చారిత్రక వరంగల్ అజంజాహీ మిల్లు కార్మిక భవన స్థలం కబ్జా సమస్య మరోసారి హైదరాబాద్ ని తాకింది. మిల్లు మాడిఫైడ్ వాలంటరీ రిటైర్డ్ కార్మికుల 2002 అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఆందోళన నిర్వహించింది. కార్మిక భవనాన్ని కూల్చిన చోటే తిరిగి కట్టాలి. సుప్రీం కోర్టు తీర్పుననుసరించి మిల్లు స్థలంలోనే కార్మికులకు ఇళ్ళ స్థలాలు కేటాయించాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, పౌరహక్కుల నేతలు ప్రొఫెసర్ హరగోపాల్, కుసుమ రవిచంద్ర, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

