ఎన్కటికి పుట్టమన్ను తెచ్చి గట్టిగ అల్కితే ఇంట్ల నేలంతా సాపుగ ఉండేది. కాసింత డబ్బున్నోల్లు సాపాతు బండలేసుకునేటోల్లు. ఇగ గిప్పుడైతే టైల్లు, గ్రానైట్లు వచ్చినయి. యెన్కటి లెక్క ఓ అక్క ఏం శేసిందో సూడుండ్రి.

దిమ్మిసతో గుద్ది గచ్చు సాపుగ శేయించింది. గదాని మీద మంచిగ డబ్బలు డబ్బలుగ రంగులేసింది. ఇగ గివి టైల్స్ లెక్కనే మంచిగ కన్పిస్తానయి. సూపునకు ఎక్కువ.. కర్సుకు తక్కువ..ఉండేటట్లు ఇకమతు శేసింది గీ అక్క.

