకాలు పూర్తిగా తొలగిపోనున్నాయి. దీనివల్ల భారత ఎగుమతిదారులకు దీర్ఘకాలిక లాభాలు చేకూరతాయి. అదే సమయంలో యూరప్ నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే కార్లు, వైన్స్, కీలక ఔషధాలు వంటి వాటి ధరలు తగ్గనున్నాయి. మొత్తం 13 అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకుని, వచ్చే ఐదేళ్లకు సంబంధించిన ఉమ్మడి వ్యూహాత్మక ఎజెండాను భారత్–ఈయూ ఆమోదించాయి.

ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లుగా, భారత్–ఈయూ ఉమ్మడి జీడీపీ ప్రపంచ జీడీపీలో దాదాపు 25 శాతం. ప్రపంచ వాణిజ్యంలో మూడో వంతుకు ఇది సమానం. యూరోపియన్ యూనియన్‌లోని 27 దేశాలు తమ దేశీయ చట్టాలను పూర్తి చేసిన తర్వాత ఈ ఒప్పందం పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. ఇందుకు ఆరు నెలల నుంచి ఏడాది వరకు సమయం పట్టే అవకాశముంది.

ఈ ఒప్పందంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం ఆటోమొబైల్ రంగం. ప్రస్తుతం యూరప్ నుంచి దిగుమతి అయ్యే కార్లపై భారత్ 125% వరకు సుంకాలు విధిస్తోంది. తాజా ఒప్పందం ప్రకారం ఇవి మొదట 40 శాతానికి, తర్వాత దశలవారీగా 10 శాతానికి తగ్గనున్నాయి. దీనివల్ల బీఎండబ్ల్యూ, ఆడి, మెర్సిడెజ్, లాంబోర్గిని, పోర్షే వంటి లగ్జరీ కార్ల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. అదే విధంగా భారత్ నుంచి యూరప్‌కు ఎగుమతి అయ్యే కార్లపై అక్కడి సుంకాలు కూడా తగ్గనుండటంతో భారత ఆటో రంగానికి కొత్త అవకాశాలు లభిస్తాయి.

ఫార్మా రంగంలోనూ ఈ ఒప్పందం కీలకం. క్యాన్సర్, బరువు తగ్గించే మందులు వంటి కీలక ఔషధాల ధరలు తగ్గనున్నాయి. వైద్య పరికరాలు, మందుల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలపై సుంకాలు తగ్గడం వల్ల భారత ఫార్మా కంపెనీలకు లాభం చేకూరుతుంది. విమానాలు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై కూడా సుంకాలు తగ్గడంతో వినియోగదారులకు ధరల ఉపశమనం లభిస్తుంది.
ఇక భారత్ నుంచి యూరప్‌కు వస్త్రాలు, తోలు ఉత్పత్తులు, ఆభరణాలు, ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల ఎగుమతులు పెరిగే అవకాశముంది. విద్య, పరిశోధన, ఉద్యోగ రంగాల్లో భారత యువతకు యూరప్‌లో కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి. గ్రీన్ హైడ్రోజన్, శాస్త్ర సాంకేతిక భాగస్వామ్యం, డిజిటల్ కనెక్టివిటీ వంటి రంగాల్లోనూ సహకారం బలపడనుంది.

మొత్తానికి, అమెరికా టారిఫ్‌ల బెడద నుంచి ఉపశమనానికి, చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు, భారత ఉత్పత్తులకు కొత్త మార్కెట్లను అందిపుచ్చుకునేందుకు భారత్–ఈయూ ఒప్పందం ఒక చారిత్రక ముందడుగు. ప్రపంచంతో పోటీ పడుతూ భారత్ తన ఆర్థిక శక్తిని మరింత బలపర్చుకునే దిశగా ఇది కీలక మైలురాయిగా నిలవనుంది.

Latest News

మియా జాకీ మాయ!|ADUGU TRENDS

పండంటే మామిడి పండే! పండ్లండ్ల మధురమైన పండ్లంటే కూడా మామిడి పండ్లే!! గందుకే గా పండ్లకు గంత గిరాకీ. గీ పండ్లల్ల మస్తు గిరాకీ ఉన్న పండ్లు మియా జాకీ రకమట. గీ...

