Friday, July 17, 2026
24.5 C
Hyderabad

మత విధ్వేషాలు బంగ్లా భద్రతకే పెను ముప్పు!|EDITORIAL

బంగ్లాదేశ్‌లో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు దక్షిణాసియాలో శాంతి, భద్రతలపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. షేక్ హసీనా పదవీచ్యుతి అనంతరం ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వ హయాంలో దేశం రాజకీయ అరాచకంలోకి జారిపోయినట్లుగా కనిపిస్తోంది. ఈ అస్థిరతలోనే ఆదేశంలోని హిందూ మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇవి రాజకీయ ఘర్షణలలో భాగమా? లేక అక్కడి హిందూ సముదాయాన్ని భయభ్రాంతులకు గురిచేసే ఉద్దేశపూర్వక ప్రయత్నమా? అన్న సందేహాలు కలుగుతున్నాయి.

హసీనా భారత్‌లో ఆశ్రయం పొందిన తరువాతే హిందువులపై దాడులు తీవ్రమయ్యాయన్న వాదన విస్తృతంగా వినిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు మూకలు రెచ్చిపోయి హత్యలు, దహనాలు, ఆలయాల ధ్వంసం, భూ కబ్జాలు చేస్తున్నాయని స్వతంత్ర నివేదికలు వెల్లడిస్తున్నాయి. తాత్కాలిక ప్రభుత్వం వీటిని ‘రాజకీయ హింస’గా కొట్టిపారేయాలని ప్రయత్నిస్తున్నా, బాధితులలో అధికశాతం హిందువులే కావడం ఈ వాదనను బలహీనపరుస్తోంది.

దీపూ చంద్రదాస్‌, అమృత్ మండల్‌ వంటి వారి క్రూరమైన, కిరాకతక హత్యలు ఆ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ ఘటనలను మతపరమైనవి కావని బంగ్లాదేశ్ ప్రభుత్వం బుకాయిస్తున్నప్పటికీ, వరుసగా అదే సముదాయానికి చెందినవారు బలవుతున్న పరిస్థితి యాదృచ్ఛికంగా కనిపించడం లేదు. తాత్కాలిక ప్రభుత్వ హయాంలోనే సుమారు 2,900కుపైగా హింసాత్మక ఘటనలు మైనారిటీలపై జరిగాయని స్వతంత్ర సంస్థల అధ్యయనాలు పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

ఈ పరిణామాలపై భారత్ స్పందించక తప్పలేదు. బంగ్లాలో మైనారిటీలపై జరుగుతున్న దాడులను విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇవి విస్మరించదగిన ఘటనలు కాదని, బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలని స్పష్టం చేసింది. భారత్–బంగ్లా సరిహద్దు పొడవునా జరుగుతున్న పరిణామాలను న్యూఢిల్లీ సునిశితంగా గమనిస్తోందని అధికార ప్రతినిధులు తెలిపారు. ఇది కేవలం ద్వైపాక్షిక అంశం మాత్రమే కాదు, దేశీయ స్థిరత్వానికి సంబంధించిన విషయం అన్న సంకేతాన్ని భారత్ స్పష్టంగా ఇచ్చింది.

అయితే ఇంత జరుగుతున్నా, అంతర్జాతీయ సమాజం ఎందుకు నిశ్శబ్దంగా ఉంది? గాజా, ఉక్రెయిన్ వంటి ప్రాంతాల్లో మానవహక్కుల ఉల్లంఘనలపై పెద్ద ఎత్తున స్పందించిన ప్రపంచం, పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో జరుగుతున్న మైనారిటీల ఊచకోతపై ఎందుకు అంతగా స్పందించడం లేదు? ఈ ద్వంద్వ వైఖరి మానవహక్కుల పరిరక్షణలోని రాజకీయ స్వార్థాలను బహిర్గతం చేస్తోంది.

భారత్‌లో సినీ ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నేతలు ఈ దాడులను ఖండిస్తున్నారు. ‘పక్కనే జరుగుతున్న అన్యాయంపై మౌనం నేరంతో సమానం’ అన్న భావన సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యక్తమవుతోంది. పశ్చిమ బెంగాల్‌లోని రాజకీయ నాయకులు బంగ్లాదేశ్ అధికారులకు నేరుగా హెచ్చరికలు చేయడం పెల్లుబికుతోన్న ఆగ్రహానికి ప్రతిబింబం.

గత కొంతకాలంగా అంతగా కనిపించని, వినిపించని మతతత్వ రాజకీయాలు బంగ్లాలో పునరుజ్జీవం పోసుకుంటున్నాయి. కొందరు నేతలు మతతత్వాన్ని తిరిగి ప్రోత్సహిస్తూ, మైనారిటీలను బలిపశువులను చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కేవలం దేశీయ సమస్యగా కాకుండా, భారత్‌ను రెచ్చగొట్టే వ్యూహంలో భాగమేనన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దక్షిణాసియాలో మతతత్వ అశాంతి సరిహద్దులు దాటుతుందన్న చరిత్రను మరచిపోలేం.

బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పష్టమైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మాటలతో కాకుండా, చర్యలతో మైనారిటీల భద్రతకు భరోసానివ్వాలి. దోషులను శిక్షించి, బాధితులకు రక్షణ కల్పించడం, ప్రజాస్వామిక మానవీయ, న్యాయబద్ధమైన, సుపరిపాలనను పునరుద్ధరించడం అత్యవసరం. ఇలాంటి ఘటనలు ఇప్పటికే అంతర్గత అత్యవసర సమస్యలతో సతమతమవుతోన్న దేశాన్ని మరింత సంక్షోభంలోకి నెడుతుంది. దేశ భద్రతకే ముప్పుగా మారుతుంది.

Latest News

కరువు కోరలు!|Fangs of drought

ఇప్పటికి 33శాతమే వర్షం నమోదు!! రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రం అడుగంటుతున్న జలాశయాలు జీవ నదుల్లోనూ జల జీవమే లేదు రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి సాగుకు తొందరొద్దంటున్న నిపుణులు ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ 20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలేయొద్దు బోరుబావుల కింద వరి...

మొక్క నాటుండ్రి.. డిస్కౌంట్లు పొందుండ్రి!?|ADUGU TRENDS

పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ...

‘ఢీ’లిమిటేషన్ రాజకీయాలు!?|EDITORIAL

డీలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ సంస్కరణలలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య మార్చే ప్రక్రియ కాదు, భవిష్యత్ రాజకీయ ప్రాబల్య సమీకరణాలను నిర్ణయించే కీలక ఘట్టం....

జూలై 17, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం దక్షిణాయణం ప్రారంభం తిధి తదియ ఉదయం 09.54 వరకు ఉపరి చవితి నక్షత్రం మఖ రాత్రి 10.51 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది ఉదయం 05.00 వరకు ఉపరి వ్యతీపాత కరణం గరజి ఉదయం 09.54...

సింధు నాగరికత|ADUGU|SPECIAL|COMPITITIVE|EXAMS

నాగరికత మరియు సంస్కృతికి తేడా నాగరికత పూర్తిగా అభివృద్ధి చెందిన మరియు ఉన్నతమైన జీవనాన్ని గడిపినట్లయితే మరియు ప్రజలు పట్టణ, శాస్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ఉంటే దానిని నాగరికత అంటారు. సంస్కృతి సంస్కృతి అనేది ప్రతీ ఒక్కరికీ...

‘ప్రభంజన’ పథం ప్రజ్వరిల్లాలి|ESSAY|SPECIAL

జూలై 16, 2025. సరిగ్గా ఏడాది క్రితం జర్నలిస్టు, వక్త, కవి, రచయిత, మేధావి, అభ్యుదయవాది, వివేకశీలి, చైతన్యవంతుడు, నిరంతర పోరాట శీలి అయిన ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ పరమపదించారు....

రోడ్లకు కూడా ఆపరేషన్లు!?|ADUGU TRENDS

గిప్పటి దాకా మనం మనుసులకు, జంతువులకు ఆపరేషన్లు సేసుడే సూసినం. కనీ, గీ యింతను ఎక్కడా సూడలే.! గా బిహార్ రాస్ట్రంల కొత్తగ, ఎక్కడా లేని లెక్కల, రోడ్లకు కూడా ఆపరేషన్లు సేత్తాండ్రు....

నదుల అనుసంధానమే జల భద్రతకు శాశ్వత మార్గం!|EDITORIAL

ఎల్‌నినో ప్రభావాన్ని ఆపడం మన చేతుల్లో లేదు. కానీ, దాని వల్ల కలిగే నష్టాన్ని శాస్త్రీయ ప్రణాళికలు, సమర్థమైన జల నిర్వహణ, నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయం ద్వారా...

జూలై 16, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం పూరి జగన్నాధ రధోత్సవం తిధి శు విదియ ఉదయం 11.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.40 వరకు ఉపరి మఖ యోగం వజ్ర ఉదయం 08.20 వరకు ఉపరి సిద్ది కరణం కౌలవ...

ఆషాఢమాసం రహస్యాలు|ASHADAM|SECRETS

ఆచారాలు, శాస్త్రం, సంప్రదాయాల వెనుక నిజాలు ఆషాఢమాసం విశేషాలు – ఆధ్యాత్మికత, ప్రకృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాల వెనుక అసలు కథ ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం... ప్రతి సంప్రదాయం వెనుక ఒక జీవన...

ఉడుతా మిడతా!?|ADUGU TRENDS

మనం మన సుట్టుముట్టు ఉడుతల్ని సూత్తనే ఉంటం. పొలాలల్ల, రోడ్ల మీద అటిటుపోతనే ఉంటయి. సిడెం సేపట్లనే కనబడ్తయి, ఆడ్తయి. ఉరుకుతయి. ఎన్కట గా రాముడికి వారధి కట్టుట్ల గీ ఉడుత సాయం...

ఓటర్ల సవరణకు శాశ్వత పరిష్కారం లేదా!?|EDITORIAL

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, పట్టణాల్లో వార్డు కార్యాలయాలు, మీ సేవ వంటి పౌర సేవా కేంద్రాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తే ప్రజలకు సౌలభ్యం పెరుగుతుంది. బీఎల్‌వోలపై పూర్తిగా ఆధారపడకుండా బహుళస్థాయి ధ్రువీకరణ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News