Saturday, September 19, 2026
23.7 C
Hyderabad

ఇక పల్లెల ప్రగతి పరుగులు పెట్టాలి|EDITORIAL

పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఇక పల్లెలు ప్రగతి రథ చక్రాలపై పరుగులు పెట్టాలి. ఇకిప్పుడు గ్రామ రాజకీయాల దిశ మారాలి. ఎన్నికల సమయంలో సహజంగా ఏర్పడిన పోటీ, విమర్శలు, విభేదాలు, శత్రుభావాలు అక్కడితోనే ముగించాలి. ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్ లు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం ఇప్పుడు పార్టీలకతీతంగా గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి. ప్రభుత్వం, స్థానిక సంస్థలు, ప్రజాప్రతినిధులు సంయమనంతో, సమన్వయంతో సముచితంగా సాగినప్పుడే నిజమైన గ్రామ ప్రగతి సాధ్యమవుతుంది.

గ్రామ పంచాయతీలు ప్రజాస్వామ్యానికి పునాదులు. గ్రామ స్థాయిలో తీసుకునే నిర్ణయాలు ప్రజల దైనందిన జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. రెండేళ్ళుగా గ్రామ పరిపాలకులు లేక, అధికారుల పాలనలో కునారిల్లిన పంచాయతీల్లో పలు సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. పైగా బకాయిలు పేరుకుపోయాయి. మంచినీరు, పారిశుద్ధ్యం, మురికి కాలువలు, అంతర్గత రోడ్లు, వీధిలైట్లు, మరమ్మతులు, విద్య, ఆరోగ్యం వంటి ప్రాథమిక అవసరాలన్నీ పంచాయతీ స్థాయిలోనే పరిష్కరించాల్సి ఉంటుంది. వీటికి సరిపడా నిధుల అవసరం ఉంటుంది. ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చే నిధులతోపాటు, రాష్ట్ర ప్రభుత్వం అందించే నిధులు కీలకం. పంచాయతీలకు పన్నుల ద్వారా వచ్చే నిధులు వాటి నిర్వహణకే సరిపోవు. పైగా కరెంటు బిల్లులు, పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది కొరత, వారి జీతభత్యాలు, అద్దె భవనాల్లో కార్యాలయాలు, వాటి నిర్వహణ వంటి అనేక సమస్యలు తాండవిస్తున్నాయి. వీటన్నింటినీ పరిష్కరించే దిశగా పనులు జరగాలి. ఎన్నికల అనంతరం కూడా రాజకీయ విభేదాలు కొనసాగితే అభివృద్ధి పనులు నిలిచిపోతాయి. దీనివల్ల నష్టపోయేది రాజకీయ నాయకులు కాదు, సామాన్య ప్రజలే.

అయితే, గతంలోలా నిధులు వచ్చే అవకాశాలు తక్కువ. ఉపాధి హామీ నిధులు పంచాయతీలకు వరంగా ఉండేవి. కరువు పనిదినాలు, శ్రమకు తగ్గ మెటీరియల్ కాంపౌండ్, పనులు పూర్తి చేసిన కొద్దీ పెరిగే అపరిమిత నిధులను విపరీతంగా వినియోగించడం ద్వారా ప్రస్తుతం ప్రగతి జరిగింది. కానీ, కేంద్రం ఉపాధి హామీ పథకాన్ని పేరుతోపాటు, విధి విధానాలను మార్చేసింది. 60%-40% కేంద్ర-రాష్ట్రాల వాటాగా నిర్ణయించింది. ఇది ఆశనిపాతం కాగా, ప్రభుత్వం దగ్గర నిధుల కొరత వెక్కిరిస్తోంది. ప్రస్తుతం ఫైనాన్స్ కమిషన్ రెండేళ్ళుగా పంచాయతీలకు ఇవ్వాల్సిన 3వేల కోట్ల నిధులే పెద్ద దిక్కుగా కనిపిస్తున్నాయి. దీనికి రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్ మరో 3వేల కోట్లు కలిపితే, 6వేల కోట్లు అవుతాయి. ప్రభుత్వం విడుదల చేసే ఈ నిధులు సమర్థవంతంగా వినియోగించబడాలంటే గ్రామ స్థాయిలో ఐక్యత అవసరం. సర్పంచ్‌, వార్డు సభ్యులు, అధికారులు పరస్పరం సహకరించుకొని అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి. ఏ గ్రామానికి ఏ అవసరం ఎక్కువగా ఉందో గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టాలి. కేవలం రాజకీయ లాభనష్టాలను దృష్టిలో పెట్టుకొని కాకుండా, ప్రజల అవసరాలే కేంద్రంగా నిర్ణయాలు తీసుకోవాలి.
అలాగే ప్రజాప్రతినిధుల బాధ్యత కూడా ఎంతో కీలకం. తమ వాగ్దానాలను మరిచిపోకుండా అమలు చేయాలి. ఓడిన వర్గాలను కూడా కలుపుకొని గ్రామాభివృద్ధిలో భాగస్వాముల్ని చేయాలి. అప్పుడే గ్రామంలో సామరస్యం పెరుగుతుంది. ప్రజలు కూడా కేవలం విమర్శకులు, ప్రేక్షకులుగా కాకుండా, అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలి. గ్రామ సభలు, సమావేశాల ద్వారా తమ సమస్యలను స్పష్టంగా తెలియజేయాలి.

ఇక అధికార యంత్రాంగం రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా నిష్పక్షపాతంగా పనిచేయాలి. నిధుల కేటాయింపు, పనుల అమలులో పారదర్శకత ఉండాలి. అభివృద్ధి పనులపై సామాజిక పర్యవేక్షణ పెరిగితే అవినీతికి అవకాశం తగ్గుతుంది. ఇది గ్రామాభివృద్ధికి మరింత బలాన్నిస్తుంది.

ఎన్నికలు ప్రజాస్వామ్యంలో ఒక భాగం మాత్రమే. కానీ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఎన్నికల తర్వాత కూడా విభేదాలను కొనసాగిస్తే గ్రామాలు వెనుకబడిపోతాయి. పార్టీలకతీతంగా ఆలోచించి, నిధులు–విధులు–ప్రగతి ప్రణాళికలను సమర్థంగా అమలు చేస్తేనే పల్లెలు నిజంగా ప్రగతి పట్టాలెక్కుతాయి. గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, ప్రజలు కలిసి పనిచేసినప్పుడే బలమైన, స్వావలంబన గల గ్రామ సమాజం నిర్మించగలుగుతాం.

Latest News

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News