తెలంగాణలో మందుబాబులకు షాక్ తగిలింది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ బీర్ల ధరలను ప్రస్తుత ధరపై 15% పెంచుతూ అధికారిక ఆదేశాలు జారీ చేసింది. ఈ పెరిగిన ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో రూ.99 మద్యం, బీరు మినహా మిగతా మద్యం ధరలు పెరిగాయి. తెలంగాణలోనూ మద్యం ధరలు పెరిగే అవకాశముండగా, బీర్ల రేట్ల పెరుగుదలతో మందుబాబులకు భారం మరింత పెరిగినట్టైంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నిర్ణయం ద్వారా భారీ ఆదాయం సమకూరే అవకాశముందని అంచనా.

