Sunday, May 10, 2026
35.2 C
Hyderabad

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST
ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA
డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP
ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS
భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD
లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు
వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్ రెడ్డి

తెలంగాణ పోలీసుల ఎదుట మావోయిస్టు అగ్రనేత, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ డిప్యూటీ కమాండర్ సోడిమల్ల కేశాలు లొంగిపోయారు. అతనితోపాటు మొత్తం 42 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. ఛత్తీస్‌గఢ్` తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల నుంచి వచ్చి వీరంతా లొంగిపోయారు. ములుగు, భూపాలపల్లి విÖదుగా పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోతున్నట్లు ప్రకటించారు.అనంతరం సరిహద్దుల నుంచి పోలీసులు వీరిని వాహనాల్లో హైదరాబాద్‌కు తరలించారు. మావోయిస్టు నేత హిడ్మా గెరిల్లాను వదిలి దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీకి వెళ్లిన తర్వాత బెటాలియన్ బాధ్యతలను బడ్సే దేవాకు, కేశాలుకు అప్పగించారు. అయితే, కొన్ని రోజులు కిందటే కమాండర్ దేవా.. తెలంగాణ పోలీసుల ఎదుట లొంగుపోయారు. ఆ తర్వాత బెటాలియన్ బాధ్యతలు నిర్వహిస్తున్న సోడిమల్ల కేశాలు సైతం తాజాగా శుక్రవారం లొంగిపోయారు. ఇతనికి సోడిమల్ల అలియాస్ కేశాలు అలియాస్ నిఖిల్ వంటి పేర్లున్నాయి. ఈ మేరకు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ప్రెస్ విÖట్ నిర్వహించారు.మొత్తం 42 మంది మావోయిస్టులు ఆయుధాలతో లొంగిపోయినట్లు తెలిపారు. వీరిలో గెరిల్లా బెటాలియన్ కమాండర్ సోడిమల్ల అలియాస్ కేశాలు అలియాస్ నిఖిల్ ఉన్నారని వెల్లడించారు. తెలంగాణ పోలీసుల ఎదుట ఆయుధాలు, బంగారంతో లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసినట్లు చెప్పారు. 36 తుపాకులు, ఐదు ఏకే 47లు, నాలుగు ఎసఎలఆర్‌లు, 1,007 తూటాలతో పోలీసులు ముందు మావోలు లొంగిపోయినట్లు పేర్కొన్నారు. అలాగే 800 గ్రాముల బంగారం సైతం అప్పగించినట్లు వెల్లడించారు. వీరి లొంగుబాటుతో అత్యంత కీలకమైన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పూర్తిగా కనుమరుగైనట్లు డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు.గత ఏడాదిన్నర కాలంలో 763 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం 42 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా డీజీపీ ఎదుట లొంగిపోయారు. వీరిలో బెటాలియన్ డిప్యూటీ కమాండర్ కేశాలు కూడా ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో కూంబింగ్ పెరగడంతో మావోయిస్టులు తెలంగాణ పోలీసులను ఆశ్రయించారు. లొంగిపోయిన వారిలో ఒక్కరు మాత్రమే తెలంగాణకు చెందివారు కాగా.. ఎక్కువమంది ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారే. ‘లొంగిపోయిన వారికి పునరావాస ప్యాకేజీ కింద రూ.1.93 కోట్లు అందజేస్తున్నాం. సీఎం ఆదేశాల మేరకు ఆరోగ్యకార్డులు అందజేస్తాం. తెలంగాణకు చెందిన వాళ్లు సెంట్రల్ కమిటీలో 11 మంది ఉండేవారు. ఇప్ప్పుడు ఇద్దరున్నారు. స్టేట్ కమిటీలో తెలంగాణ వాళ్లు 24 మంది ఉండేవారు. ఇప్ప్పుడు ఇద్దరే ఉన్నారు. వాళ్లు కూడా లొంగిపోవాలని పిలుపునిస్తున్నాం అని డీజీపీ శివధర్‌రెడ్డి పేర్కొన్నారు.

Latest News

తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం|TAMILNADU|CM|THALAPATAHY VIJAY

కొత్త శకం ఆరంభం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, సినీ నటుడు జోసెఫ్ విజయ్ ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చెన్నైలోని జవహర్లాల్...

