Wednesday, September 23, 2026
26 C
Hyderabad

త్వరగానే పలకరించనున్న తొలకరి!|farmer|

|farmer|farm|agriculture|farming|farmlife|tractor|farmers|

ప్రభుత్వమేదైనా అన్నదాతలది అదే గతి. అధోగతి. ప్రభుత్వాలకు రైతు విధానాలే లేకపోవడం, ప్రకృతి వైపరీత్యాలు, అతివృష్టి, అనావృష్టి, కరువు కాటకాలు, కష్ట సుఖాలు, కలిమి లేములు… రైతుల గురించి చెప్పుకోవడానికి ఇంతకంటే లేదు. జై కిసాన్, రైతే రాజు, అన్నదాత, దేశానికి వెన్నెముక అనేవి కేవలం నినాదాలు మాత్రమే. విధానాలు కావాలి. నినాదాలు రైతాంగం కడుపు నింపవు.|farmer|farm|agriculture|farming|farmlife|tractor|farmers|

అకాల వర్షాలతో పంటలు నష్టపోయి రైతులు లబోదిబోమంటున్నా అధికారులు మాత్రం రైతుల వద్దకు వెళ్లడం లేదు. మార్కెట్‌ కమిటీలు ఉన్నా ఉత్తిదే అని తేలింది. మంత్రులు ప్రకటనలకే పరిమితం అయ్యారు. ప్రభుత్వానికి ప్రేక్షక పాత్రగానే మిగిలింది. గత, ప్రస్తుత ప్రభుత్వమేదైనా ప్రచారార్భాటమే తప్ప కొనుగోళ్లపై చిత్తశుద్ధి లేదు. క్షేత్రస్థాయిలో మార్కెటింగ్‌ సిబ్బందిని పంపి ధాన్యం మొత్తాన్ని కొనేలా ప్రణాళికలు సిద్ధం చేయలేదు. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడం అన్నదాతలకు కష్టంగా మారింది. ఇప్పటికే ధరల హెచ్చు తగ్గులతో తీవ్రంగా నష్టపోతున్నారు. వరి, వేరుశనగ, జొన్న, మక్క జొన్న.. పంట ఏదైనా కొనుగోళ్లు సక్రమంగా లేవు. మిల్లుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో రైతులు ఆందోళనకు దిగుతున్నారు. కొన్నిచోట్ల రైతులు మార్కెట్‌ కార్యాలయానికి వెళ్లి అధికారులకు ఫిర్యాదు చేయగా వ్యాపారులను అడగాలని సూచించారు. రైతులు మిల్లుల వద్దకు వెళ్లి కొనుగోలు చేయాలని కోరగా కొందరు నిరాకరించారు. ఓ వైపు మబ్బులు కమ్ముకొస్తున్న వేళ ఉదయం నుంచి సాయంత్రం వరకు చూసి ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో చేసేదేవిూ లేక జిల్లాల్లో వేరుశనగ రైతులు మళ్లీ బస్తాల్లో నింపుకొని ఇళ్లకు తీసుకెళ్లారు. పంట పండించడం ఒక ఎత్తయితే పంట అమ్ముకోవడం మరో ఎత్తవుతున్నది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదు. మిల్లుల వద్దకు వెళ్లి అడిగితే తక్కువ ధరకు కొంటామంటున్నరు. ఎకరానికి 10 క్వింటాళ్లకు పైగా దిగుబడి రావాల్సి ఉండగా, 5 క్వింటాళ్లే వచ్చింది. దిగుబడి తగ్గి నష్టపోగా, ధర లేకపోవడం, వ్యాపారులు కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడంతో సాగుచేయడం భారంగా మారుతోంది. పెట్టిన పెట్టుబడి రాక ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. మద్దతు ధర చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైంది.|farmer|farm|agriculture|farming|farmlife|tractor|farmers|

మరోవైపు ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో అకాల వర్షానికి వడ్ల బస్తాలు తడిసి ముద్దయ్యాయని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ధాన్యం తూకం వేయకుండా, తూకం వేసిన ధాన్యం తరలించకుండా నిర్వాహకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయని, రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి ధాన్యం తడుస్తున్నదని రైతులు ఆందోళనలో ఉన్నారు. కొనుగోలు కేంద్రాల్లో కాంటాల సంఖ్య పెంచి లారీల కొరత తీరుస్తామని హావిూ ఇవ్వాలని కోరుతున్నారు. తామే కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం పది రోజుల నుంచి తూకం చేయడం లేదు. సొసైటీ వాళ్లను అడిగితే రైస్‌మిల్లర్లు వద్దని చెబుతున్నారని సమాధానం ఇస్తున్నారు. జిల్లాస్థాయి అధికారులు స్పందించి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసి మా రైతులను ఆదుకోవాలి. ధాన్యం కొనకపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసింది. మొలకలు వస్తున్నాయి. అధికారులు స్పందించి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాల్సి ఉంది.|farmer|farm|agriculture|farming|farmlife|tractor|farmers|