బడే భవిష్యత్తుకు పునాది?!|EDITORIAL

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. ఒక మంచి పాఠశాల కేవలం విద్యార్థిని మాత్రమే కాదు, కుటుంబాలని, గ్రామాలని, సమాజాన్ని మార్చగలదు. అందుకే విద్యను వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. నీతి ఆయోగ్...

జూన్ 13, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి శని త్రయోదశి తిధి బ త్రయోదశి మధ్యాహ్నం 01.55 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం కృత్తిక రాత్రి 12.17 వరకు ఉపరి రోహిణి యోగం సుకర్మ సాయంత్రం 04.30 వరకు ఉపరి ధృతి కరణం వణజి...

నచ్చత్రాల ఇల్లు!|ADUGU TRENDS

ఆకాసంల నచ్ఛత్రాలన్నీ మన ఇంటిమీదకే వత్తే ఎట్లుంటది!? గట్లనే ఓ ఇల్లు కట్టుకుంటే ఇంకెట్లుంటది!? మబ్బుల్ల తేలాడినట్లే ఉంటది కదా? ఇది కలేం కాదుల్లా? దాన్ని నిజం చేసేటట్లు ఇప్పుడు ఇండ్లు కడతుండ్రు.!...

టీఎంసీ భవితవ్యమేంటి?!|EDITORIAL

టీఎంసీలో గందరగోళానికి బీజేపీ కారణమా? బెంగాల్ లో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం లభిస్తుందా? కాంగ్రెస్ లో టీఎంసీ విలీనంపై వస్తున్న ఊహాగానాలు నిజమేనా? రాజకీయాల్లో ఏ పార్టీకైనా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నంత కాలమే మనుగడ....

జూన్ 12, శుక్రవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి సాయంత్రం 04.06 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం భరణి రాత్రి 01.46 వరకు ఉపరి కృత్తిక యోగం అతిగండ రాత్రి 07.20 వరకు ఉపరి సుకర్మ కరణం తైతుల సాయంత్రం 04.06...

గీ కోతి మనుసులకే ఆదర్శం!|ADUGU TRENDS

నిజం కాకపోయినా, కోతి నుండే మనిసి వచ్చాడంటరు. కోతులకు మనుసులకు గంత పోలికన్నట్లు. గా కోతుల బుద్ధులు, శేట్టలు మనుసులకు కూడా ఉంటయి. కొందరిల బయట పడ్తయి. మరికొందరిల బయట పడయి గంతే....

నిరంతరాయ ప్రధానిగా మోదీ రికార్డు!|EDITORIAL

మోదీ, నెహ్రూ రికార్డును అధిగమించడం కేవలం ఒక గణాంక ఘట్టం మాత్రమే కాదు. ఇది భారత ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ద్వారా వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన నాయకుడి రాజకీయ ప్రయాణానికి...

జూన్ 11-గురువారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి సాయంత్రం 06.03 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అశ్విని రాత్రి తెల్ల 03.02 వరకు ఉపరి భరణి యోగం శోభ రాత్రి 10.00 వరకు ఉపరి అతిగండ కరణం బవ ఉదయం...

శెట్టు కిందే ఊరు!|ADUGU TRENDS

ఎండా కాలమొస్తే మనమేం శేత్తానం? ప్యాన్లు, ప్రిజ్జీలు, కూలర్లు, ఏసీలను సిద్ధం చేసుకుంటానం. మండే కాలం వత్తాందనంగనే గవాటన్నింటినీ మరమ్మతులు చేసి పెట్టుకుంటానం. ఎండ మండుతనే ఉండె, కరెంటు కాల్తనే ఉండె. ఇగ...

ట్రంప్ కు బోస్టన్ తీర్పు దెబ్బ!|EDITORIAL

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాలపై, హెచ్-1బీ వీసాలపై విధించిన లక్ష డాలర్ల ఫీజును బోస్టన్ ఫెడరల్ కోర్టు చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఆ తీర్పు భారతీయ వృత్తి నిపుణులకు తక్షణ ఊరటనిచ్చినా, అంతిమ...

జూన్ 10-బుధవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ దశమి రాత్రి 07.41 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రేవతి రాత్రి తెల్ల 04.00 వరకు ఉపరి అశ్విని యోగం సౌభాగ్య రాత్రి 12.20 వరకు ఉపరి శోభ కరణం వణజి ఉదయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News