ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా అటవీప్రాంతంలో మావోయిస్టులు మరోసారి అమానుష చర్యకు పాల్పడ్డారు. భద్రతా బలగాల వాహనాన్ని మందుపాతరతో పేల్చడంతో 10 మంది జవాన్లు అక్కడికక్కడే మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర ఘటనకు సంబంధించి మరిన్ని భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. మావోయిస్టుల కదలికలపై గట్టి నిఘా ఏర్పాటు చేసిన భద్రతా అధికారులు, పూర్తి వివరాలు సేకరించేందుకు చర్యలు చేపడుతున్నారు.

