తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ విద్యా కమిటీ చైర్మన్ మిడిదొడ్డి శ్యాంసుందర్ సోమవారం ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్ష అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. హైదరాబాదులోని లక్డికాపుల్ లో గల ఆర్యవైశ్య భవన్లో మిడిదొడ్డి శ్యాంసుందర్ తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి తొడుపునూరి చంద్రపాల్ కు సమర్పించారు. అంతకుముందే గద్వాల జిల్లా ఆర్య వైశ్యులు మిడిదొడ్డి శ్యాంసుందర్ తరఫున నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ వేయడానికి ముందు నిన్ననే అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.