ఇటీవల కురిసిన అకాల వర్షం రైతులకు అపార నష్టం మిగిల్చింది. పలు గ్రామాల రైతులు విక్రయానికి తీసుకొచ్చిన జొన్నలతోపాటు తూకం వేసిన జొన్న బస్తాలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. జొన్నలను కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చామని, తూకం వేసిన అనంతరం లారీల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొన్నదని రైతులు అంటున్నారు. జొన్న బస్తాలను తరలించేందుకు ఒక్కో బస్తాకి రూ.10-రూ.20 తీసుకుంటున్నారు. రాష్ట్రం అంతటా ఇదే దుస్థితి నెలకొంది. వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టి రైతులకు ఊరట కల్పించాల్సి ఉంది.|farmer|farm|agriculture|farming|farmlife|tractor|farmers|

రైతన్నలకు వాతావరణశాఖ శుభవార్త అందజేసింది. ఈ ఏడాది ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉంది. మే 27ననే నైరుతి రుతుపవనాలు రానున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.. వాతావరణశాఖ అంచనాల ప్రకారం ఈ ఏడాది సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రుతుపవనాల సీజన్‌లో 106 శాతం వర్షపాతం నమోదు కావచ్చని అంచనా వేసింది. ఆగస్టు- సెప్టెంబరు నాటికి ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చని వెల్లడించింది. వాయవ్య, తూర్పు, ఈశాన్య రాష్టాల్లోన్రి కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే అండమాన్‌ను తాకాయి. ఇప్పటికే పంటపొలాలను సిద్ధం చేసుకుని వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. మనదేశంలో నైరుతి రుతుపవనాల వల్లే విస్తరంగా వర్షాలు కురుస్తాయి. వర్షాధార పంటలకూ ఇవే ఆధారం. దేశంలో జూన్‌, జులై నెలలో పడే వర్షాలే అత్యంత కీలకం. సాధారణంగా నైరుతి రుతుపవనాలు కొంచెం అటు, ఇటుగా జూన్‌ తొలివారంలోనే దేశంలోకి ప్రవేశిస్తాయి. గతేడాది జూన్‌ 8న రాగా…ఈసారి వారం రోజులు ముందుగానే పలకరించనున్నాయి. ఒకసారి కేరళలోకి ప్రవేశించిన తర్వాత వారం పదిరోజుల్లోనే దేశవ్యాప్తంగా విస్తరిస్తాయి. తెలంగాణ ఏపీ భూభాగంపైకి విస్తరించి సమృద్ధిగా వర్షాలు కురిపిస్తాయి. వర్షాధార పంటలపైనే ఆధారపడే తెలుగు రాష్టాల్ర ప్రజలకు నైరుతి రుతుపవనాల రాక ఎంతో కీలకం. ఈసారి సకాలంలో వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ కబురుతో రైతుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి.|farmer|farm|agriculture|farming|farmlife|tractor|farmers|

Latest News

గా ఊర్ల పేమ పెండ్లిల్లు నిషేధం!?|ADUGU TRENDS

ఇగీ మద్దెల ఏడ సూసినా, లవ్వు మ్యారేజీలు, లివింగ్ టుగెదర్లేనాయె! గియి ఊర్లు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి దేశాలు, ఖండాంతరాలకు విస్తరించినయి. ఇగ కులం లేదు, మతం లేదు. ఇల0 లేదు....

యూపీ విభజన ప్రతిపాదనా? రాజకీయ వ్యూహమా?|EDITORIAL

దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై చర్చ జరగడం సహజమే. కానీ ఇలాంటి నిర్ణయాలు ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. యూపీ విభజనపై రాజ్‌భర్‌ చేసిన ప్రకటన అధికారిక విధానంగా మారుతుందా?...

సెప్టెంబర్ 23, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 08.43 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శ్రవణ ఉదయం 08.18 వరకు ఉపరి ధనిష్ఠ యోగం సుకర్మ సాయంత్రం 04.50 వరకు ఉపరి ధృతి కరణం బవ ఉదయం 08.03...

పుతిన్ తిరుగులేని నేతేనా!?|EDITORIAL

పుతిన్ రాజకీయ పట్టు బలపడినప్పటికీ, ప్రతిపక్ష స్వేచ్ఛ, ఎన్నికల పారదర్శకత, యుద్ధానికి ముగింపు వంటి అంశాలపై రష్యా ఎదుర్కొంటున్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఆధిపత్యాన్ని కేవలం సీట్ల సంఖ్యతో...

బంగారం కొనే ముందు గీ మూడు సూడాలే!|ADUGU TRENDS

మనం బంగారం, నగలు ఏడ కొంటం? ఔసలోల్ల దగ్గర, బంగారం దుకాణాల్ల కొంటం .పెద్దపెద్ద దుకాణాలకు కూడా పోయేటోల్లు ఉంటరు. కానీ, గీ మూడు ముఖ్యమైన ముచ్చట్లు పట్టించుకోం. కానీ మన సర్కార్...

సెప్టెంబర్ 22, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 07.23 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.14 వరకు ఉపరి శ్రవణ యోగం అతిగండ సాయంత్రం 04.49 వరకు ఉపరి సుకర్మ కరణం వణజి ఉదయం 06.34...

సెప్టెంబర్ 21, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు దశమి సాయంత్రం 05.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది యోగం శోభ సాయంత్రం 04.30 వరకు ఉపరి అతిగండ కరణం గరజి సాయంత్రం 05.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News