గోషామహల్‌లో ప్రతిపాదిత స్థలంలో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. భూ బదలాయింపు ప్రక్రియను, ఇతర పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆసుపత్రి నమూనా మ్యాప్‌లను పరిశీలించిన సీఎం పలు మార్పులు, చేర్పులను సూచించారు. రోడ్లు, పార్కింగ్, మార్చురీ, ఇతర మౌలిక సదుపాయాలు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉండాలని సూచించారు. ఈ నెలాఖరులోగా ఆసుపత్రి నిర్మాణ శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

