Wednesday, September 23, 2026
22.5 C
Hyderabad

కాంగ్రెస్ మాట ఇస్తే తప్పేది లేదు

చెప్పిందే చేసి చూపాం

ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం

బీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదు మడమ తిప్పదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్, ప్రజాభవన్‌ లో బీసీ నేతలతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…. కులగణన ఎక్స్ రే లాంటిదని రాహుల్ గాంధీ గారు ఆనాడే చెప్పారన్నారు. అన్ని రంగాల్లో బీసీలకు సామాజిక న్యాయం జరగాలంటే కులగణన చేయాల్సిందేనని రాహుల్ గాంధీ పట్టుబట్టారు అన్నారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే కులగణన చేసి తీరుతామని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో మాట ఇచ్చారు
గాంధీ కుటుంబం మాట ఇస్తే తప్పదని, ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన నిర్వహించాం అని సీఎం అన్నారు. అలాగే దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇలాంటి సాహసం చేయలేదని,
కానీ తెలంగాణలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం అందరి భాగస్వామ్యంతో కులగణన నిర్వహించామన్నారు. సమగ్ర కుటుంబ సర్వే తప్పుల తడకగా ఉందనే.. ఆనాటి ప్రభుత్వంలెక్కలను బయటపెట్టలేదని బిఆర్ఎస్ పై దుయ్యబట్టారు. ఆ వివరాలను ఎన్నికల కోసం వాడుకున్నారు తప్ప..ప్రజల కోసం వినియోగించలేదని విమర్శించారు. మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కులగణనపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి
చట్టపరంగా ఇబ్బందులు కలగకుండా ప్లానింగ్ డిపార్ట్ మెంట్ కు అప్పగించి కులగణను పకడ్బందీగా నిర్వహించామన్నారు. ఇంటింటికి ఎన్యుమరేటర్లను పంపి సమాచారాన్ని సేకరించి తప్పులు దొర్లకుండా ఎన్యూమరేటర్ సమక్షంలో కంప్యూటరీకరించాం అన్నారు. తప్పులు జరిగాయని మాట్లాడుతున్న గత పాలకులు వారు ఏ బ్లాక్ లో ఎక్కడ తప్పు జరిగిందో చెప్పాలన్నారు. ప్రక్రియను తప్పుబట్టడం ద్వారా మొత్తం వ్యవస్థను కుప్పకూల్చేందుకు బిఆర్ఎస్ కుట్రలు చేస్తుందన్నారు. మన స్వతంత్ర భారత దేశంలో ఎవ్వరూ ఇప్పటివరకు కులగణన చేపట్టలేదని, ఒక్కసారి బీసీల లెక్క తెలిస్తే వాటా అడుగుతారనే దీనిపై కొందరు కుట్ర చేస్తున్నారన్నారు. ఎంతోకాలంగా ఉన్న డిమాండ్ ను మనం విజయవంతంగా ముందుకు తీసుకెళ్లామన్నారు. బీజేపీలో ఉన్న ఒకటి రెండు ఆధిపత్య సామాజిక వర్గాలకు నష్టం జరుగుతుందనే వాళ్లు కులగణనపై కుట్రలు చేసి, దేశంలో కులగణన చేపట్టడం ఇష్టంలేకనే బీజేపీ కులగణనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. మాజీ సిఎం కెసిఆర్ సర్వే ప్రకారం బీసీలు 51 శాతం మాత్రమే… కానీ మన కులగణన ప్రకారం 56.33 శాతం
ఇక బీసీల లెక్క తగ్గిందో పెరిగిందో బీసీ నాయకులే చెప్పాలి అని సీఎం అన్నారు. గుజరాత్ లో ముస్లింలు ఓబీసీ కేటగిరీలో ప్రయోజనం పొందుతున్నారని… తాను ఎప్పుడూ మీడియాలో చెప్పుకోలేదని మోదీ 2023 లో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు
కానీ బండి సంజయ్ రేవంత్ రెడ్డి బీసీలలో ముస్లింలను కలిపారని చెబుతున్న బీజేపీ నాయకులు తప్పుడు మాటలు మాట్లాడటం కాదు.. ఏ బ్లాక్ లో ఏ ఇంట్లో తప్పు జరిగిందో నిరూపించాలని కెసిఆర్, బండి సంజయ్, కిషన్ రెడ్డికి సవాల్ చేస్తున్నాను అన్నారు. భవిష్యత్ లో దేశంలో బీసీ రిజర్వేషన్ల గురించి చర్చించాలంటే తెలంగాణ గురించి, రేవంత్ రెడ్డి గురించి చర్చించుకునే పరిస్థితి ఉంటుందన్నారు. అలాగే ఈ అవకాశాన్ని జారవిడిచుకుంటే చరిత్ర మిమ్మల్ని క్షమించదు
నేను రాజకీయ అజ్ఞానంతో మాట్లాడటంలేదని సీఎం అన్నారు. మా నాయకుడి ఆదేశాలు పాటించే వ్యక్తిగా మాట్లాడుతున్న
నాయకుడి ఆదేశాలను పాటించడమే నా ధర్మమని సీఎం కుండబద్దలు కొట్టారు. మన ప్రభుత్వం చేసిన లెక్క నూటికి నూరు శాతం పక్కా అనే విషయాన్ని గుర్తించాలన్నారు.

