Friday, July 17, 2026
26.4 C
Hyderabad

అధికార, విపక్షం విఫలం-పార్లమెంటు ప్రహసనం!|EDITORIAL

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు యథావిధిగానే వాయిదాలతో ప్రారంభమయ్యాయి. పట్టువిడుపులు లేని అధికార, ప్రతిపక్షాలు విలువైన ప్రజా కాలాన్ని, ధనాన్ని నిర్వీర్యం చేస్తూ తమ పంతాలకు, పట్టువిడుపులకు వేదికగా చేసుకుంటున్నాయి. పార్లమెంట్‌ ప్రజల కోసం ఉద్దేశించిందిన్న ఇంగితం ఇసుమంతైనా అధికార, విపక్షాలకు లేదు. మొక్కుబడిగా సమావేశాలకు హాజరు కావడం మామూలైపోయింది. ప్రజాప్రతినిధులుగా నిజంగానే ప్రజలకు న్యాయం చేస్తున్నామా? అన్న ఆలోచన ఏ పార్టీకీ, ఏ నాయకుడికీ లేకుండా పోయింది. తొలి రోజే వాయిదా తీర్మానాలు ఇవ్వడం, గొడవ చేయడం వంటి చర్యలు ఈ సమావేశాల్లోనూ కనిపించాయి. దీంతో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, ఓపెనిగింగ్ రోజే వాయిదాతో సమావేశాలకు శ్రీకారం చుట్టారు. ప్రతిపక్షం చెప్పినదాన్ని అధికార పక్షం వినకపోవడం, అధికార పక్షాన్ని ప్రతిపక్షం వ్యతిరేకించడం, గొడవ చేస్తేనే ప్రతిపక్షం అన్నట్లుగా సమావేశాలుంటున్నాయి.

పార్లమెంటులో సమస్యలపై చర్చించేందుకు రాజ్యాంగం కొన్ని పద్ధతులు, నియమనిబంధనలను పొందుపరిచింది. సభలో ప్రస్థావించి, చర్చించి, జవాబు రాబట్టడం ప్రతిపక్షం విధి. ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలకు సమాధానపరచడం తద్వారా ప్రజలకు ఆ సమాచారాన్ని చేరే విధంగా చేసుకోవడం ప్రభుత్వం బాధ్యత. ఇప్పుడు ఈ రెండూ భూతద్దం పెట్టి వెతికినా దొరకని బ్రహ్మ పదార్థాలయ్యాయి. జాతీయ ప్రజాస్వామిక కూటమి (ఎన్డీఏ) గా జట్టు కట్టిన బీజేపీకి పార్లమెంట్‌ అన్నా, ప్రతిపక్షమన్నా జంకు లేకుండాపోయింది. ప్రగతిశీల ఐక్య కూటమి (యూపీఏ)గా ఏర్పడ్డ కాంగ్రెస్ కి కూడా పార్లమెంటు, ప్రభుత్వం అన్నా లెక్కలేకుండా పోయింది. ఈ రెండు కూటమిలకు ప్రజలంటే అంతకన్నా గౌరవం లేకుండా పోతోంది. అతి పెద్దదైన ప్రజాస్వామిక దేశంలో పార్లమెంటులో కూడదీసుకున్న కూటమి బలం మాత్రమే ఉన్న అధికార పక్షం, బలహీనమైన ప్రతిపక్షం, కలిసి ప్రజలు, ప్రజా సమస్యలను ఏమాత్రం పట్టించుకోకుండా, పార్లమెంటరీ వ్యవస్థను అవమానిస్తూ, విలువైన సభాసమయాన్ని, డబ్బును వ్రుథా చేస్తూ, నిరర్ధకమైన, పేలవమైన పర్ఫార్మెన్స్ ను ప్రదర్శిస్తున్నాయి.

