Friday, July 17, 2026
24.5 C
Hyderabad

శాసనసభలో బడ్జెట్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పిన కెసీఆర్.. నాలుగేళ్లల్లో చేసిన మాఫీ రూ.16,143 కోట్లు అని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వడ్డీ పోగా వీళ్లు మొదటి ఐదేళ్లల్లో చేసిన రుణమాఫీ 13,514 కోట్లు మాత్రమేనన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక నాలుగేళ్లు రైతుల రుణమాఫీకి రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. చివరి ఏడాదిలో 21,35,557 మంది రైతులకు రూ.11,909 కోట్లు మాత్రమే మాఫీ చేశారన్నారు. అలాగే పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన రుణమాఫీ రూ.16,908 కోట్లు మాత్రమేనని చెప్పారు. బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని రుణమాఫీ చేయలేదని మాట్లాడుతున్నారన్నారు. పది నెలల్లో మేం 25,35,964 మంది రైతులకు రూ. 20,616,89 కోట్లు మాఫీ చేశామన్నారు. అలాగే పదేళ్లలో మీరు చేసింది ఎంత? పది నెలల్లో మేం చేసింది ఎంత? చూడండి అంటూ సవాల్ చేశారు. BRS పార్టీని ప్రజలు ఉరి తీసినా మీ ఆలోచనా విధానంలో మార్పు రాలేదన్నారు. వాళ్లు ఎగ్గొట్టిన రైతు బంధు రూ.7,625 కోట్లు మా ప్రభుత్వం చెల్లించింది అన్నారు. అలాగే రూ.4666.59 కోట్లు రెండో విడత రైతు భరోసా అందించాం అని చెప్పారు. రైతు భరోసాను రూ. 10 వేల నుంచి రూ. 12 వేలకు పెంచామన్నారు. అలాగే వరి వేస్తే ఉరి అని చెప్పిన వాళ్లు ఫామ్ హౌస్ లో పండిన వడ్లను క్వింటాల్ రూ.4500 చొప్పున కావేరి సీడ్స్ కు అమ్ముకున్నారన్నారు. కానీ మేం రూ.11 వేల 61 కోట్లు సన్న వడ్లకు బోనస్ ఇచ్చామని గర్వంగా చెప్తున్నాం అన్నారు. ఉచిత కరెంట్ కాంగ్రెస్ పేటెంట్ హక్కు అని చెప్పారు. రాష్ట్రంలో 29,14,692 మంది రైతులకు రూ.15,332 కోట్లు వెచ్చించామన్నారు. గత ప్రభుత్వం పెట్టిన రైతు బీమాను కొనసాగిస్తున్నాం అన్నారు. మీరు పదేళ్లు చేయలేనివి మేం పదినెలల్లో చేస్తే అభినందించాల్సింది పోయి కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు అని దుయ్యబట్టారు. అలాగే నన్ను అభినందించకపోయినా ఫరవాలేదు… ప్రభుత్వాన్ని అభినందించవచ్చు కదా అని అన్నారు. అలాగే 16 మంది ముఖ్యమంత్రులు చేసిన అప్పు 2014 నాటికి మొత్తం అప్పు రూ.90,160 కోట్లు అని చెప్పారు. పదేళ్లలో వాళ్లు చేసిన అప్పు 1.12.2023 నాటికి రూ. 6,69,257 కోట్లు అని చెప్పారు. ఇది కాకుండా 40 వేల 154 కోట్లు పేమెంట్స్ పెండింగ్ లో పెట్టారని విమర్శలు చేశారు. ఇవి కలిపితే వాళ్లు పదేళ్లలో చేసిన మొత్తం అప్పు రూ. 8,19,151 కోట్లు అని మొత్తం లెక్కలు చెప్పారు.ఇక వాళ్లు సాధించిన ఘనత ఏమిటో వాళ్లే చెప్పాలన్నారు.పదేళ్లలో ఒక పార్టీ, ఒక కుటుంబం చేసిన అప్పు ఏడున్నర లక్షల కోట్లు అని బల్లగుద్ది చెప్పారు.మేం వచ్చిన పదిహేను నెలల్లో చేసిన రూ.1,58,041 కోట్లు, ఇందులో డిసెంబర్ 2023 నుంచి 28 ఫిబ్రవరి 2025 వరకు చెల్లించిన అసలు మొత్తం రూ. 88,591 కోట్లు, డిసెంబర్ 2023 నుంచి 28 ఫిబ్రవరి 2025 వరకు చెల్లించిన వడ్డీ మొత్తం రూ. 64,768 కోట్లు చెల్లించామని చెప్పారు. పదేళ్లలో వాళ్లు చేసిన అప్పులకు అసలు, వడ్డీ కలిపి మేం తిరిగి చెల్లించిన మొత్తం రూ. 1,53,359 కోట్లు అని పూర్తి లెక్కలు వివరించారు. అలాగే వాళ్లు చేసిన అప్పులకు చెల్లించినవి పోగా… 15 నెలల్లో మా ప్రభుత్వం చేసిన నికర అప్పు రూ.4,682 కోట్లు మాత్రమేనని చెప్పారు.

