జివ్వకో రుసి, పుర్రెకో బుద్ధి అన్నరు. నాలుక రకరకాల రుసులను కావాలంటది. బుద్ధి కూడా గట్లనే రకరకాల ఆలోశనలు సేత్తది. గట్ల గా ఆలోశలన నుంచి కొత్త రుసులను అందించే, సరికొత్త ఆలోశనే గిది. గదేందో సూద్దాం పదండ్రి.

ఢిల్లీల ఉన్న ‘అంగీతీ తడ్కా మదాన్ రెస్టరంట్’ ఓ కొత్త ప్రయోగం శేసింది. ‘ధురంధర్ రివాల్వింగ్ థాలీ’ పేరుతో ఓ కొత్త వంటకాన్ని అందరికీ అందిత్తాంది. ఇందుల ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అనేక శాకాహార ఆహార పదార్థాలను ఇత్తాండ్రు. మొత్తంగా 51 యెరైటీలు ఉన్న ఈ పెద్ద ప్లేట్ ఆహారం ధర 1,699 రూపాయెలు. గతంల కూడ గీ రెస్టరంట్ గిలాంటి రకరకాల థాలీలు, ఆహార పదార్థాలను ఆహార ప్రియులకు అందించిందంట. ఇగ సరికొత్త రుసులు అంటే ఆసక్తి ఉన్న నెటిజన్ల ఇన్స్టాగ్రామ్ ఫీడ్ల గత కొన్ని రోజులుగ గీ ఈడియ తెగ కనిపిత్తాంది. కావాల్నంటే మీరూ సూడుండ్రి.

