Wednesday, September 23, 2026
26 C
Hyderabad

సంధ్య థియేటర్ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి

సంధ్య థియేటర్ ఘటనపై అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…..థియేటర్ లోపలికి వెళ్లేందుకు, బయటకు రావడానికి ఒకే మార్గం ఉండటంతో, సెలెబ్రిటీ వస్తే అనవసర గందరగోళం తలెత్తుతుందని పోలీసులు ముందుగానే అనుమతి నిరాకరించినట్లు సీఎం తెలిపారు.

అయితే, అనుమతి లేకున్నా పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ థియేటర్‌కు వెళ్లడం వల్లనే ఈ సంఘటన జరిగిందన్నారు. హీరో కేవలం థియేటర్‌లోకి వెళ్లి సినిమా చూస్తూ వెళ్తే ఎలాంటి సమస్య ఉండేది కాదని, కానీ రోడ్డుపై కారు రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో నిర్వహించడం వల్ల పరిస్థితి విషమించిందని సీఎం సభకు వివరించారు.

హీరో అల్లు అర్జున్ రోడ్ షో చేస్తూ థియేటర్‌కి వెళ్తుండగా, పక్కన ఉన్న అన్ని థియేటర్ల నుంచి ప్రేక్షకులు సంధ్య థియేటర్ వైపుకు తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ గందరగోళంలో రేవతి అనే మహిళ ప్రాణాలు కొల్పోయారన్నారు. ఆ సమయంలో కూడా ఆమె తన కొడుకును గట్టిగా పట్టుకుని ఉండటం తల్లి ప్రేమను ఎలాంటిదో తెలుస్తుందని సీఎం అన్నారు. కానీ ఈ ఘటనలో ఆమె కొడుకు శ్రీ తేజ్ గాయపడి కోమాలోకి వెళ్లాడు.

ఈ పరిస్థితుల్లో కూడా హీరో అల్లు అర్జున్ బాధ్యతగా వ్యవహరించలేదని సీఎం మండిపడ్డారు. ఘటన జరిగిందని, శాంతి భద్రతలు క్రమం తప్పే అవకాశం ఉందని పోలీసు ఉన్నతాధికారులు ముందే హెచ్చరించినా, హీరో అల్లు అర్జున్ అటువంటి మాటలను పట్టించుకోలేదని పేర్కొన్నారు.

సహకరించకపోవడంతో డీసీపీ స్వయంగా అక్కడికి వెళ్లి, అరెస్టు చేస్తామని హెచ్చరించడంతో హీరో అల్లు అర్జున్ కారు ఎక్కినప్పటికీ తిరిగి రోడ్ షో చేస్తూ వెళ్లడం దురదృష్టకరమని సీఎం తెలిపారు. ఈ ఘటనపై హీరో, థియేటర్ యాజమాన్యం మీద పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.

ఘటన అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరించిన హీరో అల్లు అర్జున్ అని అన్నారు. ఒక మహిళ ప్రాణాలు కోల్పోయినా, ఆ కుటుంబాన్ని సినిమా ప్రముఖులు కూడా పరామర్శించకపోవడం విచారకరమని సీఎం అన్నారు.

ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శించేవారు, చావుకు కారణమైన వారిని ప్రశ్నించకుండా ప్రభుత్వంపై మాటలతో దాడి చేయడాన్ని సీఎం తప్పుబట్టారు. సినీ పరిశ్రమను ప్రోత్సహించడానికి అనుమతులు ఇస్తున్నా, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటానికి ప్రభుత్వం సహకరించదని సీఎం స్పష్టం చేశారు.

సినీ ఇండస్ట్రీ తన బాధ్యతను గుర్తించి వ్యవహరించాలన్నారు. వ్యాపారం చేసుకోవడం సమంజసమే కానీ, ప్రాణాలు బలిగొట్టే విధంగా వ్యవహరించడం సహించరాదని హెచ్చరించారు. “మా ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడే నడుచుకుంటుంది. ప్రజల ప్రాణాలతో ఆడే ఆటలను మేం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించము. బాధ్యులు ఎవరు అయినా సరే, వారిని ప్రశ్నించడంలో వెనుకాడము,” అని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.

Latest News

గా ఊర్ల పేమ పెండ్లిల్లు నిషేధం!?|ADUGU TRENDS

ఇగీ మద్దెల ఏడ సూసినా, లవ్వు మ్యారేజీలు, లివింగ్ టుగెదర్లేనాయె! గియి ఊర్లు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి దేశాలు, ఖండాంతరాలకు విస్తరించినయి. ఇగ కులం లేదు, మతం లేదు. ఇల0 లేదు....

యూపీ విభజన ప్రతిపాదనా? రాజకీయ వ్యూహమా?|EDITORIAL

దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై చర్చ జరగడం సహజమే. కానీ ఇలాంటి నిర్ణయాలు ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. యూపీ విభజనపై రాజ్‌భర్‌ చేసిన ప్రకటన అధికారిక విధానంగా మారుతుందా?...

సెప్టెంబర్ 23, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 08.43 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శ్రవణ ఉదయం 08.18 వరకు ఉపరి ధనిష్ఠ యోగం సుకర్మ సాయంత్రం 04.50 వరకు ఉపరి ధృతి కరణం బవ ఉదయం 08.03...

పుతిన్ తిరుగులేని నేతేనా!?|EDITORIAL

పుతిన్ రాజకీయ పట్టు బలపడినప్పటికీ, ప్రతిపక్ష స్వేచ్ఛ, ఎన్నికల పారదర్శకత, యుద్ధానికి ముగింపు వంటి అంశాలపై రష్యా ఎదుర్కొంటున్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఆధిపత్యాన్ని కేవలం సీట్ల సంఖ్యతో...

బంగారం కొనే ముందు గీ మూడు సూడాలే!|ADUGU TRENDS

మనం బంగారం, నగలు ఏడ కొంటం? ఔసలోల్ల దగ్గర, బంగారం దుకాణాల్ల కొంటం .పెద్దపెద్ద దుకాణాలకు కూడా పోయేటోల్లు ఉంటరు. కానీ, గీ మూడు ముఖ్యమైన ముచ్చట్లు పట్టించుకోం. కానీ మన సర్కార్...

సెప్టెంబర్ 22, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 07.23 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.14 వరకు ఉపరి శ్రవణ యోగం అతిగండ సాయంత్రం 04.49 వరకు ఉపరి సుకర్మ కరణం వణజి ఉదయం 06.34...

సెప్టెంబర్ 21, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు దశమి సాయంత్రం 05.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది యోగం శోభ సాయంత్రం 04.30 వరకు ఉపరి అతిగండ కరణం గరజి సాయంత్రం 05.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News