Latest News

కరువు కోరలు!|Fangs of drought

ఇప్పటికి 33శాతమే వర్షం నమోదు!! రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రం అడుగంటుతున్న జలాశయాలు జీవ నదుల్లోనూ జల జీవమే లేదు రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి సాగుకు తొందరొద్దంటున్న నిపుణులు ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ 20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలేయొద్దు బోరుబావుల కింద వరి...

మొక్క నాటుండ్రి.. డిస్కౌంట్లు పొందుండ్రి!?|ADUGU TRENDS

పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ...

‘ఢీ’లిమిటేషన్ రాజకీయాలు!?|EDITORIAL

డీలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ సంస్కరణలలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య మార్చే ప్రక్రియ కాదు, భవిష్యత్ రాజకీయ ప్రాబల్య సమీకరణాలను నిర్ణయించే కీలక ఘట్టం....

జూలై 17, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం దక్షిణాయణం ప్రారంభం తిధి తదియ ఉదయం 09.54 వరకు ఉపరి చవితి నక్షత్రం మఖ రాత్రి 10.51 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది ఉదయం 05.00 వరకు ఉపరి వ్యతీపాత కరణం గరజి ఉదయం 09.54...

సింధు నాగరికత|ADUGU|SPECIAL|COMPITITIVE|EXAMS

నాగరికత మరియు సంస్కృతికి తేడా నాగరికత పూర్తిగా అభివృద్ధి చెందిన మరియు ఉన్నతమైన జీవనాన్ని గడిపినట్లయితే మరియు ప్రజలు పట్టణ, శాస్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ఉంటే దానిని నాగరికత అంటారు. సంస్కృతి సంస్కృతి అనేది ప్రతీ ఒక్కరికీ...

‘ప్రభంజన’ పథం ప్రజ్వరిల్లాలి|ESSAY|SPECIAL

జూలై 16, 2025. సరిగ్గా ఏడాది క్రితం జర్నలిస్టు, వక్త, కవి, రచయిత, మేధావి, అభ్యుదయవాది, వివేకశీలి, చైతన్యవంతుడు, నిరంతర పోరాట శీలి అయిన ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ పరమపదించారు....

రోడ్లకు కూడా ఆపరేషన్లు!?|ADUGU TRENDS

గిప్పటి దాకా మనం మనుసులకు, జంతువులకు ఆపరేషన్లు సేసుడే సూసినం. కనీ, గీ యింతను ఎక్కడా సూడలే.! గా బిహార్ రాస్ట్రంల కొత్తగ, ఎక్కడా లేని లెక్కల, రోడ్లకు కూడా ఆపరేషన్లు సేత్తాండ్రు....

నదుల అనుసంధానమే జల భద్రతకు శాశ్వత మార్గం!|EDITORIAL

ఎల్‌నినో ప్రభావాన్ని ఆపడం మన చేతుల్లో లేదు. కానీ, దాని వల్ల కలిగే నష్టాన్ని శాస్త్రీయ ప్రణాళికలు, సమర్థమైన జల నిర్వహణ, నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయం ద్వారా...

జూలై 16, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం పూరి జగన్నాధ రధోత్సవం తిధి శు విదియ ఉదయం 11.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.40 వరకు ఉపరి మఖ యోగం వజ్ర ఉదయం 08.20 వరకు ఉపరి సిద్ది కరణం కౌలవ...

ఆషాఢమాసం రహస్యాలు|ASHADAM|SECRETS

ఆచారాలు, శాస్త్రం, సంప్రదాయాల వెనుక నిజాలు ఆషాఢమాసం విశేషాలు – ఆధ్యాత్మికత, ప్రకృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాల వెనుక అసలు కథ ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం... ప్రతి సంప్రదాయం వెనుక ఒక జీవన...

ఉడుతా మిడతా!?|ADUGU TRENDS

మనం మన సుట్టుముట్టు ఉడుతల్ని సూత్తనే ఉంటం. పొలాలల్ల, రోడ్ల మీద అటిటుపోతనే ఉంటయి. సిడెం సేపట్లనే కనబడ్తయి, ఆడ్తయి. ఉరుకుతయి. ఎన్కట గా రాముడికి వారధి కట్టుట్ల గీ ఉడుత సాయం...

ఓటర్ల సవరణకు శాశ్వత పరిష్కారం లేదా!?|EDITORIAL

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, పట్టణాల్లో వార్డు కార్యాలయాలు, మీ సేవ వంటి పౌర సేవా కేంద్రాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తే ప్రజలకు సౌలభ్యం పెరుగుతుంది. బీఎల్‌వోలపై పూర్తిగా ఆధారపడకుండా బహుళస్థాయి ధ్రువీకరణ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News