Thursday, July 30, 2026
24.4 C
Hyderabad

ప్రభంజన్ భావజాల వ్యాప్తే ఆయనకు అసలైన నివాళి|PRABHANJAN YADAV|TRIBUTE

-అశేష అభిమానులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య సంస్మరణసభ

జనగామ(గూడూరు), జూలై 26(అడుగు ప్రత్యేక ప్రతినిధి):
సమాజంలోని అణగారిన వర్గాల తరఫున ప్రశ్నించే గొంతుకగా ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ అని, ఆయన మరణంతో బీసీ సమాజం మూగబోయిందని పలువురు వక్తలు అన్నారు. ప్రొఫెసర్ ప్రభంజన్ కుమార్ యాదవ్ ఆశయాలను వ్యాప్తి చేద్దామని, వారి భావజాలాన్ని ప్రజలకు నేర్పుదామని, వారి మరణం మనకు తీరని లోటు అని విచారం వ్యక్తం చేశారు.

జనగామ జిల్లా, పాలకుర్తి మండలం, గూడూరు గ్రామంలో వారి సతీమణి, మంచిర్యాల మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ డా.రేఖ, తల్లి కొమురమ్మ, సోదరులు రమేష్, శ్రీనివాస్, తదితర కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో ఈ నెల 16న అకాల మరణం చెందిన ప్రముఖ సామాజిక బహుజన ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్ట్, విద్యావేత్త, సామాజిక శాస్త్రవేత్త ప్రొ. ప్రభంజన్ కుమార్ యాదవ్ సంస్మరణ సభను శనివారం, నిర్వహించగా, బోరును కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు, బంధుమిత్రులు, ప్రజలు ప్రభంజన్ కు జోహార్ అంటూ.. నివాళులర్పించారు. ఈ సందర్భంగా సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభంజన్ దేహాన్ని జనగామ మెడికల్ కాలేజీకి అందించినందుకు గాను వారి అభినందన జ్ఞాపికను వారి కుటుంబసభ్యులకు అందించారు.

ఈ సందర్భంగా ఆయన సతీమణి డా. రేఖ మాట్లాడుతూ, ప్రభంజన్ కుమార్ యాదవ్ తనకు భర్తగా కన్నా… మంచి స్నేహితుడు అని చెప్పారు. ప్రభంజన్ లాంటి మిత్రుడిని కోల్పోవడం నాకు తీరని లోటు అని కంటతడి పెట్టారు. ప్రభంజన్ ఎప్పుడూ అందరూ సమానమనే భావనతోనే ఉండేవారని చెప్పారు. ఆయన తాను ప్రజా ఉద్యమాలు చేస్తా… అని, ఉద్యోగం మానేస్తున్నా… పిల్లల బాధ్యత నువ్వే తీసుకోవాలని చెప్పి, తనను ఈ సమాజానికి పరిచయం చేశారన్నారు. నాకు తన స్నేహితులను ఆస్తిగా ఇచ్చారన్నారు. తన మిగిలిన జీవితం వారి ఆశయాల కోసం పనిచేస్తానని, వారి భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి కృషి చేస్తానని చెప్పారు. తన తదనంతరం శరీర దానం చేయాలని కోరిన ప్రజా ఉద్యమ నేత నా భర్త కావడం తనకు గర్వంగా ఉందన్నారు.

వారి తమ్ముడు యాదనాల రమేష్ మాట్లాడుతూ, తన అన్న ఆశయాలకు అనుగుణంగా బీసీ ఉద్యమంలో తమ కుటుంబం పాలు పంచుకుంటుందని చెప్పారు. తమ అన్నయ్య రాసిన పుస్తకాలను పునర్ముద్రించి విద్యార్థులకు పంపిణీ చేస్తామన్నారు.

ఇదే సందర్భంలో పలువురు బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ, యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ గుర్తుగా, స్వగ్రామం గూడూరులో, మండల కేంద్రం పాలకుర్తిలో, ఏర్పాటు చేయాలని, అన్ని సంఘాలు సహకరించాలని విజ్ఞప్తి చేయగా, వచ్చిన మిత్రులు, బంధువులు, అభిమానులు తదితరులు చప్పట్లతో ఆమోదం తెలిపారు.

అడుగు డిజిటల్ మీడియాకు అభినందనలు

గత 10 రోజులుగా ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ కు తమ అడుగు డిజిటల్ మీడియా ద్వారా అక్షర నీరాజనం పలికిన ప్రభంజన్ యాదవ్ మిత్రుడు, అడుగు డిజిటల్ మీడియా చీఫ్ ఎడిటర్ డా. మార్గం లక్ష్మీ నారాయణ, వారి బృందానికి వారి సతీమణి డా. రేఖ, ఇతర వక్తలు వారి ప్రసంగంలో అభినందించారు. ఇలాంటి సమయంలో వారి వ్యాసాలను ప్రజల్లోకి తీసుకెళ్లినందుకు గాను వారిని అభినందించారు.

సంస్మరణ సభలో ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ చిత్రపటానికి వారి మిత్రులు సోమనాథ కళా పీఠం అధ్యక్షులు డా. రాపోలు సత్యనారాయణ, అడుగు డిజిటల్ మీడియా చీఫ్ ఎడిటర్ డా. మార్గం లక్ష్మీ నారాయణ, ప్రొఫెసర్ దాడబోయిన శ్రీకాంత్, టీయూడబ్ల్యుజె రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ అబ్దుల్లా ఖాన్, సదాశయ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రవణ్ కుమార్, జిల్లా కో ఆర్డినేటర్ సీహెచ్ దళపతి, కర్రేటి శంకర్ రావు, కోలా జనార్ధన్, మాజీ సర్పంచ్ బక్కి పుల్లయ్య, పాలకుర్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గూడూరు లెనిన్, జమాలుద్దీన్, మహమ్మద్ పాషా, భూమా రుషి, దీపక్, చౌడవరపు శ్రీనివాస్, బెల్లి రాజయ్య, నోముల రవీందర్, బహుజన దయాకర్, వాయిస్ ఆఫ్ తెలంగాణ జగదీష్, నల్గొండ లింగయ్య, సోమిడి కిషన్, అడుగు డిజిటల్ మీడియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్గం సాయి సందీప్ తేజ, రషీద్, జీ వెంకటేశ్వర్లు, వెంకన్న, డా. రాకేష్ తోపాటు అభిమానులు బీసీ సంఘాల సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Latest News

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News