Cricket|క్రికెట్, Bollywood|బాలీవుడ్ రంగాల మధ్య బలమైన అనుబంధం ఎప్పటినుంచో కొనసాగుతోంది. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ – షర్మిలా ఠాగూర్ జంట నుంచి విరాట్ కోహ్లీ – అనుష్క శర్మ, కేఎల్ రాహుల్ – అతియా శెట్టి వరకు పలువురు క్రికెటర్లు బాలీవుడ్ నటీమణులను ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఇరు రంగాల ప్రముఖులు కలిసి కనిపిస్తే, Love|ప్రేమ వ్యవహారం నడుస్తోందన్న ఊహాగానాలు రావడం సహజం. ఒకప్పుడు ఇలాంటి పుకార్ల జాబితాలో ఒకప్పుడు క్రికెట్ దేవుడుగా పేరుగాంచిన సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ కూడా ఉన్నారు.
90వ దశకంలో కొన్ని మీడియా కథనాలు సచిన్ – శిల్పా ప్రేమలో ఉన్నారని పేర్కొన్నాయి. ఆ సమయంలో సచిన్ ఇంకా వివాహం చేసుకోకపోయినా, అంజలితో ప్రేమలో ఉన్నారు. అయితే ఈ విషయాన్ని అప్పట్లో బయటికి తెలియనందున, శిల్పా సింగిల్‌గా ఉండటం వల్ల పుకార్లు బలపడ్డాయి.
ఈ పుకార్లపై శిల్పా శిరోద్కర్ ఒక ఇంటర్వ్యూలో స్పందించారు. 1991లో ‘హమ్’ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో సచిన్‌ను మొదటిసారి కలిశానని ఆమె తెలిపారు. తన కజిన్, సచిన్ ఇద్దరూ ముంబై బాంద్రా ఈస్ట్‌లో కలిసి క్రికెట్ ఆడేవారని, ఆ పరిచయం ద్వారానే పరిచయం ఏర్పడిందని చెప్పారు. ఆ సమయంలో సచిన్ – అంజలి ఇప్పటికే డేటింగ్‌లో ఉన్నారని ఆమె స్పష్టం చేశారు. “నేను సచిన్‌ను కేవలం ఒక్కసారి మాత్రమే కలిశాను. ఒక నటి, ఒక క్రికెటర్ కలిస్తే, ముఖ్యంగా అది సచిన్ అయితే, పుకార్లు రావడం సులభం అని ఆమె వ్యాఖ్యానించారు.
సచిన్ టెండూల్కర్ కూడా ఈ పుకార్లపై స్పందిస్తూ, నా గురించి వచ్చిన అత్యంత హాస్యాస్పదమైన పుకారు ఏంటంటే, నేను – శిల్పా శిరోద్కర్ ప్రేమలో ఉన్నామన్నది అని పేర్కొన్నారు. ఈ ప్రకటనతో ఆ ఊహాగానాలకు ముగింపు పలికారు.
తదుపరి కాలంలో ఇద్దరూ తమ జీవితాల్లో సంతోషంగా స్థిరపడ్డారు. సచిన్ 1995లో అంజలిని వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్నారు. శిల్పా 2000లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ అపరేష్ రంజిత్‌ను వివాహం చేసుకొని ఒక కూతురుతో ఉన్నారు. పెళ్లి తర్వాత విదేశాల్లో స్థిరపడిన ఆమె, ఇటీవల బిగ్ బాస్ 18 ద్వారా మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు.
శిల్పా పేరు మరో హీరో అనిల్ కపూర్‌తో కూడా ప్రేమలో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. ఒకప్పుడు వారు డేటింగ్‌లో ఉన్నారని, నటి మాధురీ దీక్షిత్ కారణంగా వారి బంధం ముగిసిందని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఇది అధికారికంగా ధృవీకరించబడలేదు. తన కెరీర్ ప్రారంభ దశలో అనిల్ కపూర్ తనకు చాలా సహాయం చేశారని, పలువురు దర్శకులు, నిర్మాతలకు పరిచయం చేశారని శిల్పా అంగీకరించారు.
మొత్తానికి, సచిన్, శిల్పా మధ్య ఉన్న ప్రేమ పుకార్లు కేవలం మీడియా ఊహాగానాలే అని, వారిద్దరూ కేవలం పరిచయస్తులే అని ఇద్దరూ స్పష్టంచేశారు.