పార్లమెంట్‌ సమావేశాలు ఆగస్ట్‌ 21 వరకు అంటే దాదాపు నెలరోజుల పాటు కొనసాగనున్నాయి. ఆగస్టు12 నుంచి 18 వరకు సమావేశాలకు సెలవులు ఉంటాయి. ఈ సమావేశాల్లో మొత్తం 7 పెండింగ్‌ బిల్లులతో పాటు మరో 8 బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. ఇక, దేశ భద్రతకు సంబంధించిన పలు కీలక విషయాలను పార్లమెంటులో చర్చించాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌ వంటి వాటిపై చర్చించాలని ఇండియా కూటమి పట్టుదలతో ఉంది. భారత, పాక్ యుద్ధాన్ని తానే ఆపానని, ట్రంప్‌ పదేపదే చెప్పడం, దేశ ఆంతరంగిక భద్రత విషయాలలో అమెరికా ప్రమేయం ఏంటని కాంగ్రెస్‌ విమర్శిస్తోంది. ట్రంప్‌ వ్యాఖ్యలపై మోడీ పార్లమెంట్‌లో ప్రకటన చేయాలని, అమెరికా పట్ల భారత్ వైఖరిని తెలపాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ అంశాలపై చర్చకు కావాలసిన సమయాన్ని కేటాయిస్తూనే, ప్రతిపక్షాన్ని, ప్రత్యేకించి కాంగ్రెస్ ని ఎదుర్కోవడానికి బీజేపీ అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ సమావేశాలు వాడీ వేడీగా జరగనున్నాయి. పార్లమెంట్ లోపలా, బయటా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా, ఎజెండాను రూపొందించుకుని అమలు చేయడంలో కాంగ్రెస్‌ ప్రతిసారీ విఫలమవుతోంది. 75 ఏళ్లకు చేరువలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీతో పోటీ పడటంలో 50 ఏళ్లు పైబడిన రాహుల్‌గాంధీ వెనుకబడుతున్నారు. స్పష్టమైన విధానాలు, నాయకత్వం లోపాలే దీనికి కారణం.
పార్లమెంట్‌ సమావేశాలకు తయారు కావడమంటే, ప్రజాభిప్రాయంపై స్పష్టత ఉండాలి. ఎలా చర్చించాలన్న వ్యూహం ఉండాలి. అధికార పార్టీని నిలదీయాలి. ప్రజలతో మెప్పులు పొందాలి. వ్యూహాల లోపమే కాంగ్రెస్ ను పార్లమెంటులో పలచన చేస్తోంది. మెజార్టీ ప్రజలకు దూరం చేస్తోంది. యువతరాన్ని ఆకట్టుకోలేకపోతోంది. సమస్యలెదురైనప్పుడే సత్తా చాటాలి. అందుకు పార్లమెంట్‌ను వేదిక చేసుకోవాలి. ముందుతరాన్ని పరిశీలిస్తే, ప్రస్తుత తరం అనుసరించాల్సిన లక్ష్యాలు అర్థమవుతాయి.

నెహ్రూ, ఇందిర, రాజీవ్, పీవీ, మన్మోహన్ వంటి వారు అనుసరించిన విధానాలను అధ్యయనం చేస్తే కదా కనీసం ఏం చేయాలన్నది తెలిసేది. సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులను, పోకడలను ఆకళింపు చేసుకొని అందుకు అనుగుణంగా పార్టీకి దిశానిర్దేశం చేయడంలో రాహుల్‌ విఫలం అవుతున్నారా? మరోవైపు ప్రధాని మోడీ ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యూహ రచన చేస్తూ పార్లమెంటులో తన వాగ్ధాటిని వినిపిస్తున్నారా?ఆలోచించాలి. సమస్య ఏదైనా సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పీకర్‌ ప్రకటించారు. అలాంటప్పుడు వివేచన లేకుండా వాయిదా తీర్మానాలు ఇస్తే, వాటిని స్పీకర్‌ తిరస్కరించడం షరామామూలే! అలాకాకుండా సమస్యలను అధ్యయనం చేసి, నోటీసులు ఇచ్చి చర్చకు పట్టుబట్టాలి. మరి కాంగ్రెస్ సరే, కాంగ్రెస్‌ కూటమి పార్టీలు ఏం చేస్తున్నాయి? తక్షణ చర్చ అన్నది తర్కానికి నిలవదు. తర్పానికి మాత్రమే అక్కరకు వస్తుంది. పార్లమెంట్‌ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూనే ప్రభుత్వాన్ని నిలదీయాలి. తప్పులుంటే దోషిగా నిలబెట్టాలి.

బీజేపీ కాంగ్రెస్ వైఫల్యాల మీదే సాఫల్యమవుతోంది. సరైన సమయానుకూల ఎత్తుగడల్లో కాంగ్రెస్ విఫలమవుతోంది. కాంగ్రెస్ లోపాల కారణంగానే క్రమంగా బీజేపీ జనాలకు దగ్గరవుతుండగా, కాంగ్రెస్ దూరమవుతోంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ఈ వాస్తవాన్ని గ్రహిస్తుందా? పాతరం యువతరం మనోభావాలను గుర్తిస్తుందా? ఇంటా బయటా బీజేపీని ఢీ కొంటుందా? ప్రభుత్వాన్ని నిలదీస్తుందా? పార్లమెంటులో ప్రజల మనసులను గెలుస్తుందా? అన్న అంశాలపై ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. అధికార, ప్రతిపక్షాలు విఫలమైతే ప్రజలు మరో ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోక తప్పదు.

