ఎన్కటికి… యింటే భారతమే యినాలె… తింటే గారెలే తినాలన్నరు. కనీ, ఇగిప్పుడైతే, తింటే గింటే గీ అవ్వ శేతి గారెలే తినాల్నని తిన్నోల్లంటాండ్రు. మరి, గా గారెల ముచ్చటేందో సూద్దాం పదండ్రి.

ములుగు జిల్ల కమలాపురం మండలంల వంగపల్లె అని ఓ ఊరుంది. గది మస్తుగ జనం వచ్చిపోయే, గా పెద్ద రోడ్డు మీదనే ఉంది. గా రోడ్డు పక్కలే ఓ గుడిసెల గారెలు యేసి బతుకుతాంది దుబ్బాక పమీల. గామెకు పెనిమిటీ, ఇద్దరు కొడుకులు. గీ మద్దెల్నే గా పెనిమిటి కాలం శేసిండు. ఇగ పమీలే గా గారెలేత్తాంది. గయి కమ్మగుండటంతోటి గా దారిల పోయేటోల్లు తప్పకుండ గాడ ఆగి గా గారెలను తింటాండ్రు. ఇగ గీ మద్దెల్నే గామె శేతి గారెలు తిన్న ఓ నెట్టింటాయినె, యీడియలు తీసి, ఇన్ ష్టా నెట్టింట్ల పెట్టిండు. 8 నెలల్నే 9 లచ్చల మంది సూసిండ్రు. 26యేల మంది షేర్ శేసిండ్రు. యేల మంది లైకులు కొట్టిండ్రు. ఇగ గిదీంతోటి గా పమీల గారెలకు మరింత గిరాకీ పెరిగింది.!? పేరుకు పేరొచ్చింది. యేలకు యేలు పైసలు కూడా వత్తానయి. గీమె గారెలు అదిరాయి కదా?

