పుట్టిన పతి ప్రాణీ గిట్టక మానది. గట్లనే ఒక్కో జీవికి ఒక్కో ఆయుర్ధాయం ఉంటది. జెల్లీ ఫిష్ కి ఏకంగా అమరత్వమే ఉందంట. గిది వయసైపోయినంక, మళ్ళీ శైశవ దశకు చేరుకుని జీవితాన్ని ఆరంబిస్తదట. ఇగ గీ భూమ్మీద జల చరాలు, అన్ని జీవులకంటే ఎక్కువ కాలం బతుకుతయట. జంతువుల్లోనైతే తాబేలే ఎక్కువ కాలం బత్కుతదట. 150 నుంచి 200 ఏండ్లు తాబేల్లు బత్కుతానయి. మన దేశంల అలీపూర్ జూ ల ఉన్న ‘అద్వైత’ అనే తాబేలు 255 ఏండ్లు బతికిందంట. ఇగిప్పుడైతే గీ జోనాథన్ తాబేలే భూమ్మీద ఎక్కువ కాలంగా బతికున్న దానికి గిన్నీస్ బుక్కులకెక్కందట. 194 ఏండ్ల వయసుతో గిదే పపంచంల ముసలి తాబేలట.

గీ జలచరాలు, జంతువుల సంగతి పక్కన పెడితే, గీ రోజులు మనుసులు బతికే రోజులోనా? సంపూర్ణాయిసు సాధ్యమేనా? పొరపాటున బతికినా, గీ పాపపు పపంచంల గన్నేండ్లు బతికి ఏం శేత్తం?