Latest News

కరువు కోరలు!|Fangs of drought

ఇప్పటికి 33శాతమే వర్షం నమోదు!! రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రం అడుగంటుతున్న జలాశయాలు జీవ నదుల్లోనూ జల జీవమే లేదు రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి సాగుకు తొందరొద్దంటున్న నిపుణులు ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ 20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలేయొద్దు బోరుబావుల కింద వరి...

మొక్క నాటుండ్రి.. డిస్కౌంట్లు పొందుండ్రి!?|ADUGU TRENDS

పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ...

‘ఢీ’లిమిటేషన్ రాజకీయాలు!?|EDITORIAL

డీలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ సంస్కరణలలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య మార్చే ప్రక్రియ కాదు, భవిష్యత్ రాజకీయ ప్రాబల్య సమీకరణాలను నిర్ణయించే కీలక ఘట్టం....

జూలై 17, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం దక్షిణాయణం ప్రారంభం తిధి తదియ ఉదయం 09.54 వరకు ఉపరి చవితి నక్షత్రం మఖ రాత్రి 10.51 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది ఉదయం 05.00 వరకు ఉపరి వ్యతీపాత కరణం గరజి ఉదయం 09.54...

సింధు నాగరికత|ADUGU|SPECIAL|COMPITITIVE|EXAMS

నాగరికత మరియు సంస్కృతికి తేడా నాగరికత పూర్తిగా అభివృద్ధి చెందిన మరియు ఉన్నతమైన జీవనాన్ని గడిపినట్లయితే మరియు ప్రజలు పట్టణ, శాస్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ఉంటే దానిని నాగరికత అంటారు. సంస్కృతి సంస్కృతి అనేది ప్రతీ ఒక్కరికీ...

‘ప్రభంజన’ పథం ప్రజ్వరిల్లాలి|ESSAY|SPECIAL

జూలై 16, 2025. సరిగ్గా ఏడాది క్రితం జర్నలిస్టు, వక్త, కవి, రచయిత, మేధావి, అభ్యుదయవాది, వివేకశీలి, చైతన్యవంతుడు, నిరంతర పోరాట శీలి అయిన ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ పరమపదించారు....

రోడ్లకు కూడా ఆపరేషన్లు!?|ADUGU TRENDS

గిప్పటి దాకా మనం మనుసులకు, జంతువులకు ఆపరేషన్లు సేసుడే సూసినం. కనీ, గీ యింతను ఎక్కడా సూడలే.! గా బిహార్ రాస్ట్రంల కొత్తగ, ఎక్కడా లేని లెక్కల, రోడ్లకు కూడా ఆపరేషన్లు సేత్తాండ్రు....

నదుల అనుసంధానమే జల భద్రతకు శాశ్వత మార్గం!|EDITORIAL

ఎల్‌నినో ప్రభావాన్ని ఆపడం మన చేతుల్లో లేదు. కానీ, దాని వల్ల కలిగే నష్టాన్ని శాస్త్రీయ ప్రణాళికలు, సమర్థమైన జల నిర్వహణ, నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయం ద్వారా...

జూలై 16, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం పూరి జగన్నాధ రధోత్సవం తిధి శు విదియ ఉదయం 11.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.40 వరకు ఉపరి మఖ యోగం వజ్ర ఉదయం 08.20 వరకు ఉపరి సిద్ది కరణం కౌలవ...

ఆషాఢమాసం రహస్యాలు|ASHADAM|SECRETS

ఆచారాలు, శాస్త్రం, సంప్రదాయాల వెనుక నిజాలు ఆషాఢమాసం విశేషాలు – ఆధ్యాత్మికత, ప్రకృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాల వెనుక అసలు కథ ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం... ప్రతి సంప్రదాయం వెనుక ఒక జీవన...

ఉడుతా మిడతా!?|ADUGU TRENDS

మనం మన సుట్టుముట్టు ఉడుతల్ని సూత్తనే ఉంటం. పొలాలల్ల, రోడ్ల మీద అటిటుపోతనే ఉంటయి. సిడెం సేపట్లనే కనబడ్తయి, ఆడ్తయి. ఉరుకుతయి. ఎన్కట గా రాముడికి వారధి కట్టుట్ల గీ ఉడుత సాయం...

ఓటర్ల సవరణకు శాశ్వత పరిష్కారం లేదా!?|EDITORIAL

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, పట్టణాల్లో వార్డు కార్యాలయాలు, మీ సేవ వంటి పౌర సేవా కేంద్రాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తే ప్రజలకు సౌలభ్యం పెరుగుతుంది. బీఎల్‌వోలపై పూర్తిగా ఆధారపడకుండా బహుళస్థాయి ధ్రువీకరణ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News