Friday, September 18, 2026
26.4 C
Hyderabad

మన ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనదే

ఆలయాల చరిత్ర పర్యాటకులకు తెలిసేలా ఏర్పాటు చేయండి

మొండి బకాయిలను వసూలు చేయండి

వల్మీడి, పాలకుర్తి దేవస్థానాల అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ తో కలిసి సమీక్షా సమావేశం

అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

గ్రామస్తులతో కలిసి సమీక్ష సమావేశాన్ని ఆసక్తిగా తిలకించిన ఝాన్సీ రెడ్డి

జనగామ జిల్లాకు సంబంధించి, పాలకుర్తి నియోజకవర్గంలో గల పర్యాటక ప్రాంతాలు పాలకుర్తి, వల్మీడి, బమ్మెర అభివృద్ధి పనులపై జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించగా, ఈ కార్యక్రమానికి పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని రాజ రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయాల పెండింగ్ పనుల అభివృద్ధిని సమీక్షిస్తూ, ప్రధాన నిర్మాణాలు, భక్తుల కోసం అవసరమైన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఆలయాలకు కేటాయించిన నిధుల వినియోగం, పూర్తి కానీ పనుల పరిస్థితి, తదితర అంశాలపై చర్చించారు. ఆలయ ప్రాంతాల్లో తాగునీరు, పారిశుధ్య, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు భక్తుల ఆధ్యాత్మిక అనుభవాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

సమీక్ష సమావేశాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. వల్మీడి, పాలకుర్తి, బమ్మెర ఆలయాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసి, ఆలయ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలన్నారు. సమగ్ర ప్రణాళికలు రూపొందించి, ఆలయ చరిత్రను పర్యాటకులకు పరిచయం చేయాల్సిన అవసరం వుందని అభివృద్ధి పనులకు పూర్తి చేయడానికి ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలకుర్తి అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారన్నారు.

జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా మాట్లాడుతూ… ఈ ప్రాంత అభివృద్ధికి కావాల్సిన సహాయ సహకారాలు ప్రభుత్వం పూర్తిగా అందిస్తుంది అన్నారు. అధికారులు, ప్రజలు అందరు కలిసి ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి అన్నారు.

వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే, ఇతర అధికారులు

సమీక్ష సమావేశానికి ముందు ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి, ఇతర అధికారులు శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి వారి శేష వస్త్రాలతో సత్కరించి ఆశీర్వదించారు.

జనంలో ఝాన్సీ

సమీక్ష సమావేశానికి అనుకోకుండా హాజరైన పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి గ్రామస్తులతో కలిసి కూర్చొని ఆసక్తిగా తిలకించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్, ఆర్డిఓ డి.ఎస్ వెంకన్న నాయక్, ఎమ్మార్వో శ్రీనివాస్, ఎంపీడీవో రాములు, ఆలయ ఈవో మోహన్ బాబు, ఆలయ సూపరింటెండెంట్ వెంకటయ్య, అధికారులు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Latest News

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News