ACB|ఏసీబీ విచారణకు ముందు TELANGANA BHAVAN|తెలంగాణ భవన్ లో KTR|కేటీఆర్
తెలంగాణ భవన్‌లో ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు BRS| బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు (కేటీఆర్) కీలక వ్యాఖ్యలు చేశారు. తనను అరెస్ట్ చేసి జైలుకు పంపుతారని ముందే తెలుసని, కానీ జైలు తనకు కొత్త కాదని చెప్పారు. తెలంగాణ కోసం ఎన్నోసార్లు జైలు వెళ్లిన నేను, ఇప్పుడు కూడా ప్రజల కోసం పోరాటానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఫార్ములా ఈ-రేస్ అంశాన్ని నాలుగు గోడల మధ్య విచారించకూడదని, అసెంబ్లీ సాక్షిగా నాలుగు కోట్ల ప్రజల ముందు చర్చిద్దామని తానే సవాల్ చేశానని అన్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చకు దమ్ము లేక పారిపోయారని విమర్శించారు.
కేటీఆర్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి అందాల పోటీలు పెట్టి ప్రపంచం ముందు తెలంగాణను అపహాస్యం చేశాడు. బీఆర్ఎస్ పార్టీకి చట్టం మీద గౌరవం ఉంది. అందుకే 30 సార్లు పిలిచినా విచారణకు హాజరయ్యాను. కానీ నాపైన పెట్టిన కేసులు కేవలం పైచాచిక ఆనందం కోసం పెట్టినవే అని మండిపడ్డారు. ఫార్ములా ఈ-రేస్ అంశంలో తన అరెస్ట్ తప్పదని ముందే ఊహించానని అన్నారు. అయినా ప్రజల వైపు నిలబడి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హామీలు అమలు చేయేవరకు నిలదీస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.

అంతేకాక, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నారని, ఇది బీసీలను అవమానించడమేనని అన్నారు. బీసీలు అన్ని విషయాలను గమనిస్తున్నారని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పుకునేలా ఏ పని చేయలేదు. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమని బీజేపీలా మాట్లాడుతున్నారు అని ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డి ధైర్యం ఉంటే లై డిటెక్టర్ టెస్ట్‌కు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. 6 గ్యారెంటీలు, 420 హామీలు అమలు అయ్యే వరకు తమ పోరాటం ఆగదని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పారు. మేము ప్రజలపక్షాన నిలబడతాం. కాంగ్రెస్ పార్టీని అబద్ధపు హామీలకు బంధించి, వారి నిజ స్వరూపాన్ని బయటపెడతాం అని కేటీఆర్ గట్టి హామీ ఇచ్చారు. జై తెలంగాణ అంటూ నినాదాన్ని ఇచ్చి తన ప్రసంగాన్ని ముగించారు.