సీఎం రేవంత్ బీజేపీ గురించి మాట్లాడుతూ…. ఎవరు ఏం చెప్పినా నమ్మొద్దని, మోదీ రాజకీయంగా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందనే ఈ ప్రక్రియను తప్పుబడుతున్నారన్నారు.
కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉద్యోగాలు పోతాయనే దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు
దీన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత బిసిలపై ఉందన్నారు. పకడ్బందీ ప్రక్రియతో కులగణన చేశాం…దీన్ని కాపాడుకుని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మీదే అన్నారు. ప్రక్రియ పూర్తి చేయడంతో నా బాధ్యత పూర్తయింది దీన్ని పట్టాలెక్కించి గమ్యం చేర్చే వరకు ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీదేనని చెప్పారు. బీజేపీకి నేను సవాల్ విసురుతున్నా… మీరు జనగణనలో కులగణన చేర్చండి.. ఎవరి లెక్క తప్పో తేలుతుంది
జనగణనలో కులగణన చేర్చాలని ఈ సమావేశం వేదికగా తీర్మానం చేస్తున్నామని, సామాజికవర్గాలవారీగా సమావేశాలు నిర్వహించి మార్చి 10 లోగా తీర్మానాలు చేసి
బిసిల ఐకమత్యాన్ని చాటాలని విజ్ఞప్తి చేశారు. అప్పుడే బీసీలకు రాజకీయంగా, విద్య ఉద్యోగాల పరంగా ప్రయోజనం ఉంటుందని, బలహీన వర్గాలకు కులగణన నివేదికనే బైబిల్, ఇదే భగవద్గీత, ఇదే ఖురాన్ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

Latest News

గా ఊర్ల పేమ పెండ్లిల్లు నిషేధం!?|ADUGU TRENDS

ఇగీ మద్దెల ఏడ సూసినా, లవ్వు మ్యారేజీలు, లివింగ్ టుగెదర్లేనాయె! గియి ఊర్లు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి దేశాలు, ఖండాంతరాలకు విస్తరించినయి. ఇగ కులం లేదు, మతం లేదు. ఇల0 లేదు....

యూపీ విభజన ప్రతిపాదనా? రాజకీయ వ్యూహమా?|EDITORIAL

దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై చర్చ జరగడం సహజమే. కానీ ఇలాంటి నిర్ణయాలు ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. యూపీ విభజనపై రాజ్‌భర్‌ చేసిన ప్రకటన అధికారిక విధానంగా మారుతుందా?...

సెప్టెంబర్ 23, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 08.43 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శ్రవణ ఉదయం 08.18 వరకు ఉపరి ధనిష్ఠ యోగం సుకర్మ సాయంత్రం 04.50 వరకు ఉపరి ధృతి కరణం బవ ఉదయం 08.03...

పుతిన్ తిరుగులేని నేతేనా!?|EDITORIAL

పుతిన్ రాజకీయ పట్టు బలపడినప్పటికీ, ప్రతిపక్ష స్వేచ్ఛ, ఎన్నికల పారదర్శకత, యుద్ధానికి ముగింపు వంటి అంశాలపై రష్యా ఎదుర్కొంటున్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఆధిపత్యాన్ని కేవలం సీట్ల సంఖ్యతో...

బంగారం కొనే ముందు గీ మూడు సూడాలే!|ADUGU TRENDS

మనం బంగారం, నగలు ఏడ కొంటం? ఔసలోల్ల దగ్గర, బంగారం దుకాణాల్ల కొంటం .పెద్దపెద్ద దుకాణాలకు కూడా పోయేటోల్లు ఉంటరు. కానీ, గీ మూడు ముఖ్యమైన ముచ్చట్లు పట్టించుకోం. కానీ మన సర్కార్...

సెప్టెంబర్ 22, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 07.23 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.14 వరకు ఉపరి శ్రవణ యోగం అతిగండ సాయంత్రం 04.49 వరకు ఉపరి సుకర్మ కరణం వణజి ఉదయం 06.34...

సెప్టెంబర్ 21, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు దశమి సాయంత్రం 05.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది యోగం శోభ సాయంత్రం 04.30 వరకు ఉపరి అతిగండ కరణం గరజి సాయంత్రం 05.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News