ఈ రోజు హనుమకొండకి విచ్చేసిన కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డిని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులను కేటాయించాలని. స్మార్ట్ సిటీ మరియు అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (అమృత్ )నిధులను విడుదల చేసి నగరాభివృద్ధికి కృషి చేయాలని, కేంద్ర పురావస్తు శాఖలో ఉన్నటువంటి వేయి స్తంభాల దేవాలయ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని వినతి పత్రాన్ని అందించారు. వరంగల్ మహానగర పాలక సంస్థ అభివృద్ధికి పెండింగ్లో ఉన్న బిల్లులను త్వరగతిన ఇప్పించాలని కోరారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి ఎమ్మెల్యే వినతికి సానుకూలంగా స్పందించి నిధుల అమలుకు సహకరిస్తానని తెలిపారు.ఎమ్మెల్యే వెంట ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు,E.V శ్రీనివాస్ రావు ఉన్నారు.