అసలే కోతి.. ఆపై సవురం!?|ADUGU TRENDS

పని లేని ఒకాయినె పిలిసి పిల్లి తల కొరిగిండని సామెత. గది సరే గనీ, మరి గీ కోతి మాత్రం.. ఏకంగా గా మంగళాయనె దగ్గరికి పోయి, సవురం శేయించుకుంది. గీ యింతేందో...

తమిళనాట కొత్త కథా చిత్రం!|EDITORIAL

తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ వీడింది. గత కొన్ని రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ప్రజా తీర్పు తర్వాత కొనసాగిన అనిశ్చితి, పెద్ద పార్టీల కుట్రలు, చిన్న పార్టీల బేరసారాలు, మద్దతు లేఖల హైడ్రామా,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|RASHI PHALALU|WEEKLY|TODAY

మే 10 నుండి మే 16 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. పనుల్లో ఆలస్యాలు తగ్గి ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో...

గింత బట్ట తున్కతోటి గంత పట్టీలా!?|ADUGU TRENDS

పని ఎంత పెద్దదైనా, శిన్న శిన్న శిట్కాలతోటి సిడెంల శేయొచ్చు. గా ఆటల పోటీలకు, ఎవలన్న ముక్యమైనోల్లు వచ్చినప్పుడు పట్టీలు, ముగ్గులు ఏత్తరు కదా? గయి ఏయాల్నంటే బొచ్చెడు పని మనుసులు, శానా...

తమిళనాడు హంగ్-గవర్నర్-టీవీకే కింకర్తవ్యం?|EDITORIAL

హంగ్ సమయంలో ఎవరిని ముందుగా పిలవాలి? అతిపెద్ద పార్టీనా? లేక మెజారిటీ మద్దతు ఉన్న కూటమినా? అన్న విషయంలో రాజ్యాంగం స్పష్టమైన విధానం నిర్దేశించలేదు. ఇక్కడే గవర్నర్ విచక్షణాధికారం ప్రాధాన్యం సంతరించుకుంది. మన...

09-05-2026 శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి ఉదయం 09.15 వరకు ఉపరి అష్టమి నక్షత్రం శ్రవణ రాత్రి 07.05 వరకు ఉపరి ధనిష్ఠ యోగం శుక్ల రాత్రి 10.43 వరకు ఉపరి బ్రహ్మ కరణం బవ ఉదయం...

ట్యూబ్ కు పొక్క.. తెల్సుకోండ్రి గిట్ల!?|ADUGU TRENDS

గా చైనాల గిప్పటికీ సైకోల్లే తొక్కుతాండ్లట. గిప్పుడైతే గయి మన దేశంల మోటైపోయినయి గనీ, ఎన్కటికి సైకోల్లు ఎక్కువ తొక్కేది. గదే పెద్ద రెండు గిర్రల బండి. ఇగ ఇంట్లనే గాలి కొట్టేది....

ధాన్యం కొనుగోల్ మాల్!|EDITORIAL

దేశంలో వ్యవసాయం ఇప్పటికీ కోట్లాది కుటుంబాల జీవనాధారం. కానీ రైతు పండించిన పంటను ప్రభుత్వాలు కొనుగోలు చేసే విధానం ప్రతి ఏడాది గందరగోళానికీ, వివాదానికీ కారణమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల టన్నుల...

08-05-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి ఉదయం 08.05 వరకు ఉపరి సప్తమి నక్షత్రం ఉత్తరాషాఢ సాయంత్రం 05.26 వరకు ఉపరి శ్రవణ యోగం శుభ రాత్రి 11.02 వరకు ఉపరి శుక్ల కరణం వణజి ఉదయం...

తాలు, తేమను తీసే మిషిని!?|ADUGU TRENDS

రోజులు మార్తానయి. గట్లనే గా యెవుసం శేసే పద్ధతులు గూడ మార్తానయి. అన్నిట్ల లెక్కనే గిండ్ల గూడ మిషిన్లొత్తానయి. అయితే కొత్త ఆలోశెనలు, సరికొత్త ఉపాయాలను తెత్తానయి. గసొంటిదే గిది మీరే సూడుండ్రి. యెద్దు,...

విపరీత రాజకీయ ధోరణులు!|EDITORIAL

ప్రపంచంలోనే అతిపెద్దదైన భారత ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక.. ప్రజల తీర్పు, పాలనపై సమీక్ష, భవిష్యత్ దిశను నిర్ణయించే కీలక ఘట్టం. ఇటీవలి 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల వైఖరులు,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News